ఇఫ్తార్ సైరన్












నాకు భలే ఇష్టమయిన కేక!

ఇక ఈ పూట కడుపులో చంద్రోదయమే!


ముప్పొద్దులూ ఎక్కడున్నాయిలే

ఈ చీకటి పొయ్యిలో సూర్యుణ్ణి రాజేసేది

ఎప్పుడూ వొక్క పొద్దే!

కడుపులో భగభగా మండే సూర్యుళ్ళ చుట్టూ

గిరగిర తిరిగే భూగోళం అమ్మ.


ఎల్లా తెల్లారుతుందంటావ్?!

ఫజర్ నమాజ్ అయ్యాక

అజా పిలుపుకి ఆకలి తెలీదు

ఆ ఆకలి కేకకి భాషా తెలీదు



భూమి చుట్టూ ఏకనాదమయి మోగిన కంఠం

తిరిగి మసీదుని చేరేలోగా

కడుపు ఆ మూల ఖిబ్లా కన్నా ఖాళీ, ఖాళీగా..దిగులు దిగులుగా...


ఈ పగలు ఎంత స్వచ్ఛంగా వుందో తెలుసా?

మీరంతా ఎంత

పవిత్రమయిపోతున్నారో నెలంతా వొక్క పొద్దుతో!

నేను ఏళ్ల తరబడి

ఈ వొక్కపొద్దు అగ్నిలో కాలీ కాలీ

బూడిద కాలేక

మీరంతా తొక్కీ తొక్కీ

అలిసిపోయిన నిప్పు గుండంలా పడి వున్నా.



చిన్నప్పటి నించీ ఏం చూశానో ఏం విన్నానో

అదే చెబుతున్నా.

కాలెండర్లో రోజు రోజుకీ పెరిగిపోతున్న

రోజుల భారాన్ని మోయలేక నాన్న

అసహనంతో వేసిన కేకల్లో

ఎన్ని రోజా పిలుపులున్నాయో?



ఎప్పుడూ నిండుకునే ఇంట్లో

మిగిలిన ఖాళీల్ని భర్తీ చేయలేక

రెప్పల బురఖా కింద దాక్కున్న కన్నీటి చుక్క అమ్మ.

నిజంగానే

ఆ మూడో వాడు రాకపోతే

ముప్పొద్దులూ వుండెనా మాకు?!



5.20 ఇఫ్తార్

మధ్యాన్నమయ్యేసరికి గడియారానికీ చులకనే!

తక్కుతూ తారుతూ నడుస్తుంది రోగిష్టి ముండ!

ఆ గంజి నీళ్లూ, ఆ బూందీ ఓ అరటి పండూ

రోజంతా వెంటాడే ఆ తీయని పరిమళం


ఎలాగోలా జాలి పడి, పరిగెత్తవే కాలమా?



పోనీలే,

ఈ వొక్క నెలయినా వొక్క పొద్దయినా దక్కనీ...

ఇక మిగిలిన 330 రోజులూ మూడంకెలే కాదా!

నేనెంత పవిత్రమయిపోతున్నానో ఈ నెలంతా?!



                                            (1997, “వలస “ నించి)

(ఏదో వొక నెల పుణ్యం కోసం కాకుండా, పూటకి ఠికానా లేక, ఏడాదిలో మూడు వందల రోజుల పైనే వొక్క పొద్దులుంటున్న కోట్ల మందికి)
Category: 7 comments

7 comments:

చిలమకూరు విజయమోహన్ said...

"ఏదో వొక నెల పుణ్యం కోసం కాకుండా, పూటకి ఠికానా లేక, ఏడాదిలో మూడు వందల రోజుల పైనే వొక్క పొద్దులుంటున్న కోట్ల మందికి"
నేనేమివ్వగలను అశ్రుతర్పణం తప్ప.
చాలా బాగుంది(ఇది చాలా చిన్నపదం)
మీకు రంజాన్,వినాయక చవితి పర్వదినాల శుభాకాంక్షలు.

చందు said...

manchi kavitha madi ni takindilaa !!!
eed mubaarak !!!
వినాయక చవితి శుభాకాంక్షలు.

Afsar said...

@మోహన్ గారూ;

అశ్రు తర్పణం కన్నా విలువయింది ఏదీ లేదు ఇప్పుడు. అందరి కళ్ళూ ఇప్పుడు బండ రాళ్ళు అయిపోయాయ్ కదా!

@సావిరహే: థాంక్ యు. మీ బ్లాగ్ చూశాను ఇప్పుడే. నాకు నచ్చింది.

Afsar said...

@మోహన్ గారూ;

అశ్రు తర్పణం కన్నా విలువయింది ఏదీ లేదు ఇప్పుడు. అందరి కళ్ళూ ఇప్పుడు బండ రాళ్ళు అయిపోయాయ్ కదా!

@సావిరహే: థాంక్ యు. మీ బ్లాగ్ చూశాను ఇప్పుడే. నాకు నచ్చింది.

Afsar said...

@మోహన్ గారూ;

అశ్రు తర్పణం కన్నా విలువయింది ఏదీ లేదు ఇప్పుడు. అందరి కళ్ళూ ఇప్పుడు బండ రాళ్ళు అయిపోయాయ్ కదా!

@సావిరహే: థాంక్ యు. మీ బ్లాగ్ చూశాను ఇప్పుడే. నాకు నచ్చింది.

భాస్కర రామిరెడ్డి said...

Afsar గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

హారం

శాంతిశ్రీ said...

ఎలాగోలా జాలి పడి, పరిగెత్తవే కాలమా?

పోనీలే,

ఈ వొక్క నెలయినా వొక్క పొద్దయినా దక్కనీ...

ఇక మిగిలిన 330 రోజులూ మూడంకెలే కాదా!

నేనెంత పవిత్రమయిపోతున్నానో ఈ నెలంతా?!..కన్నీరు పెట్టించే దారిద్ర్యం.. అక్షర కన్నీళ్లు... సలామ్ అఫ్సర్ జీ..

Web Statistics