"ఇది చదివాకే నాకనిపిస్తున్నాది మీరో కథ రాస్తే చదవాలని. ఇంతమంది సాహిత్యవేత్తలతో పరిచయం ఉంది. వారి ప్రభావమూ మీ పై ఉంటుంది. మీరు కథ రాస్తే ఎలా రాస్తారో, ఏ పంధాలో ఉంటుందో, ఎలాంటి ఆలోచనలను చర్చిస్తారో తెలుసుకోవాలని ఉంది. ఆ ఆశలు ఫలిస్తాయంటారా?"
రెండు మూడు వారాల కిందట ఆలమూరు సౌమ్య రాసిన వ్యాఖ్య అది.
సౌమ్యకి దివ్య దృష్టి వుందని నాకు అనుమానం.
అంతకు ముందు వారమే నేనొక కథ రాసి, ఆంధ్రజ్యోతికి పంపాను. ఆ విషయాన్ని క్రాంతదర్శి అయిన సౌమ్య ముందే పసిగట్టేసిందా?ఏమో?! ఇదిగో మొత్తానికి ఆ కథ "ముస్తఫా మరణం" ఇక్కడ...
కథ రాయడంలో కవిత్వానికి మించిన ఆనందం ఏదో వుంది! ఈ కథ చదివితే మీకూ అట్లా అనిపిస్తుందా? అనిపించినా అనిపించకపోయినా మీరేమనుకున్నారో తప్పక రాయండి.
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2012/01/29/index.shtml
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
13 comments:
ముస్తాఫ కథ లింక్ ఇక్కడ:
http://andhrajyothyweekly.com/index.asp?page=Page23
కొంతమందికి పై లంకె తెరుచుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఈ లంకె ని ప్రయత్నించగలరు:
http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2012/jan/29/story&more=2012/jan/29/sundaymain
లేదు ఈ లంకె:
http://goo.gl/s80Sb
కథ అద్భుతంగా ఉంది. కానీ ఆ చీకటి గదిలో ఏం ఉందో తెలుసుకోగోరే నా బోటివాళ్ళకు నిరుత్సాహాన్ని మిగిల్చారు. ఇది అన్యాయం :)
కధ చదివాను. చాల ఆసక్తి అనిపించింది కథనం. ఏమి చెబుతారా అనే వుత్కంటతో చదివాను. కథ పూర్తయ్యేసరికి గదిగురించి ఏమైనా చెప్పారా లేదా అనే సందేహం కలిగింది. మళ్ళీ చదవాలేమో!!
మంచి వాక్యాలు చదివాను అనే అనుభాతి మాత్రం కనురెప్పల్నుంచి ఆలోచనలకు అంటుకున్నాయి అని చెప్పడం అతిశయోక్తి కాదేమో!!
అభినందనలు
@అనిల్: మీ ప్రయత్నాలకి థాంక్స్. నేను కూడా మీ లింక్ లొంచే కథ చదువుకున్నాను.
@జాన్: షుక్రియా. మంచి వాక్యాలు కొన్ని మిగిలితే ఈ రోజుకి అదే చాలు కదా!
సర్ "ముస్తఫా మరణం"మీరు సరళంగా రాసిన కవిత్వం .కానీ ,యెంత సరళమని అనుకుందామన్నా ముగింపు కవి అఫ్సర్ మార్కు ముగింపే .
కథ చాలా బాగుంది.చిక్కగానూ,చిరకాలం మిగిలిపోయే జ్ఞాపకంగానూ వుంది.
ఇంకోటి ఏమిటంటే మీ కథ ఈ ఆదివారాన్ని ఆలోచనాభారితం చేసింది...కృతజ్ఞతలు అందుకని.
@సామాన్య: మొత్తానికి మీ కితాబు సంపాదించేసాన్! అప్పటికీ ఈ కథలో కవిత్వం పాలు కొంచెం పలచన చేశాను, నీళ్ళు కలపడం ఇంకా సరిగ్గా రాలేదు! ఇంకా నేర్చుకోవాలి. మీ 'రంగవల్లి" సభా విశేషాలు ఎక్కడయినా రాయండి.
హహ అయితే నాకు దివ్య దృష్టి ఉందంటారు!
అమ్మో దివ్య దృష్టి, అతీత శక్తి అని గట్టిగా అంటే మునీర్ చిరాకుపడతాడేమో! :)
ఏది ఏమయితేనేం నా ఆశ ఇంత తొందరగా ఫలిస్తుందనుకోలేదు...చాలా ఆనందంగా ఉంది.
కథ చాలా బావుంది అఫ్సర్ గారూ...మీ కవిత కన్నా నచ్చింది, నిజంగా! కవితలు, కథలు పోల్చి చెప్పేటంత విజ్ఞానం నాకు లేదుగానీ నా కారణాలు: నాకు కవితలు వెంటనే అర్థం కావు...కొంచం శ్రమపడతాను.
కథ చదవగానే అర్థమవుతుంది..భావాన్ని సులువుగా గ్రహిస్తాను. అందుకే ఇది నచ్చింది.
నేను ముస్లిం నేపధ్యంలో చదివిన కథలు చాలా తక్కువ...కొత్తగా బావుంది.
చాలా తీవ్రమైన విషయాన్ని...ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని జాఢ్యాలలో ఒకదాన్ని ఎంతో సున్నితంగా చెప్పారు. మనసుని కదిలించడానికి కథనకుతూహలమే అక్కర్లేదు, ఇలాంటి మృదువైన అల్లిక చాలు అనిపించింది మీ కథ చదివాక.
మీరు ఎక్కువగా కథలు రాయాలి ఇకపై.
@సౌమ్య: మీ మాటలకు సంతోషమేసింది. ముగామ్బే ఖుష్ హొ గయా! ఇంతకు ముందు మీకు చెప్పలేదు గాని, నేను మొదట రాసింది కథలే. ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి కథల పోటీల్లో వరసగా రెండు బహుమతులు గెల్చుకున్నాక, నండూరి కబురు చేయించి, ఆంధ్రజ్యోతిలో తీసుకున్నారు 1980ల లో! ఆ తరవాత కవిత్వంలోకి ప్రవేశించడం అనుకోని మార్పు. అయితే, కథలోకి మళ్ళీ రాలేకపోయాను, ఆనక కవిగానే ఎక్కువగా గుర్తింపు రావడం వల్ల. సరే, ఈ కథా పునరాగమనం మీద నాకేమీ పెద్ద ఆశల్లేవ్! కథ రాయడానికి కావల్సిన నిలకడ ఇప్పుడు లేదు. మరో కథ మరో అయిదేళ్ళ తరవాత ఇదే మీటర్ల మీద కలవచ్చు! లేదూ, అయిదు నెలల్లోనే మరో కథ పుట్టవచ్చు. చెప్పలేను. "మీరేలా రాస్తారు ఇన్ని?" అంటే రావిశాస్త్రి గారు అన్నారోకసారి " నేనేదయినా రాశానా? అవే నన్ను రాస్తాయి!"- బెజవాడ మోడర్న్ కేఫ్ మేడ మీద మూడు బీర్ల తరవాత!
హహహ రవిశాస్త్రి గారు మూడు బీర్ల తరువాత కూడా అంత steady గా క్షుణ్ణంగా, స్పష్టంగా చెప్పారంటే..పర్లేదు! :)
హ్మ్ అయితే మీ మరో కథ కోసం ఎదురు చూపులు తప్పవంటారు...అంతేనా?
ఓ కథా...మా అఫ్సర్ గారిని మరోసారి రాయవే...ఆయన నిన్ను రాయరట...నువ్వే మరి రాయాలి/రాయించాలి...భారమంతా నీపైనే! :)
మీ పాత కథలు చదివే అవకాశం ఏమైనా ఉందా?
సౌమ్యగారూ! అఫ్సర్ గారి గోరీమా కథను కథాజగత్‌లో చదవవచ్చు.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/gorima---aphsar
చదివాను గోరీమా!
ముందుగా ఈ కథ గురించి చెప్పినందుకు మురళీమోహన్ గారికి ధన్యవాదములు!
అఫ్సర్ గారూ మీ రెండు కథల్లో నాకు కనిపించిన రెండు సారూప్యాలు.
ఒకటి గోరీమా - ఈ పేరుతోనో, ఈమె లాంటి వ్యక్తిత్వం ఉన్న వారితోనో మీ జ్ఞపకాలు పెనవేసుకుపోయున్నాయని అర్థమవుతోంది. :)
రెండు: మీరు చెప్పాలనుకునే అంశం ఒకటుంటుంది. దాని గురించి ఉత్కంఠ కలిగిస్తారు కథ మొదట్లోనో. గుప్పెట మూసి ఉంచుతారు. ఆ గుప్పెట్లో కచ్చితంగా ఏదో ఉందని, చివరికి మీరది విప్పి చూపిస్తారని పాఠకుడికి నమ్మకం కలిగిస్తారు. కథలో ఏ సన్నివేశం దగ్గరా కూడా పాఠకుడి దృష్టి ఆ గుప్పెట నుండి సడలనివ్వరు. చివరికి మీకు గుప్పిట విప్పేస్తారు. కానీ పాఠకుడికి మాత్రం అసలక్కడ గుప్పెట లేనే లేదు. మొదటి నుండీ అరచెయ్యి తెరుచుకునే ఉంది అన్న భ్రమని కలిగిస్తారు. గుప్పెట కోసం వెతుకుతూ ఆబ గా అరచేతిని చూసే పాఠకుడికి ఆ అరచేయ్యి ఒక మనిషిదని, అందులో ఎన్నో సంక్షిష్టమైన - ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన రేఖలున్నాయని, దాని కింద బలమైన కణాలు, బలహీనమైన నరాలు ఉన్నాయని, వేడి రక్తం ప్రవహిస్తోందని, చెడు రక్తం ఉండొచ్చనీ వీటన్నిటి మధ్య ఏదో జీవం వెలుగుతోందనీ తెలుస్తుంది. ఆ గ్రహింపు వచ్చేసరికి గుప్పెట, చెయ్యి అన్నీ మరచిపోయి గుండె బరువెక్కుతుంది - కొంత బాధతో, కొంత సంతోషంతో, మరికొంత ఏదో చెప్పలేని భావనతో.
Nenuchadivanu..bhagaUnddhi.Afsarji
Post a Comment