నమ్మరా బాబూ నమ్మరా నన్ను ఈ పాస్పోర్టు సాక్షిగా ఇందులో వున్న నా అయిదారేళ్ల కిందటి నెరవని నా మీసాల నా తలవెంట్రుకల సాక్షిగా నమ్మరా, నేనేరా అది!
సరిహద్దులు లేవు లేవు నాకు అని రొమ్మిరుచుకుని అక్షరాలిరుచుకుని భాషలకతీతమే నేనని పలుకుల కులుకులన్నీ తీర్చుకుని నడుస్తూ పరిగెత్తుతూ వుంటా ఎయిర్ పోర్టుల గాజు అద్దాలు పగలవు నేనెంత ఘాట్టిగా కొండని ఢీ కొట్టినా.
నమ్మరా నన్ను నమ్మరా నా పేరు చివర మహమ్మదో అహమ్మదో షేకో సయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా. కాగితం తుపాకీని చూసినా మూర్ఛపోయే అమాయకుణ్ణిరా నమ్మరా నన్ను నమ్మరా.
భయపెట్టే నీ స్కాను కన్నుల గుండా నడిచెళ్లిన ప్రతిసారీ నా శల్యపరీక్ష లో సిగ్గుతో పది ముక్కలయి నా టికేటు మీద మూడు ఎస్సులు నా నిజాయితీనీ నా నీతినీ నా శీలాన్ని శంకించినా నమ్మరా నన్ను నమ్మరా
దేశాలు లేని వాణ్ణి రా
కన్న దేశమే తన్ని తరిమేసిన వాణ్ణిరా
తల్లీ తండ్రీ తాతా ముత్తాతా అందరికి అందరూ వున్నా
వొంటి మీది చొక్కా మాత్రమే మిగిలిన వాణ్ణిరా
నమ్మరా నన్ను నమ్మరా
నేనొట్టి ఆవారానిరా
నేనొట్టి పాగల్ గాణ్ణిరా
నిజమేరా
నన్ను చంపి పాతరేసినా
నా శవాన్ని ఎవ్వరూ మాదే మాదే అని పరిగెత్తుకు రారురా.
చచ్చి కూడా సాధిస్తాను రా
నమ్మరా నన్ను నమ్మరా
నా శవం కూడా నీకు మోయలేని భారం రా.
ఈ ఎయిర్పోర్టు దాటాక
ఎవరూ నా మొహం కూడా చూడరు రా.
నమ్మరా నన్ను నమ్మరా.
(ఇది ఎయిర్పోర్టులలో ప్రతి ముస్లిం పాడుకోవాల్సిన ఆత్మ శోక గీతం)
17 comments:
ఇప్పుడే ఫ్రెష్ ఫ్రమ్ ఒవెన్ అనుకుంటా....బహుశా ఈ రోజంతా పాడుకుంటానేమో.... మతాలకతీతంగా.....కొన్ని చోట్ల ఆగి వెనక్కెళ్ళి మరీపాడుకున్నా......ఆత్మగీతంలోంచి శోకం పొంగిప్రవహిస్తొ......నన్ను దాటుకుంటూ వెళిపోతోంది అఫ్సర్ జీ.....
bagundandee idi ikkada kashmir lo regular gaa ne choostoone vunna
abbaa kathinamaina vaastavam ....ardrangaa undi afsar garu....love j
బావుందని చెప్పాలన్నా భయమేస్తుంది,అసలేనా వీపు విశాలం, ముద్దర్లకు మహా అనువు.
ప్రేమతొ అన్వర్.
NAMMUTHA...NAMMUTHA,,
ప్రస్తుతం ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న ఓ అమానవీయ దృశ్యాన్ని కావ్యం జేసారు...మూగగా పాడుకొంటున్న పాటే ఇది...
వేన వేల మైళ్ళ దూరం నుంచి రాశావ్
అయినా
ఒంటిని తడిమినట్లుంది.
దు:ఖమొక్కటే నేమో నమ్మకమయిన రాయబారి
బాధపెట్టావ్.మనసును మెలిపెట్టావ్.
ఎప్పుడో అన్నాను గా నువ్వు సుకవివి అని
-సతీష్ చందర్
@వాసు: మతాలకతీతంగా వుండాలన్నది ఒక కల. ఆ కల తెగిపోవడమే ఈ కవితలోని కలత.
@అనానిమస్: అవును, కాశ్మీర్ ఎక్కడో లేదు! మన లోపలే వుంది.
@ధాత్రి: వాస్తవం ఎప్పుడూ కఠినమే!
@అన్వర్: బాగా చెప్పారు. కొత్త ముద్దర్లు పుద్తాయి, వాటికి దిగులు లేదు, వీపు విశాలమయినా కాకపోయినా.
@యాకూబ్: నువ్వు నమ్ముతావని నాకు తెలుసు.
@వర్మ: చాలా సంగతులు మూగ వేదనే! అవి పలకలేక పోతున్నందుకు సిగ్గుగా వుంది.
@సతీష్: భలే! నీలాంటి పాత మిత్రుల్ని భలే కలుపుతోంది అంతర్జాలం. అప్పుడప్పుడూ ఈ జాలం కేవలం మాయాజాలం కాదని అర్ధమవుతుంది! అవును నువ్వెప్పుడూ ఆకవుల/కుకవుల గుండెల్లో దూసుకుపోయే గోదావరీ ఎక్స్ ప్రెస్! ఇవాళ నీ మాట - ఇందాక వాసు చెప్పినట్టు - 'బహుశా ఈ రోజంతా పాడుకుంటా.'
The lines are haunting and A shroud of melancholy has taken over my heart.
We should not forget that any discrimination in whatever form is political based on economics. The war on terrorism is one, all pretty well know that.Once it is on communists {now they are not a threat to either to the existing orders or to the maintenance of status quo}, for some time on blacks[Africans]{still}, definitely now on Muslims.A consolidated, sane, popular, vision bound fight only and only win over these heinous crimes of mass discrimination.
umamaheswara rao c
@Umamaheswara Rao, C: Well-said Uma gaaru!I see a clear perspective here. Yes, we really need people who could actually envision the future of our identities. Unfortunately, we have very few people here who can really use their brains and find their heart at a right place!
బాగుంది అఫ్సర్...అనలేను....బాధగా వుంది అనడం సబబేమో.......మనల్ని అనుమానంగా చూసే చోట క్షణమైనా ఉండలేము...అలాంటిది...ఈ భూగోళం మీది చోటులన్నీ మనల్ని అనుమానించే ప్రదేశాలుగా మారిపోవడమంటే అది మరణాన్ని మించిన విషాదం...చాలా మందికి సోదిగా అనిపించింది గానీ ... "My Name is Khan" సినిమా నన్ను disturb చేసింది...మీ పద్యం చదువుతూ వుంటే ఎందుకో ఆ సినిమా జ్ఞాపకం వొచ్చింది....షుక్రియా....
mana akbar panting kadaa adi.....some times I feel proud that 'akbar is my close friend'....when he boarded the bus at paaloncha to join AJyoti...me, khaja, krishna, vidyaa saagar & some other friends had seen him off, wishing that he is going to win the world he always dreamt of....
@విజయ్: "ఊరి చివర"లో "అనుమానితుడి ఆత్మకథనం" కూడా ఇలాంటిదే! అనుమానం నీడలో బతకడం ఎప్పుడయినా/ఎక్కడయినా అసిధారావ్రతమే!ఈ స్థితికి ఒక దేశం , వొక సరిహద్దు అంటూ లేదు.
@విజయ్: అక్బర్ ని ఇప్పుడు చూస్తూంటే ఆశ్చర్యంగానే వుంటుంది. ఒక గీత మన కళ్ల ముందు మొదలయ్యి, విస్తరించి, ప్రపంచమనే కాన్వాస్ మీద తన ముద్రని వెతుక్కుంటూ వెళ్ళడం...అక్బర్ ది గ్రేట్! అవును, విద్యా సాగర్ ఎలా వున్నాడు? ఖాజా ఏ తెర వెనక వున్నాడు? కృష్ణ గురించి వినడమే కానీ, నేను చూడలేదు. అప్పుడు నగేష్, తెరేష్ కూడా వున్నారు కదా!
A contemporary poem still, as regime of hatred in the name of Trump is active in America.
Maansupady...vydenakalachivysindhi..Afsarji
ఇప్పుడిలా అనుమానంగా చూడకపోయినా అవమానిస్తూ మాట్లాడ్డం గ్రామస్త్తాయికి చేరిపోయింది. కేవలం మతం కారణంగా ఒక మనిషి అనుమానించబడడం,అవమానించబడటం విషాదం కాక మరేమిటి..? అఫ్సర్ సార్ ... మీ ఆవేదన నూరుశాతం వాస్తవం. ప్రతిఒక్కరు పాడుకోవాల్సిన గీతం. పాపం ముస్లిములు.
Post a Comment