Monday, July 11, 2011
కొన్ని పంక్తులు ఇలా కూడా...
1
-ఈ పూటకి వాడి రొట్టి ముక్క గాలికి ఎగిరిపోతూ, వాడి వైపు కనీసం జాలిగా చూడలేదు
-ఆమెని అలా ఆ కరెంటు స్తంభం కింద సాయంత్రం కూడా చూశాను, ఇంకేం వెతుకుతూ వుందో తెలీదు గాని.
-సర్లే అని వెళ్ళిపోయిన పిల్లాడు రాత్రికి కూడా రాలేదు, భరించలేని సన్నివేశాల్లో అతను చిక్కుకోవడం వూహించలేను గాని, నిజం అంత కంటే భయంకరమేమో అన్న వూహ నన్ను నులిమేస్తోంది.
2
- వార్తా పత్రికలూ టీవీలూ సెల్ఫోన్లూ వదంతులూ చెవుల చుట్టూ జోరీగలూ లేని వొకానొక శుద్ధ పరిశుద్ధ క్షణమేదో అతను చెప్పలేదు, కానీ - అతని కవిత్వం నిండా వొక అమాయకత్వపు మాయ.
- విగ్రహాలూ విధ్వంసాలూ ఆత్మహత్యలూ హత్యలూ కరువులూ నిరుద్యోగాలూ ఆకలి కడుపులూ వీధుల మీద పోస్టర్లయి తిరుగుతున్న మనుషులూ వూరేగింపులవుతున్న అసహనాలూ చావు కేక వేస్తున్న పసితనాలూ- వొక్క అరక్షణం కూడా నేనొన్టరిని వొక్కణ్ణే నేనొక్కణ్ణే అని గావు కేక వెయ్యలేను.
3
దేశమూ మట్టి వాసనా నా నేనూ నేనయిన మీ అందరూ
ప్రేమించలేను దేన్నీ
విడిచీ పెట్టలేను దేన్నీ
సర్లే ఫో అని ముఖమ్మీద తలుపు కొట్టలేను ఎప్పుడూ.
కొన్ని ఎడ్పుల తరవాత
నేలని కొట్టుకునీ కొట్టుకునీ
మట్టికి అతుక్కుపోయిన శరీరమా, నువ్వేమయినా మాట్లాడు!
4
కొన్ని వాక్యాలకి వాక్యాలు ధార పోసానా,
వొక్క పదంలోనూ నేను విరిగిన అద్దాన్ని కాను.
5
ఛ..ఛ..
ఇంకేం రాస్తాం బే, కవిత్వం!
ముసుగు మీద
ముసుగు మీద
ముసుగు మీద ముసుగు.
Subscribe to:
Post Comments (Atom)
నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం
అఫ్సర్ కవితాసంపుటి ‘యుద్ధం మధ్యలో నువ్వు’ రచన: ఎమ్వీ రామిరెడ్డి - ఈమాట నుంచి-- ‘‘సమయం లేదు. యెవరిదగ్గిరా కనీసం అరక్షణం లేనే లేదు. సహనం...
-
శ్రీశ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ ల...
-
1 అ ర్థరాత్రి మెలకువొస్తుంది. వున్నట్టుండి లేస్తావు. మూత్రం వస్తున్నట్టుగా శరీరంలో వొక అసౌకర్యమైన చలనం. అటు తిరిగి పడుకొని వున్న శాం...
-
ఈ వారం టెక్సాస్ టెంపుల్ లో తెలుగు సాహిత్య సదస్సు జరగబోతోంది. సాధారణంగా టెక్సాస్ లో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా అది వొక పెద్ద పండగ, వొక ...
11 comments:
oka aarthi..oka daahamu..o nisshayatha
chala chall bagundi sir
-Vishaldev
ఇటివలీ కవి అనుభవాల మీది స్పందన అని అనుకోవచ్చా?
koncham kottahga...baagundi sir.
kavitha meeda kavitha raaydam okkokka musuguni kappu kovatama? leka mellaga okkokka musuguni theesi, fresh gaa undatama?
చాలా బావుంది...ఇవన్నీ మీరు రాసినవా? లేదా మీరు కలక్ట్ చేసినవా?
చాలా కొత్తగా ఉన్నాయి అన్ని పంక్తులూ.
చివరిది చూసాక "చారుగా చారుగా చారుగా" అన్న పదవిన్యాసం గుర్తుకు వచ్చింది :)
@విశాల్: ధన్యవాదాలు
@అనిల్: అన్నీ కవి అనుభవాలే. కాకపోతే, కవి బహువచనం!
@రోహిత్: థాంక్ యు! అవును, కవిత మీద కవిత ముసుగు తీయడానికే! 'అచ్చ" కవిత్వపు ముసుగు తీయడానికి!
@ఆ. సౌమ్య: ఈ పంక్తులు నా పాడు బుర్రలో పుట్టిన పురుగులే. నేను అంత మంచి కలెక్టరుని కాదు! "పదవిన్యాసం" వెనక బాధని కూడా చూడండి.
ప్రతి వాక్యం వెంట గాభరాగా పరుగెత్తుకుంటూ పోయి చివరొక్కసారి ఆగి మళ్ళీ ముందుకు...అలా అలా సాగుతూనే వుండిపోయింది...చాలా కొత్తగా..థాంక్స్ సార్...
@వర్మ; మీ పఠనానుభవం బాగుంది. అవును, ఆ పంక్తులు నన్ను కూడా అలాగే గాభరా పెట్టాయి!
చాలా ఆర్త్రంగా ఉన్నాయి సార్ ఈ వాక్యాలు
బాగా నచ్చాయి..
"వార్తా పత్రికలూ టీవీలూ సెల్ఫోన్లూ వదంతులూ చెవుల చుట్టూ జోరీగలూ లేని వొకానొక శుద్ధ పరిశుద్ధ క్షణమేదో అతను చెప్పలేదు,"
''విగ్రహాలూ విధ్వంసాలూ ఆత్మహత్యలూ హత్యలూ కరువులూ నిరుద్యోగాలూ ఆకలి కడుపులూ వీధుల మీద పోస్టర్లయి తిరుగుతున్న మనుషులూ వూరేగింపులవుతున్న అసహనాలూ చావు కేక వేస్తున్న పసితనాలూ- వొక్క అరక్షణం కూడా నేనొన్టరిని వొక్కణ్ణే నేనొక్కణ్ణే అని గావు కేక వెయ్యలేను."
ఈరోజు రోడ్డు మీద ఒక పిల్లవాడిని చూసినప్పుడు "ఈ పూటకి వాడి రొట్టి ముక్క గాలికి ఎగిరిపోతూ, వాడి వైపు కనీసం జాలిగా చూడలేదు" ఈ వాక్యం గుర్తొచ్చింది. మీ పంక్తులు నన్నింతలా వెంటాడుతున్నాయని అనుకోలేదు.
ఒక్కొక్కప్పుడు మనసు చుట్టూ (మెడచుట్టూ బిగుసుకున్నట్టు) ఓ తాడు బిగుసుకుంటున్న ఫీలింగ్ కలుగూతూంటూంది చాలా రేర్ గా ......అలాంటిదే ఇప్పుడు మళ్ళీ....ఉక్కిరిబిక్కిరయి...తేరుకుని ఆ శుధ్ధక్షణం కోసం చెప్పే ప్రవక్తలకోసం ఎదురుచూడ్డం అనే ఆలోచనలో మునిగిపోయి.....మళ్ళి తేరుకుని మళ్ళి చదివి.....గుర్తుపెట్టుకునే పదాలకోసం వెతుకుతొ......చివరికొచ్చేసరికి ఏదో ఇలా అనిచెప్పలేని భావన....చర్నాకోలా మీదపడినట్టు.....
Poetic prose!!
Post a Comment