మూడో తరం నుంచి ఓ ఆణిముత్యం..."ఊరి చివర"


ఇండియా టుడే నుంచి..."ఊరి చివర" గురించి అంపశయ్య నవీన్ గారి సమీక్ష
Category: 9 comments

9 comments:

కొండముది సాయికిరణ్ కుమార్ said...

నమస్సులు అఫ్సర్ గారు.

చాలా పేలవంగా ఉందండి ఈ సమీక్ష. ఊరి చివర మీద ఇంతవరకు వచ్చిన సమీక్షలలో నాకు నచ్చింది మాత్రం "చింతపట్ల సుదర్శన్"గారు వ్రాసిన కొత్త ప్రపంచపు కవిత్వం.

ఇక మూడు తరాల కవుల వర్గీకరణలో నవీన్ గారు తనకు తెలిసిన పేర్లు మాత్రమే కుమ్మరించినట్లున్నారు!

Afsar said...

సాయికిరణ్:

కవిత్వంలోని భిన్నత్వాన్ని నవీన్ తనకి వున్న ఆధునిక దృష్టితో మేళవించడం ఇందులో బాగుంది. కానీ, ఈ పుస్తకం మీద వచ్చిన సమీక్షలన్నీ వేటికవే చాలా బాగుండడం వల్ల ఈ సమీక్ష వాటి ముందు "పేలవంగా" వుందనుకుంటాను.

అవును, జాబితాలు ఎప్పుడూ వివాదాస్పదమే కదా! ప్రతి విమర్శకుడూ, కవీ తనకి తెలిసిన పేర్లే గుమ్మరిస్తాడు. అయినా, జాబితాల మీద/ వర్గీకరణల మీద నాకు అంత గురి లేదు. అవి యెప్పుడూ అసంపూర్ణంగానూ, అసంతృప్తిగానూ వుంటాయి.
కవుల మీద కంటే భావనల మీద దృష్టి పెరగాలన్నది నా అభిప్రాయం. అప్పుడు ఈ వైయక్తిక పాక్షిక కోణం కొంచెమయినా పలచబడుతుంది. కాదంటారా?

మాలతి said...

అఫ్సర్ గారూ,
నేను చాలా సార్లే మీతో అన్నాను నాకు కవితలగురించి తెలీదనీ, మీకవితలు అర్థంకావనీ. నేను సమీక్షలు చూడలేదు కూడా. కానీ ఈ సమీక్ష చదివినతరవాత మీ కవితలు మళ్ళీ చదివి చూడాలనిపిస్తోంది. చూస్తాను.
భావాలపై దృష్టి పెరగాలన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.
అభినందనలు,
మాలతి

Afsar said...

మాలతి గారు:

ధన్యవాదాలు

కవిత్వం అర్థం కాదన్నది వొక అపార్థమేమో!
అవును, భావనల మీద దృష్టి పెరగాలన్నది నా కచ్చితమయిన అభిప్రాయం. దాని వల్ల మన చర్చలు కొంచెమయినా ఆబ్జెక్టివ్ అవుతాయని ఆశ.

మాగంటి వంశీ మోహన్ said...
This comment has been removed by the author.
Bolloju Baba said...

మాగంటి వారికి ఆవేశం వచ్చిందో లేదో తెలియదు కానీ- కామెంటు పైకీ కిందకూ చదివేసరికి నాకు మాత్రం ఆయాసం వచ్చింది. :-)

ఈ మధ్య నాక్కొన్ని చిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి.
సాహిత్యం అనేది అదో మరో ప్రపంచమనీ దానికీ భౌతిక ప్రపంచానికీ సంబంధం ఉండదనీ/లేక ఉండకూడదనో -

ఆ ప్రపంచంలో ఆకలి బీదరికం, నామిని వారికొత్తపుస్తకంలో చాలామందికి కనిపించిన నికృష్ట భౌతికాంశాలు వంటివి ఉండవనీ-

కుల మత ప్రాంతాల కతీతంగా ప్రతీ ఒక్కరూ యుటోపియాలాంటి సాహితీ/కవిత్వ లోకంలో కాసేపు సేదతీరుతారనీ లేదా తీరవచ్చుననీ-

అలా అవ్వాలంటే ఆ లోకంలోని ఆంశాలన్నీ మానవ ఉద్వేగాలనో లేక సార్వజనీన విషయాలనో మాత్రమే కలిగి ఉండాలనీ, ఈ లోకంలో ఉన్నంత భిన్నత్వాలని ఏమాత్రమూ ఇముడ్చుకోకూడదనీ -- అలా అన్నమాట.
అదన్నమాట సంగతి. బహుసా ఒకప్పుడు సాహిత్యం ఆవిధంగా ఉండేదేమో. కానీ ఇప్పుడు అలా ఆశించటం అత్యాసే అవుతుందేమో.

"అఫ్సర్ గురువుగారూ మీవద్ద రోకలేమైనా ఉందా ప్లీజ్. తలకు చుట్టుకొందామనీ" :-)


ఇక వంశీగారూ
మీ కామెంటు బాగుంది.

కవిత్వం సంక్లిష్టంగా ఉంటోంది. సంక్లిష్టత వేరు.
అస్ఫష్టత వేరు.

ఈ క్రింది కవితా పంక్తులు నిఖార్సయిన అస్పష్టతకు ఉదాహరణ. దీనిని సర్రియల్ కవిత్వమనే పేరుతో సమర్ధింపులు చేసేవారుకూడా ఉన్నారనుకోండి. అది వాళ్ళ ఖర్మ అని ఊరుకొంటాను నేను.


తరగని నడకల్ని వేలాడేసిన సమయాన్ని పీలుస్తూ
రాత్రి మెల్లగా కూల్చే సంభాషణ
ఇద్దరమూ ఎదురుగానే కూర్చున్నాం
తన గాజు బిందువుల్ని నా తలమీదుగా ఒదులుతూ
అరచేతులు కలగనే కన్నీళ్లు బయటపడని రోడ్డు పగులుతూ.... (పేజి.నం: ౩ నిఘాలు, వృత్తాలూ, వెల్తురారిన కళ్లు)

ఏదో తిరిగి ఏదో బ్లాంక్ అవుతుందా?
ఈ హాలా హలపు భుగభుగల కంటే అఫ్సర్ కవిత్వమే నయమనిపిస్తుందా సార్ మీకు (యోగ్యతా పత్రం స్టైల్ లో చదువుకోవలెను)

ఇక అఫ్సర్ గారికి సంబ్ందించి వారి కొన్ని కవితలలో సంక్లిష్టత ఉంటుంది. భిన్న పొరలు కనిపిస్తాయి. ఆ ఉద్వేగాన్ని అందుకోవాలంటే కొంత పరిశ్రమ తప్పదు. కనీసం ప్రశాంతంగా ఒక ధ్యానంతో చదవాల్సిన కవితలు కొన్ని. ఈమాట ఆర్చైవులలో జరిగిన కొన్ని చర్చలు గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది.

కవిత్వం కాలానుగుణంగా రూపురేఖలు మార్చుకొంటూ ఉంటుంది. ఒకప్పుడు స్పష్టంగా తేటగా ఉండే కవిత్వం వచనానికి/గేయానికీ దూరమయ్యే ప్రయత్న్ంలో కొంత సంక్లిష్టతను సంతరించుకోవలసివచ్చింది. అది ఒక మార్పు. ఒక అనివార్యత.

ఒకా నొక దశలో నరకండి చంపండీ అన్న నినాదాల్నీ మోసింది, అన్యాయంగా.

ప్రస్తుతం తెలుగు కవిత్వం మరలా సూటిగా ఆలోచనాత్మకంగా ఉండే రీతిలో ఆవిష్కరింపబడుతూంది.

ఈ విషయం "అనేక" పదేళ్ల కవిత్వసంకలనం, కవితా౨౦౧౦ వంటి సంపుటిలను గమనిస్తే మీకు అర్ధమౌతుంది. ఉదాహరణకు. ఎండ్లూరి సుధాకర్ వ్రాసిన దుఖ;గంధికామ్లం (నెట్లో లభిస్తుంది వీలైతే వెతకండి), తుల్లమిల్లి విల్సన్, కొప్పర్తి వంటి కవుల వివిధ కవితలు సాక్శ్యాలు.

ఒకప్పుడు కాళోజీ ఈ తరహా కవిత్వం రాసినపుడు ఇందులో కవిత్వమెక్కడుందీ అని వెక్కిరించారు. (ప్రాంతీయ రంగు పూయకండి దయచేసి)
కానీ తెలుగు సాహిత్యం ఆ వైపునకే ప్రయాణిస్తుందనిపిస్తోంది నాకీ మధ్య. ఇదీ మంచి పరిణామమే. ఎందుకంటే అసహనానికి గురౌతున్న మీబోటి పెద్దలను సంతృప్తి పరచగలదీ పరిణామం.

భవదీయుడు
బొల్లోజు బాబా

మాగంటి వంశీ మోహన్ said...
This comment has been removed by the author.
మాగంటి వంశీ మోహన్ said...
This comment has been removed by the author.
dhaathri said...

naku ardhamainantha varaku urichivaralo afsar kavithvam bagundi
adbhutam analemu gani it stands for what it is....nakintha kanna teliyadu cheppadam....love j

Web Statistics