(ఆవకాయలో వచ్చిన దాశరథి గారి స్మృతులని ఇవాళ నమస్తే తెలంగాణ సాహిత్య పేజీ "చెలమ"లో తిరిగి ప్రచురించారు. మిత్రుడు అల్లం నారాయణకి షుక్రియా. ఈ రచనకి వేసిన బొమ్మ నాకు నచ్చింది.
‘అవును, మంచి కవిత్వం రాయాలంటే నువ్వు మంచి ప్రకృతిలో వుండాలి. కాస్త నీళ్ళూ, కాసిని చెట్లూ, కొన్ని పక్షులూ.. వీటితో నీకు దోస్తీ కుదరాలి’. తరవాత చాలా వుత్తరాల్లో /సంభాషణల్లో ఆయన మున్నేరు గురించే రాసే వారు/ చెప్పేవారు. ‘ ఈ మధ్య వెళ్ళావా?లేదా?’ అని గుచ్చి గుచ్చి అడిగే వారు. ‘ ఈ మున్నేరు లేకపోతే నాకు కవిత్వమే తెలియదు ’ అన్నారు ఒక వొకసారి! ఆ రోజుల్లో ఎందుకో , నాకు అటు వెళ్ళాలని అనిపించేది కాదు.
అక్కడ పక్కనే శ్మశాన వాటిక వుండేది. నేను వెళ్ళిన రెండు మూడు సార్లు అక్కడ శవాలు తగలబెట్టడం చూశాను. బహుశా , అది నా మనసులో నాటుకుపోయి ఉండాలి. ఆయన తన చిన్నప్పటి మున్నేరు అలాగే వుందని ఎప్పుడూ అలా అడుగుతూ వుంటారులే అని వూరుకున్నాకానీ, దాశరథి గారు చనిపోయారని తెలిసి నాన్నగారు హడావుడిగా బ్యాగ్‌సర్దుకుని కన్నీళ్ళ పర్యంతం అవుతూ హైద్రాబాద్ వెళ్ళిన సాయంత్రం నేను మున్నేరు వొడ్డుకి వెళ్ళాను. ఆ సాయంత్రం మున్నేరు అలసిపోయిన తల్లిలా ప్రశాంతంగా పడుకుని వుంది. దాని గలగలలు నాకు వినిపించక కాసేపటికి వెనక్కి మళ్ళాను!
- మళ్ళీ ఎప్పుడూ నేను మున్నేరు దాకా వెళ్లనే లేదు!
(మిగతా ఆవకాయ లో చదవండి )
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
0 comments:
Post a Comment