Thursday, July 15, 2010

అంతిమ క్రియలు కొన్ని...


















వెళ్లిపోతూ మలుపు దగ్గిర కాసేపు నిలబడి చూడు.
రాయాలనుకున్నదేదో నీ చూపు చివర కనలిపోయింది.


ఆది యందు మాట వుండెనో లేకపోయెనో...
ఆదియందే చివరి మాట స్వప్నించనీ నన్ను.


దుఖాలు పగలబడి నవ్వుల గోళాలు తిరగబడి
శోకాలు తగలబడి వొక చల్లని మంచు నిప్పు సెగని నేను.


అంతమందు మాట వుండునో వుండకపోవునో
నిన్న రాత్రి నీ కలకి అంటుకున్న కార్చిచ్చుని నేను.


కాలానికి తెలియదులే, రాలిపడిన క్షణాల చప్పుడు
ఒకే ఒక్క కేకలో కరిగిపోయిన ఇరుదేహాల నగ్న ఘోష..


చింతల చిగురాకులో, సుఖాల నిప్పు కణికలో
దాటి వెళ్ళాక కానీ స్పృహ రాదు, వొళ్ళే అగ్ని గుండమయినప్పుడు.


వెళ్లిపోతూ మలుపు దగ్గిర కాసేపు నిలబడి చూడు.
రాయలేనిదేదో వొకటి దగ్ధమయ్యింది., రెప్పల తెల్లనవ్వు కింద.


*

No comments:

నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం

  - బొల్లోజు బాబా  ( ఈ వ్యాసంలోని కొంతభాగం కవిసంధ్య పత్రికలో ప్రచురణ అయినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు. వ్యాసం పెద్దది. రెండుభాగాలుగా పోస్...