నువ్వొచ్చేటప్పుడు....!




ఎటు నించి ఎప్పుడొస్తావో
తెలీదు గాని
నువ్వొచ్చేటప్పుడు
కాసింత నిశ్శబ్దాన్ని పట్రా...


వొక నిరామయ నిరాలోచననీ పట్రా...

1

సతమతమయి వున్న గదిలో గాలినీ వెలుతురినీ నులిమేసిన ఇరుకు గోడల్లో లోపలంతా ఇంకిపోయిన ఎడారిలో


2

రాలినపూల వొంటి మీద వూరేగుతున్న శబ్దాల రెపరెపల్లో నిప్పు పూలు పూసిన కన్రెప్పల్లో కాయలై కాసిన చూపుల్లో

3

కలల్ని నిద్రపోనివ్వని కళ్ళల్లో నీడల్ని నెమరేసే నీళ్ళల్లో

4

ఎటు నించి ఎప్పుడొస్తావో కానీ,

నువ్వొచ్చేటప్పుడు

చింతాకంత నిశ్శబ్దం
ఎంతో కొంత మౌనం!
Category: 7 comments

7 comments:

VASUDEV said...

ఎప్పటిలా మీ ముద్ర ఉంది దీనిపై అయితే రెండవది చాలా సార్లు చదివించింది. అదొక్కటే ఖండిక ఎలా అయిందో అప్పుడు కానీ అర్ధం కాలేదు...ఇంకా పూళా ఒంటిపై ఊరేగుతున్న శబ్దాలన్నీ పరిమళంగా మార్మోగుతున్నయ్..హ్యాట్సాఫ్ ఎగైన్.

ఆ.సౌమ్య said...

నాకు ఇది బాగా నచ్చిందండీ...చాలా లోతు ఉంది.

Rohith said...

Yenta chuuda galigithe antha kanabade lanti kavita. Yenta tavvuta, Yenni saarlu chadivithe...anta arthamayye lanti kavita.

thanQ very much sir :)

Kottapali said...

లోతు సంగతేమోగానీ చాలా నిశ్శబ్దం ఉంది :)

కెక్యూబ్ వర్మ said...

మౌనం...

R said...

baavunnadanDi. niSSabdaM kanuchoopu mEralO kanabaDutOMdi.

pash said...

afsar bhai namasthe
musthafa maranam naku arthmai babaalni chavagottaru? baabaala unikini narmagarbhamgaa budida kudaa migalakundaa chesaaru. anthenaa? meeru chusina gadilo chivariki anthaa suunyame kadaa? ayinaa marosaari chadavaallendi!

Web Statistics