తేనెటీగల గుహ







ఈ దారి పక్కన ఎప్పుడు నడిచినా

కనీసం వెయ్యి తేనెటీగల తుట్టెలు

కదిలించినట్టే!



రాకాసి తేనెటీగలు

కట్టుకున్న తేనె గూడు

ఈ కొండ.




ఆకుపచ్చ లోయ

లోతు కనుక్కోమని సైగ చెసినట్టే వుంటుంది



అటూ ఇటూ కొండల అల్లిక జిగిబిగి

రహస్యాలు వెతుక్కుంటున్నట్టే వుంటుంది



రెండు కొండల మధ్య ఈ నడక

ఎప్పుడూ



పొరలుపొరలుగా

చుట్టుకున్న ఆచ్చాదనలన్నీ విప్పి



నన్ను నా లోపలి లోయల్లోకి

వడి వడిగ రువ్వుతుంది

                                 వడిసేల రాయిలాగా.



(ఆస్టిన్-టెక్సాస్ లో నాకు చాలా ఇష్టమయిన బీ కేవ్స్ దగ్గిర )
Category: 5 comments

5 comments:

gajula said...

thene laanti thiyyani anubhavamu antha easynaa mari?

devirao@bloggerspot.com said...

అఫ్సర్ జీ!
మీ అంతర్ ముఖత్వం ఎప్పుదూ అందంగానే వుంటుంది!అభినందనలు!

అక్షర మోహనం said...

హన్నా.. ఎంటీ ..మొన్న హైదరబాద్ లొ వాన..ఇప్పుడు తేనె..హాయిగా, తీయగా రాస్తున్నవ్

Afsar said...

@ గాజుల: థాంక్ యు. అవును ప్రతి తీయని అనుభవమూ వొక తీయ చేదు అనుభవమే.

@రావు గారూ: నా అంతరంగాన్ని బాగా పట్టుకున్నారు. నాకూ ఆ అంతర్ముఖ వేళలే భలే అనిపిస్తాయి!

@మోహనా; అవును ప్రకృతికి దగ్గిరగా వెళ్ళినప్పుడల్లా వొక తేనెపట్టు దొరికిన అనుభూతి. నీకు తెలుసు కదా!

ప్రసూన said...

చాలా అందమైన కవిత. అవునండీ. ప్రకృతికి దగ్గరగా వెళ్ళడంలో తేరుకోలేని ఆనందం ఉంది.

Web Statistics