ఇది నన్ను వెతుక్కుంటుందో లేదో నహీ మాలూం -
లేకిన్-
నేనెప్పుడూ దీని వేళ్ళ సందులోంచి చిరిగిన ఆకాశాన్నీ, చింపిరి జుత్తు నేలనీ, కొంకర్లు తిరిగే చలి చెట్లనీ వెతుక్కుంటూ వుంటా పొద్దస్తమానం.
ఆ కాంపస్ కెళ్ళే దారిలో ఆ ఆకుపచ్చ మలుపు మీద వాలిపోయిన సాయంత్రం రెక్క మీద
ఎటు ఎగిరి వెళ్ళానో నహీ మాలూం..
కానీ-
జారిపోతున్న వొక రాత్రి దాని మోదుగు పూల ఎర్రదనంలో కరిగిపోతా ఇప్పటికీ.
ఇప్పుడక్కడ పొద్దుటా సాయంత్రం ప్రతి రాత్రీ వొక కల వెయ్యి గులాబీ రేకులై దారిని పరచుకుంది
అప్పుడెప్పుడో మరిచిపోయిన కల జెండా అయి ఎగరడం చూస్తున్నా.
ఈ చీకటి దారి చివర వొక సూర్యుడి కోసం
చూస్తున్నా.
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
5 comments:
అప్పుడెప్పుడో మరిచిపోయిన కల జెండా అయి ఎగరడం చూస్తున్నా.
అద్భుతంగా వుందిసార్ ఈ వ్యక్తీకరణ..
ఇలా అనొచ్చా అని చాలాసేపు అనుకొని సారేమన్న అనుకోని అని ధైర్యం చేసా.
Thanks a lot, Varma!
sir, this poem attracted me in a way... but my pea brain felt a little reluctant to dig the meaning of this one...INITIALLY
But sir, the thing i love most in your writings is, yu write in a very casual way, very normal...ado maamulugaa maatladu thunnatlu raastharu.
such a lovely style sir.
ఆ కాంపస్ కెళ్ళే దారిలో ఆ ఆకుపచ్చ మలుపు మీద వాలిపోయిన సాయంత్రం రెక్క మీద
ఎటు ఎగిరి వెళ్ళానో నహీ మాలూం..
this is a thunderous line sir. as soon as i completed reading this poem...i searched for this line to have another read.
sir...
this is going to be my facebook status{lol}-
అప్పుడెప్పుడో మరిచిపోయిన కల జెండా అయి ఎగరడం చూస్తున్నా.
another thunder bolt.
ah...yu r making me to write in telugu sir...
thanQ very much for such a wonderful style
రోహిత్:
థాంక్ యు.
కవిత్వాన్ని ఇంత దగ్గిరగా చదివే వాళ్ళు వుండడం అదృష్టమే !
నిరలంకారంగా రాయడం కష్టం అని నా కొద్ది పాటి కవిత్వ అనుభవంలో అర్ధమయ్యింది. నేను ఆ వైపు వెళ్తున్నాను.
"జారి పొయిన రాత్రి" ని మించిన కవిసమయం ఉందా..? ఓ ఆకుపచ్చని మలుపులో దొరక్కపోదు.. బావుంది "అ"
Post a Comment