Monday, September 13, 2010

గతం ఇప్పటిదేనని...!

            - కృష్ణుడు (హస్తినా పురి నించి )



ఎప్పుడో ఒకప్పుడు


ఏదో ఒక దుస్స్వప్నం

గుండెను పిండించి

సిరాలో ప్రవహిస్తుంది

ఏదో ఒక నిశీథి

......నక్షత్రం రాలి

మనసుకు గుచ్చుకుంటుంది

ఉన్నట్లుంది

ఒక పాట కత్తిలా మారి

పొరల్ని చేదిస్తుంది

ఎప్పుడో ఒకప్పుడు

ఏడు సముద్రాల అవతలి నుంచి

అఫ్సర్ కవిత

గతం ఇప్పటిదేనని గుర్తు చేస్తుంది.


(కృష్ణుడు...ఇప్పుడు కృష్ణా రావు గా పత్రికాలోకానికి సుపరిచితుడు. ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్. 1980లలో తెలుగు దినపత్రికలలో సాహిత్య పేజీల సాంప్రదాయం నిలబెట్టడంలో కృష్ణుడిది కీలక పాత్ర. అలనాటి అనువాదాలూ, వాద వివాదాలలో కృష్ణ దౌత్యాలు ముఖ్య ఘట్టాలు. అఫ్సర్ బ్రాండ్ కవిత్వం, అఫ్సరీకులు అనే పదబంధాలు అతని సృష్టే! )

4 comments:

అక్షర మోహనం said...

eppati gatam..ippudu gurthu chesaaru..

Afsar said...

మోహనా:

గుర్తొచ్చిందీ అంటే అది గతం కాదు, వర్తమానంలో ఎదో ఆ గతాన్ని బతికిస్తుంది.
చాలా తాత్వికంగా చెప్పానా?
కవిత్వం విఫలమయితే ఫిలాసఫీనే మరి!

Afsar said...

మోహనా:

గుర్తొచ్చిందీ అంటే అది గతం కాదు, వర్తమానంలో ఎదో ఆ గతాన్ని బతికిస్తుంది.
చాలా తాత్వికంగా చెప్పానా?
కవిత్వం విఫలమయితే ఫిలాసఫీనే మరి!

gajula said...

అవును ,మరచినంతవరకే అది గతం - గుర్తొస్తే అది వర్తమానం -భవిస్యతుపై ఆశ పోతే అది మరణం -వర్తమానంలో జీవిన్చాకుంటే అది శవం . achhuthappulaku kshamaarhunni.

నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం

అఫ్సర్ కవితాసంపుటి ‘యుద్ధం మధ్యలో నువ్వు’ రచన:  ఎమ్వీ రామిరెడ్డి  -   ఈమాట నుంచి--   ‘‘సమయం లేదు. యెవరిదగ్గిరా కనీసం అరక్షణం లేనే లేదు. సహనం...