ఇరవయ్యో శతాబ్ది /ఇద్దరు కవులు

ఎడోనిస్ కవితలు
ఇద్దరు కవులు

వొక ప్రతిధ్వనికీ, ధ్వనికీ మధ్య ఇద్దరు కవులు.

ముక్కలయిన చంద్రుడిలా మాట్లాడ్తాడు వొక కవి,


ఇంకొకడు
పిల్లాడిలా నిశ్శబ్దం,

వో అగ్నిపర్వతం చేతుల్లో వూయలూగుతూ
నిద్రిస్తూ.


అద్దంలో ఇరవయ్యో శతాబ్ది


శిశువు ముఖాన్ని ధరించిన
శవపేటిక
వొక కాకి గుండెల్లోంచి రాసిన
పుస్తకంపువ్వు చేతబట్టి
ముందుకు లంఘిస్తున్న మృగం

వొక పిచ్చివాడి వూపిరిలోపల
శ్వాసిస్తున్న బండ రాయి

అంతే.
ఇదే ఇరవయ్యో శతాబ్ది.(మొదటి కవిత : Two poets
రెండో కవిత: A mirror for the twentieth century)
Category: 1 comments

1 comments:

Rohith said...

మీరు అనువదించిన అడోనిస్ కవితల్ని చదవటం చాల బాగుంది. ఈ కవితల లింక్స్ ని అనువాదం తో పాటి పోస్ట్ చేస్తే బాగుండు. Positive ద్రుక్పతాన్ని నేగాతివే గా వాడటం, నేగాతివే భావాన్ని పాజిటివ్ గా వాడటం అనేదాని గురించి ఈ మద్య నే స్నేహితునితో మాట్లడుతుంటిని .ఇలాంటి ప్రయోగం ఒక రకమైన ఆశ్చర్యాన్ని పాటకునికి కలిగిస్తుంది. రెండో కవితలో అటువంటి ప్రయోగం రెండు ముఉడు చోట్ల కనబడ్తుంది.

అడోనిస్ కవితల్ని తెలుగు పాతకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

ThanQ sir

Web Statistics