కవిలె కట్టల్ని తిరగేయ్యడంలో, పాత కవితల్ని మళ్ళా చదూకోడంలో వొక ఆనందమూ, వొకానొక నాస్తాల్జియా తప్పక వున్నాయి. ప్రముఖ కవయిత్రి, ఇప్పటి "విహంగ" ఎడిటర్, చిరకాల మిత్రులు పుట్ల హేమలత గారు తమ పాత పుస్తకాల్నీ, కాయితాల్నీ వెతుక్కుంటూ ఈ కవితని బయటికి తీశారు. ఇది నేను 1993లో రాసిన కవిత.
ఈ కవిత నేను నా ఏ సంకలనంలోనూ పెట్టలేకపోయాను. చాలా కాలంగా ఈ కవిత దొరక్క, నా రచనల్ని వొక చోట పెట్టుకునే క్రమశిక్షణ లేకా!ఇన్నాళ్ల తరవాత ఈ "వెలుతురు భాష" వెతికి పెట్టిన హేమలత గారికి ధన్యవాదాలు.
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
6 comments:
అఫ్సర్ గారూ!
ఈ కవిత కనిపించగానే ఇది మీదగ్గర లేకపోతే, చూసి త్రిల్ అవుతారని అనిపించింది. ఇంక దొరకవు అనుకున్నవి దొరికితే ఆ ఆనందం వేరు కదా ! ఇక్బాల్ చంద్ కి కూడా ఒక పాత పోయెం పంపించా ఈ రోజు.
అయితే ఇలా కొంత మంది కవితలు వారి దగ్గర లేనివి - నా దగ్గర వున్నాయోచ్!
ఎప్పటిదో కాదు..ఎప్పటికీ అదే కవిత..నాకు బాగా గుర్తున్నకవిత..మళ్ళీ జ్ఞాపకాలపొరల్లోంచి జారవిడిచారు హేమలత గారు..మీకు నెనరులు..
baagundandi..
@హేమలతగారు: అవును, త్రిల్ అయ్యాను. అసలు ఆ కవిత నా స్మృతిపథంలోంచి జారిపోయింది. మీరు వెతికి పెట్టారు. ఆ ఇక్బాల్ నాకంటే అన్యాయం! వాడికి కవిత్వం అంటే లేక్కా పత్రమే లేదు.
@మోహనా, అనుకున్నా, నువ్వోచేస్తావని! బెజవాడ, ఆంధ్రజ్యోతి అనగానే నీ ప్రాణం లేచి వస్తుందని! అవును, ఆ కవితలన్నీ మనం రాసుకునీ, చదువుకునీ కలవరించినవే!
@పద్మార్పిత: ఎలా వున్నారు? మీ కొత్త కవితలేవీ?
ఇప్పటికీ ఆ వెలుతురు పరచుకుంటూనే వుంది....
అందరూ ఆ స్కాన్డ్ ఇమేజ్ ని చదవలేరు. మళ్ళీ టపాయించి పెడితే బాగుంటుంది అఫ్సర్ గారు! అఫ్‌కోర్స్ మళ్ళీ అప్పుతచ్చులు అవీ జాగ్రత్త గా చూసుకోవాలి!
Post a Comment