Thursday, December 15, 2011
చలి రాత్రి వొక వీడుకోలు
వచ్చే సెమిస్టరు నేను ఆసియా భక్తి కవిత్వం మీద వొక కొత్త సెమినార్ కోర్సు చెప్పబోతున్నాను. అందులో భాగంగా చైనా, జపాన్ బౌద్ధ కవిత్వం చదువుతున్నా ఈ మధ్య.
కవిత్వం ఏం చెయ్యాలి? కవిత్వం చేసే పని ఎట్లా వుండాలి? అనేవి రెండు పెద్ద ప్రశ్నలు. వాటికి ఎవరి దగ్గిర వున్న సమాధానాలయినా అవి పూర్తి సమాధానాలు అయి వుంటాయని నేను అనుకొను. కానీ, ఏదో వొక సమాధానం రాబట్టుకొని తీరాలన్న మొండితనం కవికి వుండాలి, పఠితకీ వుండాలి. లేకపోతే, ఇద్దరి అన్వేషణా అధ్వాన్నపుటడవుల్లోకి జారిపోతుంది.
నా మటుకు నాకు ఈ బౌద్ధ కవిత్వ యాత్ర వొక కొత్త అనుభూతి. కొత్త దారి.
తెలియదు, ఈ దారిలో నేను ఎటు మళ్లుతానో?
ఈ కవితలో ఈ చైనా కవి అనేక శతాబ్దాల కిందట వీడుకోలు చెప్పింది నాకేనా?
చలి రాత్రి వొక వీడుకోలు
ఆ మొదటి మలుపు దీపం చూడూ,
అటుగా ఆ వూరి వంతెన మీంచి నేరుగా వెళ్ళు.
ఏటి మీద మొగ్గలు ముద్దలుగా
రాలిపడుతుంటాయి, కరగని మంచు.
ఇంత చలిలో - మరీ కురచని ఈ పగళ్లలో-
నువ్వు వెళ్లిపోవడం దిగులుగా వుంది.
ఈ కొండలేమో అంతులేనివి,
మరి, నువ్వు అందుకోవాల్సిన బాట మరీ దూరం!
(మూలం: chia tao 779-843)
Subscribe to:
Post Comments (Atom)
పూర్తి కాని వాక్యాలు
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ- 1 మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే! ...

-
శ్రీశ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ ల...
-
1 అ ర్థరాత్రి మెలకువొస్తుంది. వున్నట్టుండి లేస్తావు. మూత్రం వస్తున్నట్టుగా శరీరంలో వొక అసౌకర్యమైన చలనం. అటు తిరిగి పడుకొని వున్న శాం...
-
ఈ వారం టెక్సాస్ టెంపుల్ లో తెలుగు సాహిత్య సదస్సు జరగబోతోంది. సాధారణంగా టెక్సాస్ లో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా అది వొక పెద్ద పండగ, వొక ...
10 comments:
ఏటి మీద మొగ్గలు ముద్దలుగా
రాలిపడుతుంటాయి అబ్బ! ఎంత బాగుందో!
great poetry!!
All the best for your course!
kondaleppudu visaalame
dari maathram iruku
to widen the path is seeker"s job/duty
ohhhhh beautiful poetry n better translation
@రసజ్ఞ గారు: ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్యం: థాంక్ యు.
@కృష్ణకుమారి గారు: అమ్మయ్య, మీరు మెచ్చారు, ఇక నాకు దిగులు లేదు. ఇక భట్టు గారి పెసరట్లే మిగిలియాయి...
@ఆకెళ్ళ; అవును, చాలా అందమయిన/లోతయిన కవిత్వం. చదివే కొద్దీ, ఆశ్చర్యంగా వుంది.
beautiful.
యెంత మ్రుదువుగా,యెంత తాత్వికంగా ఉన్దో...కవిత..గ్రేట్..!
ఈ వీడ్కోలు, మరణిస్తున్న ఆత్మీయుని గురించి చెబుతున్నట్టుగా అనిపించింది. పడాడంబరంలేకున్నా గుండెను చీల్చేంతగా ఉంది భావనైశిత్యం.
మంచి కవితను అనువదించి, పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ.
అఫ్సర్ గారూ,
ఇక్కడ నాకు చిన్న సందేహం. కరగని మంచు, మొగ్గల ముద్దలుగా పడుతోందా... అలా అయితే " ఏటిమీద మొగ్గల ముద్దలుగా పడుతోంది, కరగని మంచు" అవుతుంది.
ఏటి మీద కరగని మంచులో మొగ్గలు ముద్దలుగా రాలుతున్నాయా (ఒకదాని వెంట ఒకటి వికసిస్తున్నాయా అన్న భావనలో)? అలా అయితే, "ఏటి మీద మొగ్గలు ముద్దలుగా రాలిపడుతుంటాయి; కరగదు మంచు " అవుతుంది.
ఈ రెండింటిలో కవి భావం నాకు చిక్కలేదు.
ఈ కొండలేమో అంతులేనివి,
మరి, నువ్వు అందుకోవాల్సిన బాట మరీ దూరం!
అన్న మాటలు Hippocrates అన్న "Ars longa, vita brevis, occasio praeceps, experimentum periculosum, iudicium difficile." మాటలు గుర్తుచేస్తున్నాయి. భక్తికి కూడ అవి చక్కగా అన్వయించుకోవచ్చు.
కవితమాత్రం చాలా గొప్పగా ఉంది.
అభినందనలతో,
హైకు లు కూడా గొప్ప గా ఉంటాయ్ సర్. ఆ కవిత్వం భావం అర్థం చేసుకునే సమయం లో మనల్ని మనం వెతుక్కుంతం. పాత జపనీస్ కవులు, ముఖ్యంగా బషో లాంటి మహా కవులు అలాంటి మాయాజాలాన్ని మనలో వదిలేసి వెల్లిపొతూ ఉంటారు.
మంచి కవిత...మంచి translation.
హైకులని, బౌద్ధ కవితల్ని ఇంకొన్ని వాటిని తెలుగు లోకి అనువదించగలరు :)
Post a Comment