Not Home Yet!
చికాగో విశ్వవిద్యాలయంలో ఇస్లాం మీద పరిశోధన చేస్తున్న ఎలిజబెత్ లొస్ట్ ఈ ఏడాది మాడిసన్ లో తెలుగు కూడా నేర్చుకుంది. "నాన్న రాలేదు" అనే కవితని ఆమె ఇంగ్లీషులోకి అనువాదం చేసి, మాడిసన్ లో జరిగిన దక్షిణాసియా సాంస్కృతిక ఉత్సవంలో అద్భుతమయిన కరతాళ ధ్వనుల మధ్య వినిపించింది. ఈ కవితని ఆమె తెలుగులో, నేను ఇంగ్లీషులో చదివాం.


Nanna [Father] has not come home yet
And yet ... And yet ...
He has not come home yet


This city is burning beneath my eyes
This city is burning under my feet


Nanna has not come home yet

Again and again she turns back,
Conversing with the clock on the wall, Amma [Mother]


She stares at the hands on the clock.
Eight ... Nine ... Ten

Nanna has not come home yet


Amma might be counting seconds,
Or counting the bodies
Seen on the TV. I don’t know.

Come, Nanna!

Right now, the smell of roasting rotis
Right now, ground tomato, chilli, chutney
Hunger is screaming, Nanna.

Without your coming, Amma won’t let me touch
A grain of rice.
Come quickly, Nanna!

Amma is glued to the back door
Right now it’s been a long time
Since you said you’d just go and come.
Nanna has not come home yet.

“Amma! I’m hungry!”

“The city’s burning, you know?!
There’s always so much hunger!
Just kill me, cut me up, and eat me.”
Yelling this, she then muttered...

“It’s not finished yet.
It hasn’t burned yet.
Dead bodies heaped in piles,
Blankets of flame still burning,
They are still burning ... since ‘47 ... ”

Nanna didn’t come home that night
This night neither.
Category: 9 comments

9 comments:

Anil Atluri said...

అద్బుతం..ఎలిజబెత్ లొస్ట్గారికి అభినందనలు అందజేయగలరు..అఫ్సర్ గారు!

dhaathri said...

good poem and good translation congrats sir.....love j

కెక్యూబ్ వర్మ said...

claps claps...congrats

kavi yakoob said...

Bloglo kavitvapu panduga la vundi...ee samrambham..

Anil Atluri said...

అఫ్సర్ గారు, ఒక చిన్న సూచన. మీ ఈ విద్యార్ధిని లాగానే మరికొందరు విదేశీయులు, తెలుగు నేర్చుకుని, తెలుగులోనే వ్రాత కోతలు సాగించిన వారున్నారు. జర్మన్‌లు, రష్యన్లు, కెనడియన్లను, ఫ్రెంచ్ దేశస్తులను నేను కలిసాను. అప్పట్లో వారికి కొన్ని తెలుగు పుస్తకాలను కూడా బహుకరించాను. దురదృష్టవశాత్తు, వారి వివరాలేవి ఇప్పుడు నా దగ్గిరలేవు. అలాంటి విదేశీయుల తెలుగు సాహిత్యాన్ని ఒక చోటకి సేకరించగలిగితే బాగుంటుంది. అది మీ ఈ విద్యార్థి ఎలిజబెత్ గారితోనే మొదలు బెట్టవచ్చు కదా! మీరు బ్లాగులో ఈ పోస్టతో మొదటి అడుగు వేసినట్టే..మొదటి ఇటుక పేర్చినట్టే!! ఏమంటారు?

Afsar said...

@అనిల్: మీరు చెప్పింది అందంగా వుంది. కానీ, ఇందులో వొక సమస్య కూడా వుంది. ఇంగ్లీషులోనూ, ఇతర భాషలలో సృజనాత్మకతకి సంబంధించిన విషయం. అమెరికన్ లూ, యూరోపియన్లూ ఎంత కష్టపడి మన భాష నేర్చుకున్నా, అందులో సృజనాత్మక రచన చేయగలిగే శక్తి వారికి వస్తుందని నేను అనుకోవడం లేదు, ముందు ముందు ఎవరయినా విపరీతంగా కష్టపడీ, రాసీ, తప్పని నిరూపిస్తే తప్ప! ఇంగ్లీషు విషయం వేరు. సాధనతో మనం ఇంగ్లీషులో సృజనాత్మక రచన చెయ్యవచ్చు, ఎందుకంటే, ఆ భాష మన సంస్కృతిలో ముఖ్యంగా అక్షరాస్యత వున్న వర్గాలలో కలగలిసి పోయిన భాష. అది అంతగా పరాయీ భాష కాదు. అందుకే, రామానుజన్ లాంటి వారు ఇంగ్లీషులో రాసి కూడా మెప్పించగలరు, కానీ, ఎంత పాండిత్యం వున్నా డేవిడ్ షుల్మన్ తెలుగులో కవిత్వం చెప్పగలడన్న నమ్మకం నాకు లేదు. అమెరికాలో గానీ, యూరప్ లో గానీ తెలుగు నేర్చుకున్న వాళ్ళ పరిధి అంత దూరం వెళ్తుందని నేను అనుకోను. వీళ్ళు మంచి అనువాదాలు చెయ్యగలరు. అనువాదం సృజనాత్మక రచన కాదా అంటే అది వేరే చర్చ.

అందుకే, చాలా మంది తెలుగు నేర్చుకున్న విదేశీయులు అనువాదాల్లో వుండి పోయారు, తెలుగు నేర్చుకొని సృజనాత్మక రచనలు చేసిన వాళ్ళని ముందు ముందు చూస్తామేమో! ఎందుకంటే, నా అనుభవంలో అర్థమయిన విషయం - మన వాళ్ళ కంటే తెల్లవాళ్లు తెలుగు బాగా నేర్చుకుంటారు!త్వరగా నేర్చుకుంటారు కూడా!

ramperugu said...

Very good Afsar Sir..Iam posting this in my International Poets society Group..with u r permission...!

Afsar said...

@Ramakrishna gaaru: Thanks a lot for your kindness. No permissions needed, just go ahead and post it. I totally believe that poetry is public. Once it's out, the poet has no authority over it!

Santha Susarla said...

good one afsar garu!

Web Statistics