ఊరు దాటుతున్నప్పుడు
పక్కనే ఏరు కదలాలి
అమ్మ చాచిన చెయ్యిలా.
అప్పుడే తెరుచుకుంటున్న
ఎండ తలుపుల్లోంచి
సూర్యుడు తొంగి చూస్తుండగా
చల్లని నుదుటి మీద
ఆడుకుంటున్న నులి వెచ్చని జ్నాపకం.
అప్పుడప్పుడూ
ఈ గట్టు మీంచి ఆవలి గట్టుకి
కళ్ల పక్షుల్ని చివరంటా షికారుకి పంపాలి.
ఏరు మీంచి పారే గాలి అలల మీంచి
ఏ భాషకీ తెగని మాటల్ని పంపి
తిరుగుటపాలో
కళ్ళు పట్టేటన్ని ఆకాశప్పాఠాల్ని వొంపుకోవాలి.
రోడ్డు మీద నడిచేటప్పుడు
నీటి పొరల మీద కాళ్ళు మోపినట్టుండాలి
నదిని రెక్కల కింద దాచుకున్నంత తృప్తిగా
బుడుంగున మునిగి తేలుతున్న కొంగలు
అలా మాటి మాటికీ ఆకాశంలోకి
ఏ మాటల్ని ఎగరేస్తున్నాయో చూడాలి.
చిత్రంగా మనం
గదులు కట్టుకున్నట్టే
నదులకూ తాళాలు వేస్తాం కదా
ఆ తాళాల సందుల్లోంచి
నురుగులు కక్కుతున్న నీళ్ళల్లో
కన్నీళ్ళున్నాయో లేదో చూడాలి.
ఆ పచ్చని నేలని దాటి
ఆకాశం తప్ప అక్కడ ఇంకేమీ లేనట్టు
అల్లుకుపోయిన లోకంలో
ఏ కాలానికీ ఏ దారికీ దొరక్కుండా
ఎక్కడెక్కడికో తప్పి పోవాలి.
ఊరు చేరుతున్నప్పుడు
పక్కనే ఏరు కదలాలి
అమ్మ చాచిన చెయ్యిలా.
నీటి ఉరుకులకి తెగిపోతున్న గట్ల మీదికి
వొంగి వొంగి ఆ చెట్లన్నీ
ఏ వూసులు చెబుతున్నాయో వినాలి.
లోపలి గుస గుసలన్నీ
బయటికి వచ్చీ రాకుండానే
అప్పుడొస్తుందింక తెనాలి!
(1994. “వలస” నుంచి)
9 comments:
నిన్ననే వచ్చాను తెనాలి నుంచి..
నరేశ్ గారూ:
ఇది 94లో రాసిన కవిత.
ఇప్పుడు తెనాలి బాగా మారిపోయి వుండాలి.
మీ కొత్త అనుభవంలోంచి తెనాలి ఎలా మారిందో చెబితే బాగుంటుందేమో!
నాకు తెలీసి 94లో కుడా తెలినాలి ఇలా లేదు (కవితలో చెప్పినట్టు).
ఇప్పుడూ కొద్ది మార్పులతో అలానే ఉన్నది, అప్పట్లో జనాలు టాయిలెట్లు లాగా వాడుకున్న గట్లు ఇప్పుడు తెనాలి చెత్త వేసి, చెట్లతో సహా కాలుస్తున్నారు.
అప్పుడూ, ఇప్పుడూ ఊరిలో కాలువలు మురికి కూపాలు..
మీ తెనాలికి మా వేటపాలెం మళ్ళి గుర్తుకొచ్చింది.మరోసారి నా బాల్యాన్ని మా వూరి పుల్ల కలవ ఒడ్డు వెంట తిప్పినందుకు కృతజ్ఞతలు అఫ్సర్ జీ!-నాకు ఎందుకో "akasppatalu" anna చోట ఆకాశ టపా" అని వుంటే బాగుండునేమో అనిపించింది .అయినా మీకు నేను చెప్పటమేమిటి!..జస్ట్ అప్పటికప్పుడు ఆది నాకు తోచిన ఊహ..ఎంత ఎదిగిన మీకు లాగా మనసుతో పాటు పసితనం లోకి అంత సునాయాసం గా ఎగిరిపోవటం అందరికి సాధ్యమయేది కాదు!YOU are just a blissed soul!
@ తార: నేను చూసిన తెనాలి నా కవితలో మాదిరిగానే వుంది అప్పుడు.
@రావు గారు: అవును, కవిత్వం రెక్కల మీద పసితనంలోకి వెళ్ళడం సాధ్యమే. అదే కవిత్వ శక్తి కాబోలు! మీ మంచి మాటకి ధన్యవాదాలు. "ఆకాశ టపా" అన్న మాట బాగుంది. తరవాత వాడుకుందాం.
అలా అంటారా....
ఐతే ఇప్పుడూ అలానే ఉన్నది తెనాలి, పెద్దగా మార్పులు ఐతే లేవు లేండి మరి..
మీరు నాకు మంచి పాయింట్ అందించారు,.. పట్టణీకరణమీద, ధన్యవాదాలు...
అఫ్సర్ గారు మీది తెనాలి అని ఎప్పుడే తేలేసింది. తెనాలి లో మీది ఏ పేట. నాది నందులపేట, నేషనల్ క్లబ్ ఎదురు పోస్టల్ కాలనీ రోడ్. తెలుగు ముస్లిం కవులలో మీరు ఒకరు అని తెలుసు , కానీ మా వూరు వారని తెలియదు. AVS అన్నట్లు మీది తెనాలి, మాది తెనాలి. నేను తెలుగు లో ముస్లిం వాదం అనే వ్యాసం తెలుగు, ఇంగ్లిష్ 2 భాషలలొ రాశాను అందులో మీ ప్రస్తావన ఈ విదంగా చేశాను.
అఫ్సర్ తన కవితలలో తను చెప్పదలచుకొన్న భావాన్ని అత్యంతం మృదువుగా శ్రావ్యంగా వినిపించేవాడు
.Afsar is known for his deeply nuanced language, subtle and subversive. He works his way in a quiet voice and ends just as quietly, as if he has said nothing
worthwhile, but he is devastating in his undertones.
నేను తెనాలి విఎస్‌ఆర్ & ఎన్‌విఆర్ కళాశాల లో పోలిటిక్స్ లెక్చరర్. తెలుగు పై ఆసక్తి ఉంది. మీరు అంగీకరిస్తే నా వ్యాసం పంపుతాను.
అబినందనలతో మహమ్మద్ అజ్గర్ అలీ.

Post a Comment