నా టీనేజర్లు!




వున్నట్టుండి ఓ రోజున వాళ్ళు
వాళ్ళ గదుల్లోకి మాయమయి పోతారు.

తలుపులూ పెదాలూ మూతపడతాయి
ఇక ఇంట్లోనే
వొకరికొకళ్ళం అపరిచితులవుతాం.

బయట గదిలో పచార్లు చేస్తుంటా
వాళ్ళ గుసగుసలే వినిపిస్తాయి
ఆ రహస్య భాషేదో నాకు తెలుసు
కానీ ఇప్పుడేమీ గుర్తు లేదు

అదీ నేను నేర్పిన భాషే కదా!


కొన్నేళ్ల తరవాత తలుపు తెరుచుకుంటుంది
మళ్ళీ చూస్తాను ఆ ముఖాలని,
వొకప్పుడు నా అరచేతుల్లో దాచుకున్న ముఖాల్ని,
నా చేతుల్లో పొద్దు తిరుగుడు పూలయి విచ్చుకున్న ముఖాల్ని.


అవి నాకు పరిచితమయిన చర్మాలే!

కానీ
ఇప్పుడు నిటారుగా నిలబడిన దేహాలు
ముత్యాల్లా మెరుస్తూ
నన్ను దాటుకుంటూ వెళ్లిపోయే దేహాలు!





(మూలం: పాట్ మొరా - టెక్సాస్ ఎల్ ఫాసో లో పుట్టిన కవయిత్రి. కవిత్వం, స్మృతులుగా మెక్సికన్ అమెరికన్ స్త్రీల జీవితాన్ని రికార్డు చెయ్యడానికి మొరా ప్రయత్నిస్తోంది. పిల్లల కోసం ఎక్కువగా రాసింది. ఆమె జీవితం కేవలం కవిత్వానికి పరిమితం కాదు,కవిత్వం ఆమెకి వొక సాధనం మాత్రమే.)

8 comments:

ఎం. ఎస్. నాయుడు said...

Teenagers:

One day they disappear into their rooms. Doors and lips shut and we become strangers in our own home.

I pace the hall, hear whispers, A code I knew but can’t remember Mouthed by mouths I taught to speak.

Years later the door opens. I see faces I once held, Open as sunflowers in my hands. I see Familiar skin now stretched on long bodies That move past me Glowing Almost like pearls.

సర్. అనువాద కవిత బావుంది. చర్చల కోసమే మళ్లీ ఇట్లా. రహస్యమేదీ లేదు కదా. కవిత్వం తప్ప.

కోడూరి విజయకుమార్ said...

afsar gaaru....
itlaanti manchi kavitvam ekkada dorikina parichayam cheyyandi...

Afsar said...

మిత్రులకి:

ధన్యవాదాలు.

నాయుడు గారు: నేను చేస్తున్నది అనువాదం కాదు, అనువాదం అనే మాట నేను వాడడమూ లేదు. మఖ్ఖీకి మక్ఖీ అనువాదం నాకు చాతవ్వదు. నేను చేస్తున్నది తెలుగుసేత మాత్రమే. గమనించగలరు.

వాసుదేవ్ said...

అఫ్సర్‌జీ, బావుంది కవిత. చదువుతున్నంతసేపూ ఒరిజినల్ కవిత ఎలాఉందో అన్న భావన కల్పించారు.... విజయ్‍కుమార్ చెప్పినట్లు ఇలాంటి మంచి కవిత ఏభాషలో ఉన్నా మాకు అందించండేం.

kaviyakoob said...

poem baagundi...

kaviyakoob said...

poem baagundi...

సుజాత వేల్పూరి said...

వొకప్పుడు నా అరచేతుల్లో దాచుకున్న ముఖాల్ని,
నా చేతుల్లో పొద్దు తిరుగుడు పూలయి విచ్చుకున్న ముఖాల్ని. ......


ఎంతో అందంగా ఉంది ఈ భావన! ఇలాంటి భావాల్ని చూసినపుడే ఒరిజినల్ లో కవి దీన్ని ఎలా చిత్రించాడో తెలుసుకోవాలనిపిస్తుంది.

తెలుగు సేత...ఈ మాట కవిత్వానువాదంలోనూ, ఆలిండియా రేడియోలోనూ వినపడుతుండేది.

అఫ్సర్ గారూ, మీ బ్లాగులో కవితల్ని తరచూ చదువుతూనే ఉంటాను కానీ అది బావుందనే మాటని కవితాత్మకంగా చెప్పే భాష లేక మౌనంగా నిష్క్రమిస్తుంటాను :-((
మరిన్ని చక్కని కవితల్ని అందిస్తారని ఆశిస్తాను

raju said...

అనువాదానికీ తెలుగు సేతకీ తేడా ఏమిటో వివిరించగలరు. మీ "తెనుగీకరణ" బావుంది. మూలం లోని భావం, లయ రెండూ చక్కగా అమరాయి. ఆంగ్లపు మూలం పెట్టడం కూడా బావుంది, వెనువెంటనే రెంటినీ చదువుకోడానికే వీలుగా.

Web Statistics