ఈ గురువారం విష్ణుభొట్ల లక్ష్మన్న 'ప్రముఖా"ముఖి
పూర్తిపేరు: విష్ణుభొట్ల లక్ష్మన్న
ఇతరపేర్లు: లక్కీ విష్ణుభొట్ల
సొంత ఊరు: సరిపెల్ల గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం: 1013 Ogden Drive, ఆష్టిన్, టెక్సాస్ - 78733, USA
వృత్తి: రిసెర్చ్ సైంటిష్ట్
ఇష్టమైన రచయితలు: శ్రీపాద, కొ.కు., కాళీపట్నం, రావి. శాస్త్రి, విశ్వనాథ
హాబీలు: శాస్త్రీయ - లలిత సంగీతం, నాటకాలు వేయడం, టెన్నిస్ ఆడటం, తోటపని, పుస్తక పఠనం
E-mail: Lark_Vishnubhotla@yahoo.com
సాహిత్య, కళా విమర్శకులు సైంటిస్టుల్లా పని చేయాలని అనుకుంటాను నేను. సాహిత్య కళా విమర్శని వొక బాధ్యతగా తీసుకొని,రచనని మనః ప్రయోగశాలలో అనేక విధాలుగా పరీక్షించి, ఒక హేతుబద్ధమయిన బేరీజు వెయ్యాల్సిన అవసరం ఇప్పుడు వుంది. సరయిన సాధనాలలో నేర్పు సాధించుకొని, తగిన అవగాహన తో రచనని "లోనారసి" చూడడం వొక విద్య. ఇతర రంగాలలో - ముఖ్యంగా సైన్సు రంగాలలో- పనిచేస్తున్న వారు సాహిత్యం గురించో, సినిమాల గురించో, కళల గురించో రాస్తే అందులో ఒక నిర్దిష్టతా, కచ్చితత్వం, సూటి దనం, స్పష్టతా కనిపిస్తాయి. విష్ణు భొట్ల లక్ష్మన్న గారు అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.
వృత్తి రీత్యా ఆయన సెమీకండక్టర్స్ లో పరిశోధనా విభాగంలో, ఆష్టిన్‌లో ఉన్న "ఫ్రీస్కేల్ సెమీకండక్టర్స్" లో ప్రస్తుతం పని చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని "సరిపెల్ల" గ్రామంలో కవలల్లో (రామన్న – లక్ష్మన్న) ఒకరుగా జన్మించారు. ప్రాథమిక విద్య, కొంత వరకు కాలేజీ చదువు ఆంధ్రాలోనే చేసారు. తరవాత, ఐ. ఐ. టి. ముంబైలో ఇంజినీరింగ్ చదువు పూర్తి అయిన తరువాత, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ లో భౌతికశాస్త్రంలో పి. హెచ్. డి పూర్తి చేసారు.
రిసెర్చ్ లో చాలా ఇష్టం ఉన్న లక్ష్మన్నగారి అమెరికా జీవితం యేల్ విశ్వవిద్యాలయంలో రిసెర్చ్ సైంటిష్టుగా 1988 సంవత్సరంలో మొదలయ్యింది. సెమీకండక్టర్ పరిశ్రమలో పనిచేయటానికి 1994 సంవత్సరంలో డాలాస్ రావటం, అక్కడ తెలుగు సంఘంలో చేరి 1998 సంవత్సరంలో డాలాస్ వదిలి ఆష్టిన్ వెళ్ళేదాకా చురుగ్గా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
ఆష్టిన్ వెళ్ళిన తరవాత తెలుగు సాహిత్యంపై ఇష్టం, పరిచయం ఉన్న మిత్రులతో కలిసి "ఈమాట" అన్న పేరుతో ఒక వెబ్ మాగజైన్ ప్రారంభించారు. ఇప్పటికీ "ఈమాట" కోసం రచనలు చేస్తూనే ఉన్నారు. 2002 సంవత్సరంలో అప్పటి మోటొరోలా కంపెనీలో పనిచేస్తూ, అత్యాధునిక సెమీకండక్టర్ చిప్స్ తయారీకి కావలసిన పరిశోధన కోసం ఫ్రాన్స్ లో మూడేళ్ళు పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.
అంతో ఇంతో రాయటం వచ్చిన ప్రవాసాంధ్రులు అందరూ తప్పకుండా రాయాలని వీరి అభిప్రాయం.
విష్ణుభొట్ల లక్ష్మన్న రచనల సూచిక:
1. ఓడలో ఏడు రోజుల కార్నివల్, ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 20 - 2009, ఆదివారం అనుబంధం http://www.andhrajy othy.com/ sunday/sundaysho w.asp?qry= 2009/20-9/ travel
2. గుర్రం జాషువా పాపాయి పద్యాలు, ఈమాట, సెప్టెంబర్ 2009 http://www.eemaata.com/em/issues/200909/1464.html
3. హాయి హాయిగా ఆమని సాగే, ఈమాట, జూలై 2009
http://www.eemaata.com/em/issues/200907/1441.html
4. ‘అపు సంసార్ ‘ - సత్యజిత్ రాయ్ సినిమా మార్చి 2009 » వ్యాసాలు http://www.eemaata.com/em/issues/200903/1411.html?allinonepage=1
5. ‘అపరాజితో’ - సత్యజిత్ రాయ్ సినిమా జనవరి 2009 » వ్యాసాలు
http://www.eemaata.com/em/issues/200901/1390.html?allinonepage=1
6. రహదారి పాట - “పథేర్ పాంచాలి” సత్యజిత్ రాయ్ సినిమా "ఈమాట" నవంబర్ 2008 » వ్యాసాలు
7. ఒంటరి గృహిణి - “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా "ఈమాట" మే 2008 » వ్యాసాలు
8. ఏది నిజం? - “రషోమాన్” జాపనీస్ సినిమా "ఈమాట" మార్చి 2008 » వ్యాసాలు
9. ఎందుకు రాయాలో అందుకే చదవాలి "ఈమాట" జనవరి 2008 » వ్యాసాలు
10. రొసెట్టా రాయి కథ - వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష
"ఈమాట" నవంబర్ 2007 » వ్యాసాలు
11. మా ఫ్రాన్స్ అనుభవాలు "ఈమాట" సెప్టెంబర్ 2007 » వ్యాసాలు
12. మా ఈజిప్ట్ యాత్ర "ఈమాట" జూలై 2006 » వ్యాసాలు
13. కథాశిల్పం "ఈమాట" మార్చి 2006 » వ్యాసాలు
14. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? "ఈమాట" జూలై 2001 » వ్యాసాలు
15. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి "ఈమాట" మే 2001 » వ్యాసాలు
16. మీ ఘంటసాల "ఈమాట" మే 2001 » సమీక్షలు
17. రాగలహరి: హిందోళం "ఈమాట" మార్చి 2001 » వ్యాసాలు
18. రాగలహరి: కల్యాణి "ఈమాట" జనవరి 2001 » వ్యాసాలు
19. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు "ఈమాట" నవంబర్ 2000 » వ్యాసాలు
20. రాగలహరి: సింధుభైరవి "ఈమాట" నవంబర్ 2000 » వ్యాసాలు
21. రాగలహరి: అభేరి "ఈమాట" జూలై 2000 » వ్యాసాలు
22. రాగలహరి: మోహనం "ఈమాట" మే 2000 » వ్యాసాలు
23. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి "ఈమాట" నవంబర్ 1999 » వ్యాసాలు
24. ఘంటసాల - బాలసుబ్రహ్మణ్యం "ఈమాట" నవంబర్ 1999 » వ్యాసాలు
25. ఆల్ప్స్ అంచున మూడేళ్ళు, "ఆంధ్రజ్యోతి", ఆదివారం అనుబంధం, అక్టోబర్ 14, 2007
26. రొసెట్టారాయి - చచ్చి బతికిన ఓ రాయి కథ, "ఆంధ్రజ్యోతి", ఆదివారం అనుబంధం, డిసెంబర్ 23, 2007
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
0 comments:
Post a Comment