Wednesday, January 4, 2012

మహాకవి ఆరుద్రతో వొక సభలో...స్మృతిచిత్రం!




పాతికేళ్ళ కిందటి చిత్రం ఇది.

నేను ఆంధ్రజ్యోతి దినపత్రికలో పని చేస్తున్న కాలంలో బెజవాడ ప్రెస్ క్లబ్ లో మహాకవి ఆరుద్ర సాహిత్య ప్రసంగం చేశారు. ఆ సభకి అధ్యక్షత వహించే అవకాశం అప్పుడు నాకు దొరికింది. ఆరుద్ర ఈ సభలో చేసిన ప్రసంగం ఎప్పటికీ మరచిపోలేను. తన బాల్యం, యవ్వనం తో మొదలుకొని, అప్పటికి తన సాహిత్య దృక్పథంలో వచ్చిన మార్పులన్నిటినీ ఆరుధ్ర పూసగుచ్చినట్టు వివరించారు. సభ తరవాత ప్రశ్నలూ- జవాబులలో కూడా ఆరుద్ర చాలా సేపు మాట్లాడారు.

"మీరు నిమ్మళంగా, నిశ్శబ్దంగా వున్నారు కానీ,నాతో తెగ మాట్లాడించారు." అని ఆ రోజు సభ తరవాత ఆరుద్ర నవ్వుతూ అన్నారు.

3 comments:

Bolloju Baba said...

you are so cure sir :-)

Rohith said...

Thanx for showing a piece of memory sir.

ఆ.సౌమ్య said...

ఆ చివర కూర్చున్నది మీరేనా! భలే ఉంది...ఏవేవో జ్ఞాపకాల్ని తట్టి లేపింది ఈ ఫొటో. మా నాన్నగారు, ఆరుద్రగారితో తీయించుకున్న ఫొటో, ఆయన స్నేహాన్ని మా నాన్నగారు పదే పదే గుర్తు చేసుకోవడం...ఇలా!

అద్సరేగానీ ఊరికే ఫొటో పెట్టేసి చేతులు దులిపేసుకుంటే సరా? మీ జ్ఞాపకాల తుట్టు కదపండి...ఆరోజు ఆరుద్రగారు ఏమేమి మాట్లాడారో, మీతో ఏమేమి చర్చించారో రాయండి. వినాలని మాకుండదూ!

నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం

అఫ్సర్ కవితాసంపుటి ‘యుద్ధం మధ్యలో నువ్వు’ రచన:  ఎమ్వీ రామిరెడ్డి  -   ఈమాట నుంచి--   ‘‘సమయం లేదు. యెవరిదగ్గిరా కనీసం అరక్షణం లేనే లేదు. సహనం...