వొక సీతాకోక చిలక
ఆత్మహత్యకి ముందు విడిచి వెళ్ళిన
కోకల రంగులు
రోడ్డు మీద మెరుస్తూ కనిపిస్తాయి
వెయ్యి మందికిపైనే
ఈ రోడ్డుని తొక్కి వెళ్ళిపోయారు
ఎవరికెవరూ కనిపించకుండా.
వొక మధ్యాన్నం
చార్మినార్ సిగ మీద సూర్యుడు
తెల్ల బంతి పువ్వై నవ్వుతున్నప్పుడు
కాసేపు అతని వొకానొక చూపులోకి
నువ్వూ ప్రయాణించు.
అంత కష్టమేమీ కాదు
కణ కణ నిప్పుల కొలిమిలోకి
వొక కన్నుని వొంపి
అనేక చూపుల ద్రవాన్ని
బయటికి లాగడం!
వొక సీతాకోక చిలక
తన రంగులన్నీ మరచిపోయి
నలుపులోకి నిష్క్రమించింది
ఈ మలుపు దగ్గిరే.
ఇక్కడి నించి
జీవితాన్ని చూడు
అదెలా కనిపిస్తూ వుందో
కాస్త చెప్పు.
ఇప్పటి దాకా నడుస్తూనో
పరిగెత్తుతూనో వెళ్ళిన ఆ వెయ్యి మంది
కనీసం
వెయ్యి అబద్ధాలు చెప్పారు
అమాయకంగానే!
నిడదవోలు మాలతి కి మొల్ల పురస్కార ప్రదానం
-
ఏడు శతాబ్దాల నాటి రచయిత్రి మొల్ల. ఏడు వసంతాల సాహిత్య సౌరభం మాలతి గారు. ఈ
ఇద్దరినీ, మరెందరో సాహిత్య విమర్శకులను, అభిమానులను కలుపుతున్న సాంకేతిక జూమ్
స...
1 year ago
2 comments:
ఆత్మహత్యకి ముందు విడిచి వెళ్ళినకోకల రంగు,
కణ కణ నిప్పుల కొలిమిలోకి వొక కన్నుని వొంపి,
అనేక చూపుల ద్రవాన్నిబయటికి లాగడం,
తన రంగులన్నీ మరచిపోయి నలుపులోకి నిష్క్రమించింది,
బాగుంది అఫ్సర్ గారు.
భాను, ఎలా వున్నారు? థాంక్స్ ..రఘు వీడియో ఎక్కడి దాకా వచ్చింది?
Post a Comment