చలి గురించి మూడు ముక్కలు




చలిగాలుల చివర వొక ఎండ తునక
ఎదురొచ్చింది కప్పుకోనా అని!
తనివి తీరా కప్పుకున్నాను.



వొళ్ళు వణికిందీ అంటే
సూర్యుడి రెక్క
వొక పక్కకి వాలిపోయినట్టే.

శరీరం రహస్యం
తెలిసిపోయిందేమో గాలికి,
కూడా కాసిని చినుకులు ఈడూ జోడు.


నాలుగు గోడల్ని వెచ్చబెట్టుకునే రాత్రి
అతను గుర్తొస్తాడు
ముసలి చర్మాన్ని మాత్రమే కప్పుకున్న ఆ వీధి చివర.


వెచ్చని గదుల కవిత్వపు కలవరింతలు
కాసేపు కట్టిపెట్టు
తాత్వికుడు ఎప్పుడో అలసిపోయాడు!


పైవొంటిని కోసే ఈ చలి గాలిని దాటాక
అప్పుడు మాట్లాడు
కవిత్వాన్ని గురించి!

*
Category: 4 comments

4 comments:

రవి వీరెల్లి said...

అఫ్సర్ గారు,
చాలా బాగుంది.
పైవొంటిని కోసే చలి గురించి మీరు చెప్పిన మూడు ముక్కలు గుండెను కూడా కోసేట్టున్నాయి.

ఎప్పుడు వొదులుతుందో ఈ చలి!!!

-రవి వీరెల్లి

కొండముది సాయికిరణ్ కుమార్ said...

చాలా బాగుంది అఫ్సర్ గారు.

VASUDEV said...
This comment has been removed by the author.
VASUDEV said...

నేనుంటున్నఈ ప్లేస్‌లో చలి లాంటి పదార్ధమేదీ ఉండదు. అయితే ఎండ లేదా వర్షం. మీ ఈ కవిత చదివాక నిజంగానే చలేసింది. ఒక్కసారి మన సీజన్స్ మళ్ళీ గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు.చిన్నదైనా మంచి కవిత ... ఇంత లేటుగా చదివినందుకు బాధేసినా మంచి కవిత చదివాననే ఓ తృప్తి. ఈసారి కొత్త కవితలు పోస్ట్ చేసినప్పుడు తెలియజేయండేం....

Web Statistics