వొక
పది సార్లు
ఈ తలుపు దగ్గిర నిలబడి కూర్చొని
తూలిపోయి రాలిపోయి తూట్లుపడి, మాటలు పడి
వొకట్రెండు
సార్లు తలుపు తెరిచినట్టు కల కని
కళ్ళు నులుముకొని పెట్టిలో లేని వుత్తరాన్ని
వెతుక్కున్నట్టు కలని వొళ్ళంతా గాలించి గాలినై నీలి నీలి పొరల మీద
ఏదో వొక చప్పుడునయి -
అయినా, అది పద్యం కాలేదు!
2
ఆడుకునీ, పాడుకునీ, మాట్లాడుకునీ,
తాగీ తినీ కాట్లాడుకుని
ఇల్లు చేరీ చేరుకోకుండా వుండీ,
సంచారి రాత్రి భాష ఇంకా రాత్రికే తెలీదు
చీకటిని ఏ చేతులు చుట్టేస్తున్నాయో
ఏ చేతుల్ని చీకటీ వెలుగు రెండు పక్కలా లాక్కుని పోతున్నాయో
అయినా, అది వొక దిక్కు కాలేదు.
3
వర్ణ మాల మాదిగ డప్పు మీద వేళ్ల వెక్కిళ్లు
సాయిబు మాసిన టోపీ కింద నెత్తుటి చెమ్మ
ఆమె నుదుట లంగరేసిన సూర్యుడు
అయినా, అది వొక తూర్పు కాలేదు.
4
తెరిచిన తలుపులన్నీ ఇనప కౌగిళ్ళతో మూత పడ్డాయి గా!
తీయండి రా
ఇంకొన్ని తలుపులు!
దబదబా బాదుకుంటూ వెళ్ళిపోయారు కదా అంతా!
వేళ్ళకి కాసింత ధ్యానం
లోపల ముఖానికి కాసింత చల్ల గాలి
వూపిరికీ వూపిరికీ నడుమ కాసింత జాగా
5
తలుపు దగ్గిర ఎవర్రా ఆ కాపలా?!
వాడికి వో చావు పెట్టె నా కానుక.
(
నాయుడికీ, కోడూరికీ ఇంకా కొత్త తలుపులు తెరుస్తున్న వాళ్ళకి)
6 comments:
అద్భుతంగా వుంది సార్...గుండె తలుపులను తెరిచారు ప్రతీ పాదంతో....
అఫ్సర్ గారికి...
ఇది ఆనందమో...లేక మరేదో తెలియని వొక ఉద్విగ్న స్థితి.......మీరు చూపించిన ఈ ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు...మనసులో పదిలంగా దాచుకుంటాను....కాని కాలం ఏదయినా నాలోని కవిని దగ్ధం చేసే విద్రోహానికి పాల్పడితే మననం చేసుకుకుంటాను...
kasintha kadu chala ekkuva kadilinchindi afsar saab....its not the subject but your technique and style of the poem is splendid....it goes well in english ....love j
good poem..including last comment,.
Excellent..SweetsmileAfsarji. .Abinandhanallu
నీటి రంగు చేపల్లా కవ్వించే కవిత్వం మీది అఫ్సర్ గారూ
అర్థమయ్యీ కాకుండా వెంటాడుతుంది.వెదుక్కొ
మ్మంటుంది .కొన్ని నేపథ్యాల కొరత నాకుండటం లోపం కూడా.అభినందన
Post a Comment