తెలుగు భాషకి కొత్త తలుపు...ఇంటర్నెట్!

కల్లూరి శ్యామల గారు డిల్లీలోని ఐ‌ఐ‌టి లో అధ్యాపకులు. తెలుగు నించి ఇటీవలి సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి విస్తృతంగా అనువదిస్తున్నారు. తెలుగు సాహిత్యంతో పాటు ప్రపంచ సాహిత్యాన్ని సునిశితంగా చదువుకున్నారు. ఈ అభిప్రాయాలు పంపినందుకు వారికి ధన్యవాదాలు.


మొదటిప్రశ్న: ఇంటర్నెట్ తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన బాగా కనిపిస్తున్న మార్పులు.

విదేశాంధ్రులు, ప్రవాసాంధ్రులు తెలుగుని ఏదో ఒకరకంగా చదవగలుగుతున్నారు. భాషతో అనుబంధం నిలబెట్టులోవాలనే ఆదుర్దా నిజానికి తెలుగు యువతరంలో చదువుకునేరోజులలో దాదాపు మృగ్యమయిందనే చెప్పాలి. స్పర్ధతో కాంపిటీషన్ నిండిన ప్రపంచీకరణ విస్తరించిన నేటి సమాజంలో, తల్లిదండ్రులకి తమ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలనే ఆదుర్దాతో ఎక్కువ అవటంవలన భాషా సాహిత్యాలపట్ల ఒక వయస్సులో అంటే దాదాపు పదోఏటనుంఛి ఇరవైరెండేళ్ళ వయస్సు వరకు దూరంగా వుంచుతున్నారు. స్వంత భాషని చదవాలనే కోరికగాని కుతూహలంగానీ నేటి యువతకి లేదు అందులో వాళ్ళ తప్పుకంటే విద్యావిధానపు లోపాలు కారణమని చెప్పవచ్చును. అయితే ఉద్యోగాల్లో సెటిలయినతర్వాత మళ్ళీ భాషతో అభిమానం పెంచుకుని ఎక్కడికక్కడ తమ స్వంత వెబ్సైట్ లద్వారానో బ్లోగింగ్ ద్వారానో మూసుకున్న తలుపుల్ని తెరుస్తున్నారని చెప్పవచ్చును. ముప్పై అయిదు సంవత్సరాలు దాటిన తర్వాత కొందరు భాషని తిరిగి స్వంతం చేసుకుని తమతమ అస్థిత్వాలని సుస్థిర పరుచుకుంటున్నారు.

రెండో ప్రశ్న:

నిజంచెప్పాలంటే తెలుగుభాషకి ముందునుంఛి నెట్జెన్స్ తక్కువ. గృహిణులు, పత్రికల పాఠకులు నగరాలలో కంటే మద్యంతరమైన పట్టణాలలో, గ్రామాలలో వున్నారు. సాహిత్యం సృష్టింపబడేదిగూడా నెట్ సంస్కృతికి దూరంగా వుండే రచయితల వలననే. చాలమంది తెలుగురచయితలకి ఈమెయిల్ని మించి, ఒక్కొక్కసారి అదికూడా లేదు, తెలుసుకోవాలనే జిఙాస లేదు. వాళ్ళ ప్రపంచం వాళ్ళ పాఠకులు వాళ్ళకి వున్నారు. కాని రాయాలని ఆకాంక్షవున్న ఎంతోమందికి నెట్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తోంది. పూర్తిగా వారైన పాఠకులు, చెదివేసంస్కృతి దీనివల్ల ప్రచారామవుతున్నాయి.

ఇది ఒకరకంగా మంచిదనే అనిపిస్తోంది. భాష సజీవంగా వుండటమేగాక తక్కిన ప్రపంచంతో ముందుకు నడుస్తోంది.

మూడో ప్రశ్న:

ఒక కొత్త సంస్కృతికి సాహిత్య అంశాలకి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కవితలు, కథలు. మిని కథలు మనంమర్చిపోయిన రచయితలు ఈ చర్చలద్వారా మళ్ళీ సజీవులవుతున్నారు. అయితే ఇందులోనుంచి బహుకాలంనిలచి వుండే సాహిత్యాన్ని గుర్తించి నెట్ అనే జాలంనుంచి పైకితీసి నిలబెట్టే మార్గాలని అన్వేషించాలి. ఎంతైనా చెయ్యటానికి అవకాశం వుంది. మన ఆంధ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగులో ఎంత ముందంజ వేశారంటే ఎన్నైనా ప్రాజక్ట్లని చేపట్టి పురాణ సాహిత్యాన్ని, నిలబడదగినదానిని, ఇప్పుడు అందుబాటులోలేని పుస్తకాలని మళ్ళీ ప్రచురించవచ్చు. నేట్ దీనికొక ఆసరా అవుతుంది.

ఇన్ని చెప్పాక ఒకవిషయం తప్పక చెప్పాలి. పుస్తకాన్ని పుస్తకంగా ఒళ్ళో పెట్టుకుని పడుకుని చెదవడలో వున్న ఆనందం నెట్ లో చదవడంలో లేదు.

email: s_kallury@hotmail.com s.kallury@gmail.com

syamala@hss.iitd.ac.in

10 comments:

karlapalem Hanumantha Rao said...

shyamala gari abhiprayamtho nenu nutiki nuru pallu ekibhavisthunnanu

శ్రీ said...

శ్యామల గారు మంచి విషయాలే చెప్పారు.

తాడేపల్లి said...

మీ ఆశావహదృక్పథం నిజం కావాలని ఆశిస్తున్నాను. కానీ మఱోపక్క వాస్తవం మాట్లాడాలంటే - భాషాపరంగా మన తెలుగు సాఫ్టువేరు ఇంజనీర్లు నపుంసకులు. మఱియు కేవలం కుక్షింభరులు. వారు ఎంతమంది ఉన్నా భాషకు ఏమీ ఉపయోగం లేదు. ఉపయోగం ఉండడం లేదు, ఎన్ని సంవత్సరాలు పోయినా !

మాగంటి వంశీ మోహన్ said...

తాడేపల్లిగారు చెప్పినదానితో నూఱు శాతం ఏకీభవిస్తున్నా. భాషాపరంగా చెయ్యవలసినదానికి ఆయన, ఇంకా ఈ రకంగా చేస్తే భాషకు ఉపయోగం ఉన్నది అన్న ఆలోచన ఉన్నవాళ్లు ఓ మార్గం చూపిస్తే అలాటి మార్గాలు తెలియని ఆ సాఫ్టువేరు ఇంజనీర్లు ఆ మార్గం పట్టుకొని తమతో పాటూ ఇంకా చాలామందిని ఆవైపుగా తీసుకెళ్లగలిగే పని చేయగలిగేవాళ్లూ చాలామందే ఉన్నారని ఈ భవదీయుడి అభిప్రాయం. కాబట్టి ఓ బ్లూ ప్రింటు సిద్ధం చెయ్యండి గురూగారూ. వీలు చిక్కించుకుని జనాలని తోలుకొచ్చి, ఆ తోలువలిచే బాధ్యత నెత్తికెత్తుకోడం పెద్దపని కాదనే నా నమ్మకం.

తాడేపల్లి said...

వంశీగారూ ! తమలపాకుతో బానే కొట్టారు. నాకు సాఫ్టువేరు రాదు. వస్తే వారి మీద పడి ఏడవడమెందుకు ? తెలుగు కోసం ఏం చెయ్యాలో నా చేత చెప్పించుకునే స్థితిలో ఉన్నారా, నెలకు లక్ష-రెండులక్షలు సంపాదించుకునే తెలుగు సాఫ్టువేరు ఇంజనీర్లు ? నేనేమైనా వారి గురువునా ? వారు నా శిష్యులా ? సమాచార సాంకేతికతలో తెలుగు ఎక్కడ వెనకబడి ఉందో వారికి నిజంగా తెలియదంటారా ? వారు నోట్లో లాలిపాప్‌లు పెట్టుకుని ఉన్నారా ?

Wit Real said...

>> తెలుగు కోసం ఏం చెయ్యాలో నా చేత
>> చెప్పించుకునే స్థితిలో ఉన్నారా,

వుండి వుండవచ్చు.

చాలా మందికి మీరు చెపుతున్నది అవసరం అనిపించకపోవచ్చు.

and necessity is mother.

మాగంటి వంశీ మోహన్ said...

తాడేపల్లి గారూ,
మీరు ఎవరికి గురువుగారు అయినా కాకపోయినా నాకు గురువుగారు, మిమ్మల్ని పల్లెత్తు మాటైనా అనలేను - తమలపాకు పక్కనబడెయ్యండి....సాఫ్టువేరు రంగానికి, అందులోనూ సాంకేతికతకు సంబంధించి నేనూ మీలాటివాడినే కాబట్టి ఆ ప్రశ్న. నిజంగానే అడుగుతున్నా - ఒక బ్లూ ప్రింటు సిద్ధం చేస్తే...జనాలను తోలుకొచ్చే బాధ్యత నెత్తికెత్తుకోడం కష్టం కాదనే ఇప్పటికీ నా అభిప్రాయం....మరి మీ సైటు ఏమిటో అని అడగవచ్చు మీరు - ఉత్త హెచ్.టి.ఎం.ఎల్, పీ.డి.ఎఫ్ లు తప్ప నాకు సాంకేతికంగా అంత ప్రజ్ఞా లేదు....సాఫ్టువేర్లోనే ఉన్నా, నా వేరు వేరు, సాఫ్టుకు సంబంధించింది కాదు.......అయ్యా అదీ సంగతి....
వంశీ

రాజేష్ జి said...

పిడకల వేట అనుకోకుండా .. "ఈ తమలపాకుతో
కొట్టడం" అనేది ఏంటో చెబుతారా? ఏదో సామెత గుర్తు వస్తు౦ది.. అది "తమలపాకుతో ఒకటేస్తే తలుపుచెక్కతో రెండేశాడు".. మోటు తత్వం గురించి ఇది. అదేనా ఇది?

mv said...

OFF TOPIC
* ఇది బ్లాగు టపాకు సంబంధించిన విషయం కాదు -
పైన రెండు మూడు వ్యాఖ్యలకి తోచిన మాట ఇది *
..........................
తెలుగువారి కొన్ని ప్రయత్నాలు మద్యలోనే
ఆగిపోతున్నాయి. ఎవరి కష్టాలు వారివి.
ఒకరిని / కొందరిని తప్పు పట్టడం వల్ల
మనకి ఒరిగే ప్రయోజనమేమీ ఉండదు..

http://groups.google.com/group/telugu-computing/

అయితే ఇటీవల ఓ తెలుగు నిఘంటువు (పునర్)
నిర్మాణ పనులు చక్కగా కొనసాగుతున్నాయట.

http://groups.google.com/group/telugunighantuvu/

లక్ష్యసాధన కోసం తగిన నిపుణులని ఒక వేదిక
పై తీసుకురావడం కష్టం కాదనుకుంటా ; అయితే
ఐకమత్యంగా కృషి చేసి కావలిసిన లక్ష్యాన్ని నిర్ణీత
వ్యవధిలో సాధించడమే కష్టంగా ఉంటున్నది -

జీతం రాళ్ల కోసం లాగించేయాల్సిన పనులు కావుగా !!

తాడేపల్లి said...

వంశీగారూ ! మన మనోగత బాధకు ఎవఱినో ఏదో అనుకోవడం దేనికి ? పరిజ్ఞానం లేకపోయినా నేనే ఏదో ఒకటి చే ( యి) స్తాలెండి, రాబోయే అయిదాఱేళ్ళ లోపల ! ముందస్తుగా మనలో మనం అనుకోవాల్సింది - భాషని అభివృద్ధి చేద్దామని పూనుకున్నప్పుడు తెలుగులాంటి భాషల commercial viability గుఱించి అస్సలు ఆలోచించకూడదని. ఈ భాషలకు ముందస్తుగా కొంత ఉచిత ఊతం, ప్రాపు కావాలి. ఆ తరువాత commercial viability నెమ్మదిగా దానంతటదే వస్తుంది.

Web Statistics