వొక జీవిత కాలం తరవాత, నాన్నా
నువ్వు అర్ధం అవుతున్నావ్ నెమ్మదిగా.
అతి నెమ్మదిగా
ఆగిపోయిన వేడి నిట్టూర్పులాగా
సాయంత్రపు గూటిలో ఆరిపోవడానికో
పారిపోడానికో నిరాకరించే గుడ్డి దీపంలాగా.
వందల వుదయాలు
ఇంకా కొన్ని వందల సాయంకాలాలు
సడి సేయని కొన్ని రాత్రులూ స్నేహరాహిత్యపు నడి రాత్రులూ
ద్రవించని చీకటి పగళ్ళూ
నేర్పలేని బతుకు పాఠం ఏదో
కొత్త పేజీ తిప్పుతోంది ఈ పూట
నువ్వు పూర్తిగా నా కంటిలోంచి జారిపోయాక
ఈ ఇల్లు నీ అనంతర నిశ్శబ్దపు నదిలో
పొగిలిపోతున్న పడవ.
నువ్వు వెళ్ళాకనే
నీ తలాపు దీపపు నీడలోనే
నిన్ను నిజంగా చూస్తున్నానేమో నేను.
ప్రేమించాల్సింది బతుకునో
మరణాన్నో తెలియక
వొక నిట్టూర్పు నిట్టాడి మీద
నిటారుగా వొరిగే గుడిసె నేను.
మరణం ఎప్పుడూ వో కొత్త పాఠమే !
అదే పేజీ మీద
అదే ఈగ
అదే నెమలీక
అదే పునరుక్తి.
(నాయుడూ, ఇది మీ నాన్న కోసమే అని చెప్పలేను, నా కోసమే అనీ అనుకుంటాను, ఎప్పుడో రాయాలనుకొని రాయలేకపోయిన రామ్ కోసం అని కూడా అనుకుంటాను.)
Subscribe to:
Post Comments (Atom)
నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం
- బొల్లోజు బాబా ( ఈ వ్యాసంలోని కొంతభాగం కవిసంధ్య పత్రికలో ప్రచురణ అయినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు. వ్యాసం పెద్దది. రెండుభాగాలుగా పోస్...

-
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ- 1 మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే! ...
-
శ్రీశ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ ల...
-
1 అ ర్థరాత్రి మెలకువొస్తుంది. వున్నట్టుండి లేస్తావు. మూత్రం వస్తున్నట్టుగా శరీరంలో వొక అసౌకర్యమైన చలనం. అటు తిరిగి పడుకొని వున్న శాం...
3 comments:
సంధర్భం పునరావ్రుతం కావచ్చు... కానీ, కవి సమయం, శీర్షికా కూడా పునరావ్రుతమయ్యాయి.
ఓ,రాజా! అది వెంటనే ఎగసిపడిన బాధ. కవి సమయాల కోసం వెతుక్కోలేదు ఆ క్షణాన్న.
అవును, ఉద్దేశపూర్వకంగానే, నాయుడు గారి పుస్తకం శీర్షికని పునర్ ప్రస్తావించాను. ఆ శీర్షిక ఎంత అర్ధవంతమో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది!
sir...
its really delightful to read your poetry after working whole day hardly and telling bye to sun satisfactorily...!
once again...sir...this is amazing poetry.
naaku iee poem chaala nachindhi sir.
Post a Comment