1
ఇక్కడ సాయంత్రం ఏనాడూ లేదు కాబట్టి
ప్రతి నిద్రలో
వొక సాయంత్రాన్ని కలకంటాను ఇప్పటికీ.
చెట్లకి నీడలు చెరిగిపోయాక
ఆకాశం ఎండనంతా ఆరేసుకున్నాక
ఒక చలి గాలిని కప్పుకొని
ఏదో ఒక సాయంత్రం
చీకటి పడేలోగా
గూడులోకి రెక్కలు ముడుచుకోవాలి.
2
వాన మధ్యాన్నమే మొదలయ్యిందో
పొద్దుటి నించీ పడుతూందో తెలీదు
మధ్యాన్నం మొదలయ్యే బతుక్కి
ఉదయాలూ తెలియవు.
మధ్యాన్నం లేచే సరికి
గడియారం మోగీ మూల్గీ
విసుక్కుంటూ వుంటుంది.
కాలాన్ని
తిరగేసి చూడడం అలవాటే!
3
వానలూ చలికాలాలూ
వాటి భ్రమణ కాంక్షల్ని చంపుకున్నాక
మొలిచిన అష్టావక్ర .
4
హైదరాబాద్ నా రూపాంతరం
వొక కల లేని నిద్ర
నిద్ర రాని కల
- కునుకు కప్పుకున్న మెలకువ.
2 comments:
"చెట్లకి నీడలు చెరిగిపోయాక
ఆకాశం ఎండనంతా ఆరేసుకున్నాక
ఒక చలి గాలిని కప్పుకొని"
హైదరాబాదు ఒకటే కాదు.. అన్ని పెద్ద ఊర్లకూ వర్తింస్తుందనుకుంటాను..
కవిత బాగుంది
this piece is a stunning one. each line is unique and is inspirational enough to tune my muse in a passionate way. ThanQ once again for such a delightful piece sir...
Post a Comment