భావకవిత్వం కాదు చదువుతూ మధుర ఊహలలో తేలిపోవటానికి....."ఊరి చివర" కవిత్వం మీద ఇంకా చర్చలు సాగుతూండగానే, పుస్తకం డాట్ నెట్ లో "దీప్తిధార" సి.బి. రావు గారు మరో సమీక్ష రాశారు.రావు గారికి ధన్యవాదాలు.

ఆయన సమీక్ష నించి కొన్ని "మెచ్చు" తునకలు:-అఫ్సర్ కవితలు భావకవిత్వం కాదు చదువుతూ మధుర ఊహలలో తేలిపోవటానికి. అవి మనస్సుకు పదును పెట్టే చిక్కుముళ్లు. కవితను చదువుతూ చిక్కుముళ్లను విడదీస్తూ కవి ఏమి చెప్తున్నాడనే విషయం తెలుసుకోవటానికి మనస్సుకు పనిపెట్టాల్సిందే. భావ కవితలు, సులభ వచన కవితలు, ఉద్వేగ పరిచే కవితలు చదివే వారికి ఈ కవితలు ఒక పట్టాన అంతుచిక్కక అయోమయంలో పడవేసే ప్రమాదముంది. అందుకు సిద్ధం కాని వారు ఈ కవితలకు దూరంగా వుండవచ్చు.

-అఫ్సర్ కవితలలో రసాస్వాదన తక్కువే. అఫ్సర్ కవితలలో కొన్నింటిలో దాదాయిజం (Dadaism) ఛాయలు కనిపిస్తాయి. దాదా ఏమిటి? కళలు లో ఉండే రసానికి (aesthetics) దాదాయిజం వ్యతిరేకం. దాదాయిజం బూర్జువా శక్తుల రాజ్యకాంక్షకు, యుద్ధ ప్రీతికి వ్యతిరేకి. దాదా కళలలో గందరగోళం, తర్కానికి అందని ఆలొచనలు కూడా కనిపిస్తాయి.

-ఆంధ్రదేశాన ఎందరో కవుల కవితలు ఎవరూ పట్టించుకొక చీకటిలో అలమటిస్తున్న కాలంలో, అఫ్సరీకులకు (అఫ్సర్ కవితలు) పెక్కు విమర్శకులుండటం ఆ కవితా వైశిష్టమనే చెప్పాలి. చివరగా అఫ్సర్ కవిత్వం ఎందుకు చదవాలి? అఫ్సర్ కవితలకు అభిమానులు, నిరసన గళం వినిపించే విమర్శకులూ ఏక కాలంలో ఎలా వున్నారు? అఫ్సర్ కవిత్వం లో ఉంది అయోమయమేనా? అఫ్సర్ కవిత్వానికి అభిమానులు, విమర్శకులు ఇచ్చే కితాబుల్ని ఎలా నమ్మటం? ఈ ప్రశ్నలకు అఫ్సర్ బ్రాండ్ కవిత్వం చదివి పాఠకుడే ఒక నిర్ణయానికి రావల్సి ఉంది.

పూర్తి సమీక్ష కోసం www.pustakam.net చూడండి.

0 comments:

Web Statistics