నాన్న కోసం వొక పద్యం!
నాన్నని
ఆకాశంలో సమాధి చేశాను
అప్పటి నించీ, పక్షులు
ఆయన తల దువ్వుతున్నాయి
స్నానం చేయిస్తున్నాయి
ప్రతి రాత్రీ
దుప్పటిని ఆయన గడ్డం దాకా కప్పి నిద్ర పుచ్చుతున్నాయి

నాన్నని
నేలలో సమాధి చేశాను
అప్పటి నించీ, నా నిచ్చెనలు
కిందికే దిగుతున్నాయి
నేలంతా ఇల్లయింది
గంటలు దాని గదులు
అవి ప్రతి సాయంత్రం బార్లా తెరుచుకుని వుంటాయి
వొక్కో అతిధినీ అక్కున చేర్చుకుంటూ.

కొన్ని సార్లు వాళ్ళంతా
పెళ్లి విందు కోసం
నడిచి వెళ్ళడం చూస్తాను

నాన్నని
నా గుండెలో సమాధి చేశాను
ఆయన నాలో పెరుగుతున్నారు,
నా అల్లరి కొడుకులా

పాలు తాగను పో అని మారాము చేసే నా చిట్టి తండ్రిలా.

నీరవ నిశీధిలో దిగడిపోయిన చిన్ని పాదం లా.

ఇప్పుడే నిప్పులో కడిగిన చిన్ని గడియారపు స్ప్రింగులా.

చిన్ని ద్రాక్షలా రేపటి ద్రాక్షాసవానికి కన్న తండ్రిలా.

తన కొడుకుకే పుట్టిన బిడ్డలా.నా చిట్టి తండ్రీ,

నీ కోసం బతుకునే రాసిస్తాను

(లీ యంగ్ లీ కవిత "లిటిల్ ఫాదర్" కి స్వేచ్ఛానువాదం)
Category: 18 comments

18 comments:

Anonymous said...

ఇది కవితలా లేదు...ప్రేతాత్మకి నివాళీ లా వుంది....అశుభంగా వుంది....జాగ్రత్త!

వాసుదేవ్ said...

నా దృష్టిలో ఓ కవితని assess చెయ్యటానికి కొన్ని ప్రాధమిక అంశాలున్నాయి
1) కవితా వస్తువు
2) శైలి
3) ఏ ఇజాలు, వాదాలు రుద్దకుండా వస్తువుని treat చెయ్యటం లాంటివి
అందుకే నాకీ కవిత నచ్చింది.
స్వేచ్చానువాదం కాబట్టి
"కొన్ని సార్లు వాళ్ళంతా
పెళ్లి విందు కోసం
నడిచి వెళ్ళడం చూస్తాను"
ఈ లైన్లు వదిలేసినా కవిత అలాగే ఉండేది అన్పించింది. otherwise మీ trademark వాక్యాలు బాగానే ఉన్నాయి--
"ఇప్పుడే నిప్పులో కడిగిన గడియారపు స్ప్రింగు"
"కిందకే దిగే నిచ్చెనలు" లాంటివి. బహుశా కొందరు "సమాధి" లాంటి పదాల్ని తప్పుగా అర్ధంచేస్కున్నారేమొనని......... ఒ చిన్న భావన

మాగంటి వంశీ మోహన్ said...

అనువాదం అన్నారు బాగుంది...ఆ క్రిందే, అసలు రచన కూడా ఇచ్చేస్తే బాగుండేది....అప్పుడు దాని సంగతి ఏమిటి? దీని సంగతి ఏమిటి అనేది తేల్చొచ్చు...:)

కవిత సంగతి పక్కనబెడితే, ఇంతవరకూ చుక్కలరాయుణ్ణి నేనే అనుకున్నా......ఈ ముసుగువీరుడు/ వీరమణి ఎవరో బయలుదేరారే చుక్కలుచ్చుకుని.....ఓ సారి కమెంటు ఎక్కణ్ణించొచ్చిందో చూడండి అఫ్సర్ గారూ..........దాన్ని బట్టి ముసుగువీరుడు/ వీరమణి ఎవరో ఊహించొచ్చు.... వారికి ఓ వీరతాడు వెయ్యాలని ఉన్నది... చక్కగా, సిగ్గుపడకుండా అనుకరణ చేస్తున్నందుకు..:)

ఎం. ఎస్. నాయుడు said...

http://www.poetryfoundation.org/archive/poem.html?id=175771

mrityunjay said...

superbbbbb.pithahi daivatham.

కెక్యూబ్ వర్మ said...

@Anonymous: ఇలా ప్రేతాత్మలా పేలకపోతే పేరుతో రాయొచుకదా? కవితా హృదయం లేని వారు ప్రేతాత్మలే అయివుంటారు...

jagathi said...

good poem well translated the norm is that when we read a poem in translation we should not feel it is one there is that feel in this poem. it reminds me of wordswoth's words child is the father of man ....love j

Anonymous said...

Chalaaa bagundi Afsar garu...!! :) :) :)

Anonymous said...

Chalaaa bagundi Afsar garu :)

Anil Atluri said...

"...little father I ransom with my life..."
"నీ కోసం బతుకునే రాసిస్తాను "
లి - కవి హృదయాన్ని చక్కగా తెనిగించారు..తెలుగులోనే అన్నంతగా.

Krishna Athota said...

Adbhuthamga vundi

raghu said...

ఇక్బాల్ చంద్ గారు పంపగా చూసాను ఈ అనువాదాన్ని.

ముకుందరామారావు గారు, విన్నకోట రవిశంకర్ గారు, మూలా సుబ్రహ్మణ్యం పిల్లల పై వ్రాసిన కొన్ని కవితలు గుర్తుకు వచ్చాయి. భావాలు విశ్వజనీనాలని మరోసారి తెలుసుకున్నాను.

కొన్ని అమూర్త భావాలున్న సరళమైన కవిత ఇది.

తమ్ముడు కొండముది సాయికిరణ్ ఎప్పుడూ అంటుంటారు "పరభాషా కవితలకు అనువాదాలెందుకు? చక్కగా వ్యాసం వ్రాయకుండా!". అలా ఈ కవిత గురించి మీ మాటలు వినాలని ఉంది.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

I buried my father
in the sky.
Since then, the birds
clean and comb him every morning
and pull the blanket up to his chin
every night.

I buried my father underground.
Since then, my ladders
only climb down,
and all the earth has become a house
whose rooms are the hours, whose doors
stand open at evening, receiving
guest after guest.
Sometimes I see past them
to the tables spread for a wedding feast.

I buried my father in my heart.
Now he grows in me, my strange son,
my little root who won’t drink milk,
little pale foot sunk in unheard-of night,
little clock spring newly wet
in the fire, little grape, parent to the future
wine, a son the fruit of his own son,
little father I ransom with my life.
===
Thanks to Naidu gaaru. Now one can assess the translation.

Afsar said...

ఈ కవితపై స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

@వాసుదేవ్: మీరు చెప్పిన మూడు అంశాలూ బాగున్నాయి. మూడోది నాకు కొంచెం అభ్యంతరకరం. ఇజాలూ, వాదాలూ వుంటాయి మనం లేవని చెప్పినప్పటికీ!

@వంశీ: "ముసుగు" వీరుల గురించి నాకు రవంత కూడా బాధ లేదండీ. వాళ్ళకి వాళ్ళే ముసుగు తీసుకొని మాట్లాడలేనప్పుడు మనమేం చేస్తాం? నేనయితే బురఖా పరదా లేని వ్యవస్తే కోరుకుంటా.

@నాయుడు, సాయికిరణ్; మూలం సుప్రసిద్ధమే. అందుకే నేనివ్వలేదు. మీరు ఇచ్చినందుకు థాంక్స్. కానీ, మీ మాట కూడా ఏదో వొకటి చేరిస్తే కవి హృదయం కాస్త శాంతించునేమో?!

@ మృత్యు, క్క్యూబ్, జగతి, స్వేచ్చా, అనిల్, కృష్ణ గార్లు : మంచి మాటకి థాంక్స్
@ రఘు: మీరు ఇక్బాల్, రవి, ముకుంద రామారావు, మూలా పేర్లు ప్రస్తావించడం బాగుంది. తండ్రులూ, కొడుకులూ, కూతుళ్లూ ఇవన్నీ విశ్వజనీన భావనలే! అయితే, కవితల అనువాదాలలో ఒక విశేషం వుంది. సాధారణంగా అలా విశ్వజనీనం అనుకున్నవే మనం అనువదిస్తామేమో! ఆ కోణం నించి చూసినప్పుడు కవి గురించీ, ఆ కవిత్వం గురించి చిరు వ్యాసం కూడా వుంటే బాగుంటుంది. ఈ భిన్నమయిన అనువాదాలు ప్రాణహితలో నేను కొంత ప్రయత్నించాను. కవిత్వ భావనలు ఎల్లప్పుడూ విశ్వజనీనం కావనుకుంటా. అలా అయితే, ఆ కవి తన సంస్కృతి గురించో, తన భాషకే పరిమితమయిన అంశాల గురించో మాట్లాడడం లేదన్నమాట. లీ లో తన వలస బతుకు, తన పుట్టిన గడ్డకి సంబంధించిన వేదన చాలా వుంది. అది తరవాత - మీరన్నట్టు- వ్యాసంలో వివరిస్తా. థాంక్ యూ.

Pulikonda Subbachary said...

అఫ్సర్ చాలా కాలం తర్వాత మళ్ళీ మంచి కవిత్వానుభూతిని పొందాను. అసలుకవి ప్రతిభ ఒక ఎత్తైతే నీ అనువాద సృజన ప్రతిభ మరొక ఎత్తు. ఇది అమంగళకరమైన కవిత అనే వారితో పేచీ పడవలసిన అవసరం లేదు. అంటే వారు కాలంతో నడవడం లేదని అనుకొని ఊరుకుంటే సరిపోతుంది. తుమ్మపూడి కోటేశ్వర రావు గారు అంత సంప్రదాయ పండితుడే తన కవిత్వ సంకలనం ఒకదానికి చితాభస్మం అని పేరు పెట్టాడు. దీన్ని అందరూ గమనించాలి. నాన్నకోసం ఒక పద్యం నిజంగా అనిర్వచనీయమైన సృష్టి. నాన్నకోసం ఇంత ప్రేమైకమైన కవిత తెలుగులో లేదేమో. ఇందులో చిత్రించిన అక్షర చిత్రాలు అద్భుతం ఈ చిత్రాలు ఇంతవరకూ తెలుగులో లేవు. దీన్ని నెట్ లో మాత్రమే ఉంచితే ఉద్దిష్ట ప్రయోజనం నెరవేరదు ఏదైనా పత్రికలో ప్రచురించు. నీకు ఈ అసలు కవితను సూచించిన వారినీ (ఉన్నారు కదా) అభినందించక తప్పదు. అక్కిరాజు రమాపతిరావు గారు అనుకుంటాను. ప్రసిద్ధులైన సాహితీకారులు తండ్రులుగా ఉన్న కూతుర్లు కొడుకుల దగ్గరకు వెళ్ళి వారి నుండి విషయాన్ని కవిత్వాన్ని సేకరించి ఒక పుస్తకంగా ప్రచురించారు.

నీ కోసం బ్రతుకునే రాసిస్తాను అనే తండ్రిమాట ఒక్కదాన్ని ప్రపంచ సాహిత్య మ్యూజియంలో ప్రత్యేకంగా పెట్టవచ్చు.
ఈ కవితకు ప్రక్రియా పరమైన పేరు పెట్టే పని చేస్తే ఇందులోని మాధుర్యాన్ని దూరం చేసుకున్న వారిమి అవుతాము. ఈ అనుభూతిని ఇలాగే ఉండనిద్దాము.
మిత్రమా అఫ్సర్ నీవు మరొకసారి మనసారా అభినందనీయుడవు.
పులికొండ సుబ్బాచారి.

Jai Telangana said...

Afsar Ji,

Namaste!. Mee transalation adbhutam ga vunnadi sir. Ekkuvaga talli-ki pradhanyata gaa vunna pdyam lu choosinam gaani, tandri ki pradhanyata vunna pdaym lu chaana takkuva. original poem nunchi bhaava vibhedam leka chakkaga anuvadinchinaaru. - My hats off sir meeku.

-

Afsar said...

అవును, జై తెలంగాణ:
ఆ మూలకవిత చదవడానికి ఇంకా బాగుంటుంది. నాయన గురించి అన్వర్ ఒక సంకలనం కూడా తీసుకు వచ్చారు తెలుగులో.

దొరికితే అది చదవండి.

karlapalem Hanumantha Rao said...

నాన్నను ఆకాశంలో .. భూమిలో సమాధి చేసిన తరువాత..పంక్తులు అద్బతం! గుండెలో 'సమాధి' అంటే.. కథ అక్కడితో సమాప్తం. పెరుగుతున్న నాన్నను 'పొదగడ'మే సముచితంగా ఉండేదేమో!అది 'లీ' ఆలోచన. అనువాదంలో మార్చలేం. మీ పద లాలిత్యం ఎప్పటిలా తన మ్రుదుత్వ తత్వాన్ని కా డుకొంది. హ్రుద్యమైన పజ్జెం అందించారు. ధన్యవాదాలు అఫ్సర్ జీ!

Web Statistics