గుడ్డు




స్లావేనియా కవిత్వం ఎలా వుంటుందో అప్పుడప్పుడూ మిత్రులతో సంభాషణల్లో వినడమే తప్ప పెద్దగా చదివే అవకాశమేమీ దొరకలేదు. ఈ మధ్య లైబ్రరీలో కొత్త పుస్తకాల దగ్గిర వెతుక్కుంటూ వుంటే, అనుకోకుండా దొరికాడు ఈ కవి. ఇతని పేరు Ales Steger. అతని కొత్త పుస్తకం The Book of Things. ఈ పుస్తకం తీయగానే మొదటి పుటలలో A word doest not exist for every thing అన్న Slovenian dictionary వాక్యం నన్ను అతని కవిత్వంలోకి లాక్కెళ్లింది. ఈ కవిత్వం ఎంత తేలిక మాటల్లో వుందంటే, చాలా కవితలు నన్ను తీవ్రంగా కుదిపేశాయి గాని, వాటిలో వొకటి రెండు అనువాదం చెయ్యబోతే తేలిక మాటల్ని అనువాదం చెయ్యడం ఎంత కష్టమో మరో సారి అనుభవంలోకి వచ్చింది. నా వీలుని బట్టి ఇతని కవిత్వం అంతా తెలుగు చేయాలన్న దురాశ నాకు వుంది, కానీ, అంత నిరాలంకార, నిరాడంబర సంభాషణకి తెలుగు సేత సాధ్యమా అన్న నిరాశ కూడా వుంది. వున్నంతలో అనువాదానికి లొంగిన మరీ తేలికపాటి కవిత ఇది. ఇక్కడ తేలిక అనేది మాటలకే పరిమితం. భావానికి కాదు!




గుడ్డు

పెనం అంచున నువ్వు దాన్ని చంపినప్పుడు
దాని చావు కన్ను నువ్వు చూసావో లేదో మరి!


ఆ గుడ్డు మరీ చిన్నది, ఈ పొద్దుటి ఆకలి
బాధలో అది వో మూలకి కూడా రాదు.

దాని కన్ను నిన్ను చూస్తూనే వుంటుంది,
నీ లోకంలోకి తేరిపార చూస్తుంది.

నీ లోకపు అంచులేమిటి? వాటి కళ్ళద్దాల కింద ఏ తత్వాలున్నాయా అని-


శూన్యంలో బేఖాతరుగా చుట్టి వచ్చే కాలాన్ని
ఆ కన్ను చూస్తుందా?
దాని కనుపాపలు, చిట్లిన దాని అవయవాలు,
ఆ గందరగోళం, లేదా ఏదో వొక పద్ధతి
అంటూ వుంటే దాన్ని చూస్తుందా?


హ..ఇంత పరగడపున ఇంత చిన్ని కన్ను చుట్టూ
ఇంత పెద్ద ప్రశ్నలా?

నిజంగా నీకు - అవును నీకే -
వీటికేదో వొక సమాధానం కావాలంటావా?

టేబుల్ దగ్గిర కూర్చొని వున్నప్పుడు
కన్నూ కన్నూ కలిసినప్పుడు

నువ్వు దాని కన్నుని ఓ బ్రెడ్డు ముక్కతో కప్పేస్తావ్?! అంతేనా?

*

3 comments:

ఎం. ఎస్. నాయుడు said...

అనువాదం బాగుంది. మంచి కవితని, మంచి కవిని పరిచయం చేయటం ఎంత కష్టమో, అనువాదమూ అంతే. నెట్లో వెతికితే, ఒక కవిత దొరికింది, ఇతనివి అన్నీ చేస్తే, చేయాలని కోరుకుంటూ.

Doormat

Who are you, where do you come from, with whom do you walk to visit?
In her eyes your time is running in place.

That is why she forgives footsteps gone astray.
Forgives the lame, the rash, the drunk.

He who crosses over her cheek is not a trespasser.
She wipes your feet in her hair.

Wipes your name in hers. Until it is untranslatable.
She is not here to disclose directions. She is not there to reveal the way.

She accepts you as part of the scenery from which you come.
As part of the scenery into which you disappear.

Her hair sometimes wakes you with a tickle.
Then pure dirt flakes from words.

A voice clears its throat from traveling silently.
But she overtakes him: Enter in peace. Enter in peace.

She loves the invisible passages between questions.
What hurts, falls through her. The answer is always love.

— Aleš Šteger, translated from the Slovenian by Brian Henry

SCULPTING THOUGHTS said...

Ipudi varaku meeru post chesina translations lo Aleš Šteger naaku chaala nachadu.

Thanx a million for letting me know about all those poets sir.

కెక్యూబ్ వర్మ said...

మీరన్నట్టు తేలిక పదం పదాలకే కానీ వాటి వెనక దాగిన భావానిది కాదని కవిత చదివాక అర్థమైంది సార్.. అంత తేలికగా మింగుడుపడ లేదు గుడ్డు...

మంచి కవిని, కవిత్వాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు...

Web Statistics