- కృష్ణుడు (హస్తినా పురి నించి )
ఎప్పుడో ఒకప్పుడు
ఏదో ఒక దుస్స్వప్నం
గుండెను పిండించి
సిరాలో ప్రవహిస్తుంది
ఏదో ఒక నిశీథి
......నక్షత్రం రాలి
మనసుకు గుచ్చుకుంటుంది
ఉన్నట్లుంది
ఒక పాట కత్తిలా మారి
పొరల్ని చేదిస్తుంది
ఎప్పుడో ఒకప్పుడు
ఏడు సముద్రాల అవతలి నుంచి
అఫ్సర్ కవిత
గతం ఇప్పటిదేనని గుర్తు చేస్తుంది.
(కృష్ణుడు...ఇప్పుడు కృష్ణా రావు గా పత్రికాలోకానికి సుపరిచితుడు. ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్. 1980లలో తెలుగు దినపత్రికలలో సాహిత్య పేజీల సాంప్రదాయం నిలబెట్టడంలో కృష్ణుడిది కీలక పాత్ర. అలనాటి అనువాదాలూ, వాద వివాదాలలో కృష్ణ దౌత్యాలు ముఖ్య ఘట్టాలు. అఫ్సర్ బ్రాండ్ కవిత్వం, అఫ్సరీకులు అనే పదబంధాలు అతని సృష్టే! )
Subscribe to:
Post Comments (Atom)
నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం
- బొల్లోజు బాబా ( ఈ వ్యాసంలోని కొంతభాగం కవిసంధ్య పత్రికలో ప్రచురణ అయినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు. వ్యాసం పెద్దది. రెండుభాగాలుగా పోస్...

-
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ- 1 మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే! ...
-
శ్రీశ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ ల...
-
1 అ ర్థరాత్రి మెలకువొస్తుంది. వున్నట్టుండి లేస్తావు. మూత్రం వస్తున్నట్టుగా శరీరంలో వొక అసౌకర్యమైన చలనం. అటు తిరిగి పడుకొని వున్న శాం...
4 comments:
eppati gatam..ippudu gurthu chesaaru..
మోహనా:
గుర్తొచ్చిందీ అంటే అది గతం కాదు, వర్తమానంలో ఎదో ఆ గతాన్ని బతికిస్తుంది.
చాలా తాత్వికంగా చెప్పానా?
కవిత్వం విఫలమయితే ఫిలాసఫీనే మరి!
మోహనా:
గుర్తొచ్చిందీ అంటే అది గతం కాదు, వర్తమానంలో ఎదో ఆ గతాన్ని బతికిస్తుంది.
చాలా తాత్వికంగా చెప్పానా?
కవిత్వం విఫలమయితే ఫిలాసఫీనే మరి!
అవును ,మరచినంతవరకే అది గతం - గుర్తొస్తే అది వర్తమానం -భవిస్యతుపై ఆశ పోతే అది మరణం -వర్తమానంలో జీవిన్చాకుంటే అది శవం . achhuthappulaku kshamaarhunni.
Post a Comment