విజయవాడ బుక్ ఫెస్టివల్ లో "అనేక" విడుదల!

విజయవాడ బుక్ ఫెస్టివల్ లో “అనేక” విడుదల!

సారంగ బుక్స్ తొలి ప్రచురణ “అనేక” పదేళ్ళ కవిత్వం జనవరి రెండో తేదీన విజయవాడ బుక్ ఫెస్టివల్ లో విడుదల అయ్యిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అఫ్సర్, వంశీకృష్ణలు సంపాదకత్వం వహించిన ఈ కవిత్వ సంకలనం మొత్తం 404 పేజీలు, దాదాపు 200 మంది కవుల కవితలు ఇందులో వున్నాయి.

వెల: 199 రూపాయలు.

ప్రతులు కావలసిన వారు: ప్రస్తుతం విజయవాడ బుక్ ఫెస్టివల్ లో బుక్ స్టాల్ 232 లో అడగండి.
గుడిపాటి సెల్ నంబరు : +91 984 878 7284 (from outside India), 984 878 7284 (from within India)


సారంగ గురించి మరిన్ని వివరాలకు చూడండి: http://saarangabooks.com/
Category: 5 comments

5 comments:

కెక్యూబ్ వర్మ said...

నిన్నంతా మా పెద్దవాడు తిరిగినా అక్కడ పట్టుకోలేకపోయాడంట, నవయుగ వాళ్ళని అడిగితే ఇంకా మా వరకు రాలేదన్నారంట సారూ. ఈరోజు స్టాల్ కు వెళ్ళమని చెప్పా...

cbrao said...

వంశీకృష్ణ ఎవరు? పరిచయం చేయ కోరుతాను.

Afsar said...

రావు గారు:

వంశీ కవి, కథకుడు, విమర్శకుడు. 1990లలో రచనా వ్యాసంగం ప్రారంభించారు. “డబ్బు పిట్ట” తో సహా నాలుగు కవిత్వ సంపుటాలు, వివిధ వచన రచనలు అచ్చు వేశారు. “విదేహ” ద్వారా లేఖా సాహిత్యానికి పూర్వ వైభవం తీసుకు వచ్చారు. సినిమా, టీవీ వంటి పాపులర్ సాంస్కృతిక అంశాల మీద విమర్శ నాత్మక వ్యాసాల ద్వారా కల్చరల్ స్టడీస్ లో విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రపంచీకరణ తరవాతి ఆర్ధిక పరిణామాలు నేపధ్యంగా కవిత్వం, విమర్శ రాసిన తొలి విమర్శకులలో ఆయన వొకరు. ముఖ్యంగా కథ, కవిత్వ ప్రక్రియల గురించి ఆయన విస్తృతంగా వ్యాసాలు రాస్తున్నారు. వృత్తి రీత్యా గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్నా, వర్తమాన సాహిత్య రంగంలో వంశీ నిత్య కృషీ వలుడు. విస్తృతమయిన అధ్యయనం, సునిశితమయిన విశ్లేషణ, లోతయిన విమర్శ, నిండయిన భావుకత వంశీ కృష్ణ ముద్ర. ఈ ఏడాది ఆయన మరో కవిత్వ సంపుటి, సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి వెలుగులోకి రానున్నాయి. ప్రపంచీకరణ తరవాత సాహిత్యం, సినిమా, కళలు ఎలాంటి మార్పులకి గురయ్యాయో వివరిస్తూ, జీవన మూల్యాల్ని కాపాడే మార్పు పక్షాన నిలబడే విమర్శకుడు వంశీ.

అతని ఈ చిరునామా: "vamseekrishna vamsee" ,

Afsar said...

rao gaaru: here is his email

"vamseekrishna vamsee" ,

cbrao said...

వంశీకృష్ణ  బ్లాగు ఇప్పుడే చూశాను. విదేహ పేరుతో లేఖా సాహిత్యం అభినందనీయం. తెలుగులో లేఖా సాహిత్యం తక్కువ.  సంజీవదేవ్ లేఖా సాహిత్యం తో నాకు లేఖా సాహిత్యం పరిచయమయ్యింది. దరిమిలా లేఖల ద్వారా  సంజీవదేవ్ మంచి మిత్రులయ్యారు.

Web Statistics