
నువ్వెటూ రావు
సాయంత్రపు చెట్ల మీద
చల్లటి గాలి ఆకుపచ్చన
తపస్సులోంచి తల ఎత్తిన మునిలాంటి
గడ్డి పూల పక్క
కాలి కింద తడి వెచ్చన
నాలుగడుగుల తరవాత
వంద అడుగుల నిశ్శబ్దం ఎంత అందమో!
ఆ తరవాత
దారి ఎటో నడిపిస్తుంది.
నువ్వెటూ రాని
సాయంకాలం
చీకట్లోకి.
లోపలి కొన్ని దారుల్లోకి -
7 comments:
బాగుంది సార్..
చాలా అందంగా ఉంది అఫ్సర్ గారు!
హ్మ్ బాధగా, బరువుగా ఉంది!
కవిత చాలా బాగుంది.
...యాకూబ్
మిత్రులందరికీ:
ధన్యవాదాలు
చాలా బాగుందండీ!
naalugadugula tharvatha nissabdam entha andamo......fantabulous shayarjee....lots of love...j
Post a Comment