ఇది రెండు పుష్కరాల కిందట బెజవాడ బందరు రోడ్డు మీద కారా మాస్టారూ...నేనూ!వొక సాయంకాలపు సుదీర్ఘ నడక తరవాత మా దండమూడి సీతారాం కెమెరా కంట్లో పడ్డాం.
బెజవాడలో వున్న రోజుల్లో కూడా కాళీపట్నం రామారావు మాస్టారితో నేను కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన్ని మొదటి సారి ఖమ్మంలో నేను ఇంటర్ సెలవుల్లో కలిశాను. అప్పుడే ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా కథ అచ్చయ్యి వుండడం వల్ల ఆయన్ని కలవడానికి పాస్ పోర్టు దొరికినట్టయింది. "రా. నీ గురించి పురాణం గారు చెప్పారు," అన్నారాయన నన్ను కబుర్లకి పిలుస్తూ.
ఆ తరవాత బెజవాడలో కాళీపట్నం గారిని తుమ్మల వేణుగోపాల రావు గారింట్లోనూ, పురాణం గారింట్లోనూ అనేక పర్యాయాలు కలిశాను, కానీ - ఆయనతో సుదీర్ఘ సంభాషణకి వేదిక అయ్యింది బెజవాడ బందరు రోడ్డు. "ఆంధ్రజ్యోతి" కార్యాలయం నించి బయటికి నడిచి, మేమిద్దరం బందరు రోడ్డుని ఈ చివర నించి ఆ చివర దాకా మా కాళ్లతో కొలిచినట్టే తిరిగాం. అప్పుడు కథారచన గురించీ, తన పరిచయాల గురించీ, తెలుగు కథలకి సంబంధించి తనకి వున్న ప్రణాళికల గురించి మాస్టారు చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అవి అప్పటికి నాకు కొంత స్పూర్తినిచ్చాయి కానీ, ఆ తరవాత నేను అనుకోకుండా కవిత్వంలోకి దారి తప్పడం వల్ల అవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి!
5 comments:
హెయ్ అఫ్సర్ ఫోటో చాలా బాగుంది. అనుకోకుండా ఎదురైందీవేళ నీ బ్లాగు. లేకుంటే మిస్సయి ఉండేవాడిని.
ఎన్ సైక్లోపీడియా ఆఫ్ సౌత్ ఇండియన్ ఫోక్ లోర్ తెలుగులో విడుదల అయింది. ప్రస్తుతం దీన్ని ఇంగ్లీషులోనికి మార్చి ఎడిట్ చేసే పనిని చేస్తున్నాను.
ఇటీవల నీ కవితలు ఏమైనా ఉంటే ఇందులో పెట్టు అచ్చయినవి నాకు పంపు. ఈ మధ్య సూర్యలో వరుసలో సాహిత్య వ్యాసాలు రాస్తున్నాను. స్కైబాబా కథలపైన పెద్ద వ్యాసం రాసాను. ఇంకా అది రావలసి ఉంది. బందరు రోడ్డు కబుర్లు ఇలాంటి పెన్ లు అంటే పర్సనల్ ఎక్పీరియన్స్ నేరేటివ్స్ జానపద శాస్త్రం పరిభాషలో తర్వాతి కాలపు సాహిత్య చరిత్ర రచనకు బాగా ఉపకరిస్తాయి. రాస్తూ ఉండు.
ఉంటా. మిత్రుడు సుబ్బాచారి పులికొండ
అఫ్సర్ గారూ బావుంది...ఫొటో, మీ కబుర్లు కూడా!
ఇది చదివాకే నాకనిపిస్తున్నాది మీరో కథ రాస్తే చదవాలని. ఇంతమంది సాహిత్యవేత్తలతో పరిచయం ఉంది. వారి ప్రభావమూ మీ పై ఉంటుంది. మీరు కథ రాస్తే ఎలా రాస్తారో, ఏ పంధాలో ఉంటుందో, ఎలాంటి ఆలోచనలను చర్చిస్తారో తెలుసుకోవాలని ఉంది. ఆ ఆశలు ఫలిస్తాయంటారా?
mee parichayala gurinchi chadavatam naa lanti vaalaku oka anubhavam ga migilipotundi sir.
ThanQ sir
అఫ్సర్ గారూ, బావున్నాయి మీ జ్ఞాపకాలు కారా మాస్టారితో.
మీరు...కధ...సౌమ్య కోరికే నాది కూడా.
@సుబ్బాచారి: షుక్రియా, షుక్రియా! ఇటీవలి నా కవితలు ఈ బ్లాగులోనే వున్నాయి. సమయం వున్నప్పుడు చూడు. పెన్ గురించి నీవన్నది నిజం!
@సౌమ్య: నేను మొదట్లో రాసింది కథలే;కవిత్వం కాదు. కానీ, కవిత్వం నాలోని ఆ కథకుడిని నిలువునా దహించివేసింది. అయినా, ప్రయత్నించాలి, ఆ కథకుడిని బయటికి తీసుకు రావడానికి. ఆ తరవాత "ఎందుకు అడిగానురా, బాబూ..." అని మీరే నెత్తి కొట్టుకుంటారేమో?!
@రోహిత్: శేషేంద్ర శర్మ గారితో పరిచయం గురించి కూడా త్వరలో రాస్తా.
@పద్మవల్లి: జ్ఞాపకాలు వాస్తవం, కథ కల్పన! కల్పనకీ నాకూ కాస్త చుక్కెదురు!నా లోపలి ఆ కథ కోసం నేనూ వెతుక్కుంటున్నా. ధన్యవాదాలు పద్మవల్లి గారూ!
Post a Comment