"ఊరి చివర" మీద "పుస్తకం"లో వచ్చిన వ్యాఖ్యల్లో తిరునగరి సత్యనారాయణ గారు ఒక వ్యాఖ్య రాశారు, దాన్ని "పుస్తకం" వారు కొంత భాగం వేశారు, తిరిగి తెల్లారే దాన్ని తొలగించారు.
ఈ వ్యాఖ్యని మొదట "పుస్తకం"వారు ఎందుకు అచ్చేశారో, తరవాత ఎందుకు తొలగించారో, ఈ మధ్యలో ఏ డ్రామా జరిగిందో తెలీదు. వారే పెట్టుకున్న నియమం ప్రకారం అసభ్యతా, వ్యక్తిగత దూషణలు వున్న వ్యాఖ్యలని తొలగించే/ప్రచురించ నిరాకరించే అధికారం వారికి వున్నది. అలాగే, మంచి సాహిత్యాన్ని, మంచి చర్చా ప్రమాణాలను ప్రేమించేవారు కూడా దాన్ని హర్షిస్తారు. కానీ, తిరునగరి రాసిన ఈ వ్యాఖ్యలో ఎక్కడా అసభ్యత లేదని, వ్యక్తిగత దూషణ లేదని వొక్క సారి చదివితే మీకే అర్ధమవుతుంది. అలాంటప్పుడు ఈ వ్యాఖ్యని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వ్యాఖ్య చదివాక ఎవరికయినా వెంటనే వచ్చే సందేహం ఇది.
నిజానిజాలు గ్రహించగల పాఠకుల కోసం తిరునగరి గారు నాకు మెయిల్ లో పంపించిన ఈ వ్యాఖ్యని ఇక్కడ తిరిగి అందిస్తున్నాను. “పుస్తకం” వాళ్ళు తొలగించిన ఈ వ్యాఖ్యని మీరూ చదవండి..ఆలోచించండి...అభిప్రాయాలను పంచుకునే మీ స్వేచ్చని అక్షరాలా స్పష్టంగా ప్రకటించండి.
ఇది తిరునగరి వ్యాఖ్య.
అఫ్సర్ ‘ఊరి చివర’ మీద భూషణ్ సమీక్ష, దాని మీద చర్చ చూసాక నాకో అనుమానం కలిగింది. (క్షమించండి ఇక్కడ ఇద్దరినీ ఏకవచనం తోనే సంభోదిస్తున్నా – పవన్ లాగా నచ్చినందుకు భూషణ్ గారని. నచ్చనందుకు అఫ్సర్ అనీ అనకుండా). ఇంతకీ మనం అఫ్సర్ కవిత్వం మీద సాహిత్య విమర్శ చేస్తున్నామా లేక మన అభిప్రాయాలు చెప్తున్నామా? అభిప్రాయాలైతే అవి పూర్తిగా వ్యక్తిగతమైనవి. అయితే మన అభిప్రాయాలు మన వ్యక్తిగతమని గ్రహించి, అటువంటి అభిప్రాయాలే ఇతరులకూ ఉండవచ్చని గౌరవించి, నా అభిప్రాయమే గొప్పది – నీ అభిప్రాయం హీనమైనది అని తిట్టిపోయకుండా ఉంటే, కొంతలో కొంత, కొన్ని అభిప్రాయాలకు విలువ ఉండేది. అంతే గాని నాకు నచ్చనందుకు ఇదంతా కంగాళి అని హుళక్కి అని, సున్నా అని, నానాటికి తీసికట్టు నాగంభొట్లు అనీ నిర్ధారింపు వ్యాఖ్యలు చేసి పారేస్తే అది, సాహిత్య విమర్శ పక్కన పెట్టండి – సరైన అభిప్రాయం కూడా కాదు. అట్లాంటి వ్యాఖ్యలు మన అసహనాన్ని, అహంకారాన్ని, అన్నీ నాకే తెలుసు అనుకునే దురుసు తలబిరుసు తనాన్ని, కోపాన్ని, బహుశా కించిత్తు చేతకాని తనాన్ని, ఉడుకుమోత్తనాన్ని ఇంకా చెప్పాలంటే సవాలక్ష అప్రజాస్వామిక ధోరణులని బయట పెడతాయి.
దురదృష్టవశాత్తు ఇక్కద ఒక్క చోటే కాదు ఇంకా అనేక చోట్ల (బహుశా తాను సాహిత్య కవిత్వ విమర్శ పేరుతో రాస్తున్న అభిప్రాయాలన్నింటిలోనూ) భూషణ్ ఇదే ధోరణి ప్రదర్శించాడు. దీని వల్ల ఒక వేళ భూషణ్ చెప్పే వాటిల్లో ఏమైనా విలువైన అంశాలున్నా వాటిని స్వీకరించేందుకు మనసొప్పదు. కొన్ని రకాల కవిత్వం పట్ల, కవిత్వ ధోరణుల పట్ల, కవుల పట్ల తీవ్రమైన prejudice తో భూషణ్ చేసే వ్యాఖ్యల (అవీ ఆయన నిజాయితీగానే చేసినా) పట్ల గౌరవం కలగదు. వాటినుండి మనం నేర్చుకునేదేమీ లేదు అనేంతగా ఆ prejudice వాటిని కప్పేస్తుంది. అందువల్ల అభిప్రాయాలుగానే వాటికి ఆ గౌరవం దక్కనప్పుడు వాటికి సాహిత్య విమర్శ స్థాయి కలగడం దాదాపు అసాధ్యం. కాబట్టి భూషణ్ తన prejudice ని, తలబిరుసు తనాన్ని, అహంకారాన్ని పక్కన పెట్టి అభిప్రాయాలు చెబితే వాటికి receptiveness పెరుగుతుంది.
ఇకపోతే భూషణ్ రాసేవి అభిప్రాయాలే, సాహిత్య విమర్శ కాదు అని ఎందుకంటున్నానంటే సాహిత్య విమర్శ కు (పాశ్చాత్య, దేశీ సంప్రదాయాల్లో) కొన్ని సూత్రాలున్నాయి, కొన్ని విలువలున్నాయి. కవిత్వాన్ని, సాహిత్యాన్ని సరిగ్గా అంచనా వేయడం కోసం, పాఠకులకు పరిచయం చేయడం కోసం కొన్ని పద్దతులున్నాయి. పద్దతిని బట్టి విమర్శనా సూత్రాలూ ఉంటాయి. అటువంటి విమర్శ వల్ల పాఠకులకు, సాహిత్యకారులకూ, కవులకూ (రచయితలకూ) మొత్తంగా సాహిత్యానికీ మేలు జరుగుతుంది. అటువంటి విమర్శ వల్ల నేర్చుకొనేది ఎంతో ఉంటుంది. భూషణ్ రాసే వాటిల్లో ఇవి దాదాపుగా కనబడవు. తాను కవిత్వాన్ని చదివి ఒక అభిప్రాయం ఏర్పర్చుకుంటాడు. ఇంకా ఆ వొక్క అభిప్రాయాన్నే వివిధ రకాలుగా చెప్పడానికి నానా అవస్థా పడతాడు. ఈ క్రమంలో తిట్లకు లంకించుకుంటాడు. నోరు పారేసుకుంటాడు. దానితో చదివే వాళ్లకు (వాళ్లకు అఫ్సర్ ఎవరో భూషణ్ ఎవరో తెలియకపోతే) ఏమిటే ఇంత తిడుతున్నాడు ఏమిటీ కారణం అని అయోమయానికి గురవుతారు – భూషణ్ అభిప్రాయం పైన కించిత్తు విసుగు తెచ్చుకుంటారు కూడానూ –ఏమిటే ఈయన గోల అని).
ఇంతకీ భూషణ్ పద్దతి గురించి మాట్లాడుకుందాం. భూషణ్ కు చాలా కవితా ధోరణుల పట్ల, కవిత్వాల పట్ల, కవుల పట్ల ఒక రకమైన allergy. కోపం అసహనం. అసలు అట్లాంటిది కవిత్వమే కాదు అని ఆయన అభిప్రాయం. కవిత్వమంటే ఇట్లాగే ఉండాలి అని ఆయన నిక్కచ్చి అభిప్రాయం. దాని నుండి ఆయన బయట పడే ప్రయత్నం సాధారణంగా చెయ్యడు. ఇదంతా ఇంతకీ form గురించే! కవిత్వం లోని వస్తువు దాకా వెళ్ళ్డడం లేదింకా! క్లుప్తత ఉండాలి, అర్థవంతమైన భాష కావాలి, పదాలు పద చిత్రాలు repeat కాకూడదు. ఊహాలో maturity ఉండాలి,. Diction బాగుండాలి. లయ ఉండాలి వగైరా వగైరా ! ఇవన్నీ వైయక్తికాలు – personal అభిరుచులు! ఈ వ్యక్తిగత అభిరుచులు కవిత్వం చదివే వాళ్లకు వేరు వేరు స్థాయిల్లో ఉండవచ్చు. మళ్ళీ ఇక్కడ నీ స్థాయి తక్కువ నా స్థాయి ఎక్కువ అనే వాదన అనవసరం. ఒకరికి సత్యజిత్ రే నచ్చవచ్చు మరొకరికి మృణాళ్ సేన్ నచ్చవచ్చు. మరొకరికి రిత్విక్ ఘాటక్ నచ్చవచ్చు. తప్పేముంది. అభిరుచులు ఆమూర్తమైనవి. అవి ఏర్పడ్డానికి అనేక కారణాలున్నయి.
సమస్యల్లా, వ్యక్తిగత అభిరుచులతో కవిత్వాన్ని అంచనా వేయలేము – వేస్తే అది అభిప్రాయమే అవుతుంది సాహిత్య విమర్శ కాదు. ఈ అభిరుచులనే గీటురాళ్ళుగా పెట్టుకుని ఇట్లా ఉంటేనే కవిత్వం, లేక పోతే కంగాళీ అంటే అది అహంకారమూ, అన్యాయమూ కాదూ? ఇది కనీసం రూపవాద (formalistic) సాహిత్య విమర్శ కూడా కాదే! రూపవాద విమర్శలో విమర్శకులు రూపానికున్న విస్తృతిని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక writing ని సాహిత్యం, కవిత్వం చేసే సాహిత్య (కవిత్వ) పరికరాలని (literary devices) గుర్తిస్తారు. వాటి ఆధారంగా సాహిత్య విమర్శ చేస్తారు. ఆ పరికరం metaphor కావచ్చు, metonymy కావచ్చు, allusion కావచ్చు, conceit కావచ్చు. ‘Direct speech with target’ కావచ్చు, self parody కావచ్చు. పద్యం అవసరమైన చోట పొడుగ్గా ఉండొచ్చు, లయ ఉండొచ్చు ఉండక పోవచ్చు – ఒక theme repeat కావచ్చు – ఒక పదచిత్రం haunt చేయొచ్చు - వగైరా వగైరా చెబుతూ రూపమే ప్రదానంగా తమ విమర్శ కొనసాగిస్తారు. కవిత్వం లో భాషను (poetry is the highest form of language కదా!) భాషను ప్రయోగించిన పద్దతిని, మెళకువలను ఇట్లా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అతీతంగా నిష్పాక్షికంగా విమర్శ చేస్తారు. సాహిత్య పరికరాల ద్వారా సాహిత్యాన్ని అంచనా వేసి విమర్శ చేసి భాష గురించీ, కవిత్వం గురించి విలువైన విషయాలను రూపవాద విమర్శ మనకందించింది. అందుకే తనకు మయకోవ్స్కీ వస్తువు ఇష్టం లేక పోయినా ఆయన కవిత్వం మీద అద్బుతమైన విమర్శ చేస్తాడు రోమన్ యాకబ్సన్ . అయితే రెండు ముఖ్యమైన విషయాలు .
ప్రాథమికంగా విమర్శ చేసేవారికి నిజాయితీ ఉండాలి, రెండు విమర్శ సూత్రాలు, పద్దతులు తెలిసి ఉండాలి. అట్లా కాకుండా ఊరికే కటువైన అభిప్రాయలు, అవీ prejudices తో కూడుకున్న అభిప్రాయాలు మాత్రమే చెబితే వాటి వల్ల అప్రజాస్వామిక ధోరణులు బలపడి, వైమనస్యాలు విద్వేషాలు పెరిగడం తప్ప పెద్ద సాహిత్య ప్రయోజనముండదు.
ఇంతకీ అఫ్సర్ కవిత్వంలో కొన్ని పదాలు పదే పదే వాడాడని, కొన్ని పదచిత్రాలను repeat చేసాడని, లయ లేదని, కవికి Diction లేదని ఇట్లా ఆయన కవిత్వం మీద అభిప్రాయాలు చెప్పే ముందు వాటికి ప్రామాణిక సూత్రాలేవయినా ఉన్నయా? ఎంత మంది కవులు (మనం గొప్ప కవులు అనిపించుకున్న వారు) ఈ పని చేయలేదు. కవికి ఒక theme ఉండదా? అట్లా ఉండడం తప్పా? ఉదాహరణకు మొత్తం ఇస్మాయిల్ కవిత్వం లోనో లేక అజంతా కవిత్వం లోనో లేక తిలక్ కవిత్వం లోనో ఎన్నో పదాలు, పద చిత్రాలు, ఊహలు repeat కాకుండా ఉన్నయా? ఇస్మాయిల్ కు చెట్టు కవి అని, అజంతా కు స్వప్న కవి అని పేరొచ్చినంత మాత్రాన వారు గొప్ప కవులు కాకుండా పొయ్యారా? కాబట్టి కేవలం పదాల, పద చిత్రాల repetition (అదీ సందర్భాన్ని వదిలేసి – out of context) అభాండం వేసి ఒక కవిని తీసిపారెయ్యడం కనీస సాహిత్య విమర్శ మూలసూత్రాలు తెలిసిన ఎవ్వరి కైనా సమంజసం కాదు.
ఇంతకీ అఫ్సర్ తన ఊరి చివర లో ఏమి చెప్తున్నాడు? ఆయన వస్తువేమిటి, ఆయన ఏ పరాయీకరణ (alienation) గురించి మాట్లాడుతున్నాడు? ఏ nostalgia గురించి రాస్తున్నాడు? తాను పుట్టిన గడ్డకు వేల మైళ్ళ దూరంలో ఉంటూ ఏది పలవరిస్తున్నాడు? ఆయన కవితా వస్తువులేవి? ఆయన తాత్విక దృక్పథమేమిటి? ఏ కళ్ళతో తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నాడు, తనలోపలి ఊరునూ ఊరి చివరనూ పాడుతున్నాడు? ఆయన వేదనంతా ఏమిటి? ఇవేవీ పట్టవా ఆయన కవిత్వాన్ని సమీక్ష చేసేవాళ్ళకు? ఇదంతా వదిలేసి, కొన్ని prejudiced అభిప్రాయాలతో కొన్ని అర్థరహిత అసంపూర్ణ నియమాలతో అఫ్సర్ ది అసలు కవిత్వమే కాదని కొట్టి పారెయ్యడం ఏ మాత్రం సమంజసం? ఏ మాత్రం ప్రజాస్వామికం? అఫ్సర్ కవిత్వం మీద విమర్శ (పోనీ అభిప్రాయమైనా సరే) అఫ్సర్ పట్ల అభిమానమో, దురభిమానమో, ద్వేషమో కొలమానంగా చేసే పని కాదు కదా? నిష్పాక్షికంగా ఉండటం ప్రజాస్వామికం కాదా? ఆరోగ్యకరం కాదా? అసలు అఫ్సర్ కవిత్వాన్ని అంచనా వేయడానికి అఫ్సర్ తాత్విక దృక్పథాన్ని, ఆయన వస్తువునూ పూర్తిగా ఎందుకు విస్మరించినట్టో? కేవలం రూపం మీద ఆధారపడి చేసే సాహిత్య విమర్శకు కూదా కాలం చెల్లిపోయిందే ? (అట్లా అని భూషణ్ చేసింది రూపవాద విమర్శ కూడా కాదు). ముందే ఏర్పర్చుకున్న కరడు కట్టిన అభిప్రాయాలతో, కించిత్తు అహంకారంతో, కించిత్తు చీత్కారంతో భూషణ్ చేసిన వ్యాఖ్యలు సాహిత్య అభిప్రాయాలుగా కూడా నిలవడం లేదు అని వేరే చెప్పాలా!
-తిరునగరి సత్యనారాయణ
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
27 comments:
ఆ పుస్తకం సైట్లోని సమీక్ష వేపకాయ ఐతే ఈ అభిప్రాయం గుమ్మడికాయంత. వెఱ్ఱి ఏ రూపంలోనైనా ఒకటే అని నిబద్ధతతో చక్కగా నిరూపించారు.
ఎన్నో నెలల తర్వాత నా మానాన నేను ప్రశాంతంగా ఉంటే, అలా ఉన్నవాడికి లంకెలిచ్చి, రెచ్చగొట్టి అనవసరంగా అటువైపు అనగా ఆ పుస్తకం వైపు అడుగులేయించిందే కాక ఈ వేపకాయలతో మంగళహారతులిచ్చి సువాసినీ, పనిలోపనిగా గుమ్మడికాయల వాయనాలిచ్చి ఆ తర్వాత కసితీరా దిగదుడిచారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నదా? గుండెల మీద బరువు దిగిందా? వేపకాయలతో మంగళహారతులు ఇవ్వటమేమిటి మహప్రభో? అదే మరి!
అక్కడ ఆయన అభిప్రాయం అప్రజాస్వామ్యికం. ఖచ్చితమే. ఒప్పుకున్నాం. ఆ అభిప్రాయం మీద ఇక్కడ ఈయన అభిప్రాయం రాక్షసం. ఇదీ ఖచ్చితమే. కప్పుకున్నాం. ఈ ఇద్దరి అభిప్రాయాల మీద నా అభిప్రాయం ఆ దేవదత్తం. పూరించాం.
రోకలి తలకు చుట్టేవాడు ఎవరన్నా ఉన్నారేమో వెతకాలి ఇహ.
ఆ పుస్తకం వాళ్లు "ఈమాట"లా ఏకకొట్టుడు "మామాట"లు విను అన్న జంఝాటంలో పడిపోయి "శ్రేయోభిలాషుల" మాటలు నెత్తికెక్కించుకోని, ముద్రించినవి ముద్రారాక్షసాలనుకోని తీసిపారేసారు. బానే ఉన్నది. వాళ్ల సైటు, వాళ్ళిష్టం. అలా పీకెయ్యటం వ్యక్తీకరణ హక్కులు హననం చెయ్యటమే అని ఎవరన్నా గంగిరెద్దుల్ని తోలుకొస్తే అది వారిష్టం...ఇది మీ బ్లాగు మీ ఇష్టం. మరి ఇది నా కామెంటు కాబట్టి నా ఇష్టం. ఇది పీకటమో, ఉంచటమో "ఆయన" ఇష్టం. ఈ నా అభిప్రాయం మీద కుళ్లు కుమ్మరించటం ఈ పోష్టు చదివిన వారిష్టం. అందరికీ ఇష్టాలే ఉన్నప్పుడు కోరి కష్టాలు నెత్తికెక్కించుకోటం ఎందుకు అన్నది శేషప్రశ్నే అని ఎవరన్నా అంటే అది వారిష్టం. :) :)
ఇలా తెత్తెన్నా మెమ్మెమ్మేలను వదిలేసి ప్రశాంత చిత్తంతో వస్తా మళ్లీ! అందాక శలవు.....ఈలోపల ఆయుధాలు జమ్మిచెట్ల మీదనుంచి తెచ్చుకోండి....వాటి సంగతేమిటో కూడా తేలుస్తా! ఈ నా అభిప్రాయం కూడా "నిలవడం లేదు అని వేరే చెప్పాలా!" అని ఆ చివర్లో వక్కాణించినట్టు వక్కాణిస్తే నా నొక్కులు నేను నొక్కుతా! అదీ సంగతి....
పుస్తకం లో కూడా బోల్డు రాజకీయాలున్నాయి! అందుకేనేమో తన్ హాయీ మీద బ్లాగర్ భాను రాసిన వ్యాసాన్ని ప్రచురించి , వెంటనే తొలగించారు. ప్రచురిస్తున్న సంగతీ, తొలగిస్తున్న సంగతీ కనీసం సీరియల్ రచయిత్రికి తెలుసో తెలిపారో లేదో మరి! వాళ్లకెప్పుడూ మెచ్చుకోలు సమీక్షలే కావాలి. విమర్శ జోలికెళితే వచ్చే కామెంట్లను తట్టుకునే దమ్ము లేదు. ఇంతకు ముందు కూడా ఇది రుజువైంది. అందుకే సమీక్ష అనకౌండా పరిచయాలు,అనుభవాలు, దృక్కోణాలు అంటూ వాళ్ల వ్యాసాలకు బహు నామాలు ఆపాదించారు. దేన్ని ఏమనాలో క్లారిటీ లేక!
@మాగంటి:
పుస్తకం చదవడం మానేసి నాకు కూడా చాలా కాలం అయ్యింది. అనవసరంగా ఈ బ్లాగులో చర్చ వల్ల అటు వెళ్లాల్సి వచ్చింది. అయ్యో! చివరికి పుస్తకంలో రాసే వాళ్ళు ఇద్దరే మిగిలారా?! ఆ ఇద్దరూ తెగ ఎగబడి రాసుకుంటున్నారు..ఇంకెవరూ వాల్లవి వెయ్యరు కాబోలు! చూస్తూ చూస్తూండగానే పుస్తకం గ్రాఫు ఒక మంచి పుస్తకం స్థాయి నుంచి ధామాల్ అని కింద పడిపోయింది. ఇది ఇప్పుడు ఆ ఇద్దరి వేదిక..కాకపోతే అసలిద్దరిని కలుపుకొని...నలుగురి వేదిక! అఫ్సర్ గారూ, ఊరి చివరకి మళ్ళీ వస్తా..క్షమించండి.
ఒక బడుగోయ్
okkasari okari kavithvam chadivetappudaina raasina vari patla kavithvam patla gouravamtho chadivi sagaurvanga vimarsinchalema nirmamangaa andukenemo telugu saahithyamlo vimarsa anedi ledu. idi 3 dasabdaluga naalo vaedhinche prasna avedana. kaala mana paristhithulu vyakthigatha bhavavesalu dushana bhushana tiraskaralu manam evarni chesthunnamo enthavaraku samanjasamo aalochincha leka povadam man telugu vari duradrushtam...
ఊరి చివర మీద వ్యాఖ్యా పరంపరలో భాగంగా నేను రాసిన ఈ వ్యాఖ్యను మీ దృష్టికి కూడ తెస్తున్నాను.
పుస్తకం.నెట్ మిత్రులకు,
ఈ వ్యాఖ్య ఇలా రాయవలసి వస్తున్నందుకు క్షమించాలి. నిజానికి ఇది ఊరి చివర మీద సాగుతున్న వ్యాఖ్యాపరంపరలో భాగం. కాని మీరు అర్ధాంతరంగా ఆ పరంపరను ఆపివేయడం మాత్రమే కాక, ఇంతకు ముందు నేను చదివిన (చాల బాగుందని అనుకున్న) ఒక వ్యాఖ్యను తీసేశారు. ఆ వ్యాఖ్య — తిరునగరి అని ఇంటిపేరు గుర్తుంది, పేరు గుర్తు లేదు — వ్యక్తిగత దూషణలు గాని, అనవసర విషయాలు గాని లేనిదనే నేననుకున్నాను. భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. “నువు చెప్పే అభిప్రాయంతో నాకు ఏకీభావం లేకపోవచ్చు. కాని నీకు ఆ అభిప్రాయం చెప్పే హక్కు ఉన్నదని కాపాడడానికి నా ప్రాణమైనా ఇస్తాను” అని ఫ్రెంచి తత్వవేత్త వోల్టేర్ అన్నమాట మనం పాటించవలసిన ఆదర్శమని ఒక బుద్ధిజీవిగా, పాత్రికేయుడిగా నేను నమ్ముతాను.
వివాదాలు లేకుండా నడుస్తున్న అతి కొద్ది సైట్లలో పుస్తకం ఒకటండీ. కావాలంటే చెప్పండి, ఈ చర్చ మా ప్రమాదవనం లో లేవదీస్తాం. అందరం కొట్టేసుకుందాం :))
కవులనీ, విమర్శకులనీ కెలికి చాలాకాలమయింది అసలే - ఎప్పుడో తెలుగుపీపుల్ డాట్ కాం రోజుల్లో.
@మలక్: అయ్యా, అందులో సరుకుంటే వివాదం వుంటది. ఈ వూరి చివర లాంటిదో దొరికితే తప్ప దానికి హిట్లు రావడం లేదు కదయ్యా! లబ్ద్ధప్రతిష్టులు ఎందరో రాసిన పుస్తకం చివరకి కొన్ని అనాథప్రెతాలకు మాత్రమే నిలయమయ్యింది. ఎక్కడా అచ్చుకి నోచుకోని కీర్తికాముకుల ఆశ్రయం. హతవిధీ!
గోల్కొండ అబ్బులు
http://malakpetrowdy.blogspot.com/2011/01/net.html
చిత్తవృత్తి సహజగుణం సంతోషమే కానీ స్వీయ సంతోషం కోసం ఇతరులని దుఃఖానికి గురిచెయ్యడం ఎంతవరకు సబబు అన్నది ముందు మనకు మనం వేసుకోవలసిన ప్రశ్న. కవిమిత్రులనే మాట ఉన్నది కానీ కవిశత్రువులనే మాట నాకు తెలిసినంతలో లేదు. ఆడది ఆడదానికి శత్రువు. మరి కవులు "గాజులధారణ" వారైపోతున్నారా? ఏమో కాలమూ, బ్లాగులూ, బ్లాగరులూ, రచయితలూ, "పుస్తకము"లు చెప్పాలె. వేదాంతమా? లేదు దుఃఖభారం తగ్గించటానికీ, భాష్పాలు బయల్పడటానికి వేయబోతున్న "మిరియాల కాటిక"
దుఃఖం భాష్పాలతో అంతమైతే వివాదం తిట్లతో అంతమవుతుందిట. ఏడుపురాని దుఃఖం చాలా దుర్భరమని పెద్దల మాట. మరి ఎవరు దుఃఖాన్ని భాష్పాలు "కారకుండా" ఆపుకుంటున్నారో చదువరులకు, పాఠకులకు, కామెంటరులకు, చివరకు మెంటలురకు కూడా అరటిపండు వలిచినా అర్థమవుతూనే అర్థం కానట్టు ఉన్నది. ఇలా కొనసాగితే సారస్వతానికి జరిగే మేలు సున్నకు సున్న. హళ్లికి హళ్లి. నా భాషలో కళ్లెకు కళ్లె.
కళ్లె అనగా కఫ సంబంధం. ఎలాగూ కళ్లె ప్రస్తావన వచ్చింది కాబట్టి - ఇక్కడ జరుగుతున్నది, నా కళ్ల బడ్డది ఇదీ - దగ్గటం, తనివితీరా దగ్గటం, కళ్లె నోట్లోకు రావటం, గండూషణం చెయ్యటం, చివరాఖరిగా ఎదుటివారికి, సమకాలీనులకు లాలాజలంతో కలిపి బహూకరించటం. మరి బహుమతి పుచ్చుకున్నవారు కూడా ఋణం ఉంచుకోకూడదుగా. వీరూ అదే బహుమతికి మరింత హంగులద్ది పెద్ద మేళతాళాలతో, అంగరక్షకులతో, పటాలంతో పట్టపుటేనుగు మీదెక్కి ఇచ్చినవారికి తిరిగి బహూకరించటం. ఒకడంగీకరించినా అంగీకరించకపోయినా నాకు కలిగే నష్టమూ లేదు.
ఇలాటివి జరుగుతూ ఉంటే కలిగే నష్టం సారస్వతానికీ, సాహిత్యానికీ, కవిత్వానికీ తప్ప. ఐతే విమర్శించబడ్డవారు కూడా, అది అభిప్రాయ రూపంలో కానివ్వండి, నిజమైన విమర్శా రూపంలో కానివ్వండి - ఆ విమర్శకు తగ్గ సమాధానమిచ్చో, ఆ విమర్శ మీదో, అభిప్రాయం మీదో తన అభిప్రాయం చెప్పో వాద - ప్రతివాదాలు చేసుకోవాలి. లేకుంటే ఆ ఇద్దరిలో ఎవరు శ్రీనాథుడో, ఢక్క పగలకొట్టించుకోబడ్డ పండితుడో మాబోటి రసజ్ఞులకు, చరిత్రకు తెలిసేదెట్లా?
అలా "ప్రూవ్" చేసే పని పుస్తకం వాళ్లు మొదలుపెట్టి పస లేక, తట్టుకోలేక, పాగాలూ, పరికిణీలు వదిలేసి, శ్రేయోభిలాషులకు దాసోహమంటూ వాదప్రతివాదాలకు వెన్నుపోటు పొడిచినందుకు తీర్పు స్థలం ఇక్కడకు మార్చబడ్డది అని అంటే సంతోషమే. మీ వంతు బాధ్యతగా ప్రతివాదికి కూడా ఆహ్వానం పంపించండి. సభకు రానివ్వండి. రాచమర్యాద చెయ్యండి. మీ ఇద్దరే వాద - ప్రతివాదాలు ప్రారంభించండి....మధ్యలో గొట్టాలను, తాఖీదులను, భజనపరులను వదిలేసి....అందరమూ సంతోషిస్తాం.
భూషణ్ గారు, అఫ్సర్ గారు నాకు ఈమధ్యే పరిచయం. తిరునగరి వారి చాంతాడంత అభిప్రాయంలో భూషణ్ గారి మీద ఆరోపణలు చేసినట్టు అనిపించింది. తిట్లు లంకించుకుంటారనీ, ఉత్త అభిప్రాయాలేననీ, అహంకారమనీ - అలా అలా అలా....నాకున్న ఈ స్వల్ప పరిచయంలో భూషణ్ గారు అలా అనిపించలేదు.
అలాగే భూషణ్ గారి ఆ 'పుస్తకం" సమీక్షలో / అభిప్రాయంలో అఫ్సర్ గారి మీద, వారి కవిత్వం మీద ఆరోపణలున్నాయి. అఫ్సర్ గారి కవితల్లో నాకు కొన్ని అర్థం కాలేదన్న మాట నిజమే కానీ, వారి కవితల మీద భూషణ్ గారికున్న అభిప్రాయం నాకు లేదు. కాబట్టి చెల్లుకు చెల్లు.
అభిప్రాయాలతో, భేదాలతో బుర్రలో జ్ఞానం పెంచుకోవాలి. విమర్శతో రచనకు పదును పెట్టుకోవాలి. అదీ లెక్క. అది తెలుసుకోకపోతే చరిత్ర మనలను గుర్తుపెట్టుకోదు.
సమయాభావం వల్ల ఇహ స్వస్తి....
భవదీయుడు
వంశీ
అయ్యా నెల్లుట్ల గారూ,
పుస్తకం వారికి ఈ వ్యాఖ్య అసభ్యంగా ఉందని తెలియజేసింది నేనే, అంతకు ముందు వడ్రంగి పిట్ట వ్యాఖ్యకు మల్లే.
ఇంకా మీకు ఆ తింగరి పేరు గుర్తు రావాలంటే అఫ్సర్ గారి బ్లాగు, మలక్ పేట రౌడీ గారి బ్లాగు లు విచ్చలవిడిగా మైదానాన్నిచాయి, ఇకనైనా పుస్తకం వారి మీద వత్తిడి దేనికి. స్వాగతం…
అఫ్సర్ గారి బ్లాగు:
http://afsartelugu.blogspot.com/2011/01/blog-post_05.html
మలక్ పేట రౌడీ గారి బ్లాగు
http://malakpetrowdy.blogspot.com/2011/01/net.html
అనురాగ్ శర్మ
This post is not accepted by pustakam.net so using this siste.
అయ్యా అనురాగ్ శర్మగారు - ఒకరికి అసభ్యం, ఇంకొకరికి సభ్యం, ఒకరికి మోదం, ఇంకొకరికి వినోదం. మైదానాలకు లెక్కెమీ డొక్కేమీ? ఒకప్పుడేం ఖర్మ - ఇప్పుడు కూడా అక్కడక్కడా అవి "బహిర్భూములే". వాడుకునేవాడిని బట్టి విలువ మారుతుంది. ఒకడికి చెంబులతో "అవసరానికి" పనికొస్తే, ఇంకొకరికి ఆటలు ఆడుకోటాని పనికొస్తుంది. ఇంకొకరికి.....:)
ఏ ఉపయోగార్థమైనా మీకూ ఉపయోగపడిందిగా - ఆ మైదానం మూయగానే ఈ మైదానంలోకొచ్చారు.......:) అదీ లెక్క....
ఆయన తింగరైతే, మీరు బొంగరి....అక్కడ తిప్పితే ఇక్కడ దాకా తిరుక్కుంటూ వచ్చారని అనుకుంటున్నారట.. వత్తిళ్లు ఉన్నవే అధిగమించటానికి. దాసోహనికి కాదు....కాబట్టి ఆ వైపుగా సాగిన మీ చింతను చింతచెట్టెక్కించండి....సావాసానికి బేతాళుణ్ణి నేను పంపిస్తా...
మీ పేరు చూసి బాగుందే అనుకున్నా....పేరులో ఉన్నంత అనురాగం లేదనీ, సన్నాయి నొక్కుళ్ల రాగాలేననీ తెలిసింది...సంతోషం...
భవదీయుడు
వంశీ
వంశీ గారూ,
ఇక్కడ మీరేదొ నోరు పారేసుకున్నారని మీ మీద నా గౌరవం తగ్గదు లెండీ, మీ సైటు ని Regular గా ఉపయోగించేవాడిగా మీ భావాలు అర్థం చెసుకోగలను. ఈ సాహిత్య రాజకీయాలలో, సాహిత్య మత రాజకీయాలలో, సాహిత్య మత ప్రాంతీయ రాజకీయాలలో, సాహిత్య మత ప్రాంతీయ సానుభూతి రాజకీయాలలో ఇంకా ఇంకా ఎన్నో రాజకీయాలలో ఏదో కొద్ది మందే సాహిత్యం గురించి మట్లాడుతున్న తరుణంలో పెద్ద పెద్ద వాళ్ళే Balance out అవుతున్నరు. అర్థం చెసుకోగలను.
ప్రణామాలతో,
అనురాగ్ శర్మ
సాహిత్యం గురించే బాధ పడాలి అని లేశమాత్రంగానైనా గుర్తించినందుకు, అడుగు కలిపినందుకు అమితమైన సంతోషం. సైటుతో ముడిపెట్టకండి. నా సైటు మీకో, ఇంకొకరికో ఉపయోగపడితే అమితానందం. దాని సంగతి వేరే. స్వంత అభిప్రాయాల సంగతి వేరే. వాటి మీద విరుచుకుపడ్డా సంతోషమే. అభిప్రాయాల మీద అభిప్రాయాలు చెప్పుకోవాలి. తిట్టుకోకూడదు. నోరు పారేసుకున్నానని మీరెలా అన్నారో వారిని అగౌరవంగా తింగరి అని మీరు నోరుపారేసుకున్నారని నేనంటా. ఏదైనా సారస్వతంలో ఉన్నప్పుడు దానికి చేయాల్సిన మేలు గురించి ఆలోచించక ఇలా కొట్టుకుని సాధించేదేమిటన్న ప్రశ్న నాదన్న సంగతి గుర్తెరిగితే అందరికీ మంచిది..... "ప్రశ్న" - వ్యక్తీకరించే విధానంలో ఆయా టపాలను బట్టి, సందర్భాన్ని బట్టి తరంగాల రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది, కాబట్టి ఆ తరంగ దైర్ఘ్యం అర్థం చేసుకోవాలి.....కారణభూతులైనప్పుడు పక్కకు తప్పుకోకూడదు...అదే పని పుస్తకం వాళ్లు చేసారు...అనుభవశూన్యత అనుభవయోగానికి మొదటి మెట్టు....కాబట్టి వారినీ అనటానికి లేదు....అదీ సంగతి....ఇంతటితో స్వస్తి...
ఇక్కడ కొంత మంది చాలా డిటెక్షన్ చేసి, పుస్తకం.నెట్ గురించి చాలా పెద్ద డిస్కవరీలు చేసేసారే. రెండేళ్ళుగా పుస్తకంలోనే ఉంటూ, నాక్కూడా తెలీలేదు సుమీ - మాకు హిట్లు లేవనీ, మా సైట్లో ఇద్దరే రాస్తున్నారనీ!
భానుకిరణ్ తన్‌హాయి గురించి వ్యాసం కథ - అంత డిటెక్షన్ చేసిన వారు ఆ వ్యాసం తొలగించిన కారణం వ్యాసకర్తకీ, తన్‌హాయి రాసిన రచయిత్రికీ కూడా తెలుసు అన్న విషయం ఎందుకు డిటెక్షన్ చేయలేకపోయారో! పాపం!
అలాగే, 'ఊరిచివర' పుస్తకం మార్కెట్లోకి వచ్చే ముందే దాని ముందుమాట పుస్తకం.నెట్ లోనే వచ్చిందనీ, ఆ తరువాత ఆ పుస్తకాన్ని పొగుడుతూ కూడా వ్యాసాలు, వ్యాఖ్యలూ వచ్చాయనీ - ఈ డిటెక్టివ్ లకు ఎందుకు తెలీలేదో.
అన్నట్లు, ఏదో, సరదాకి, ఇలా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వాదోపవాదాలు చేస్తూ పోతూ ఉంటే ఎలా ఉంటుందో చూద్దామని కామెంటా తప్పితే, ఇప్పుడు మళ్ళీ నా మీద ఎగిరే వ్యాఖ్యలకి జవాబులిచ్చే తీరికా, ఓపికా లేవు. అంతగా వ్యక్తిగతంగా నన్ను తిట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం కానీ... నేనే జవాబులివ్వనేమో.
అసలుకే - 'ఇద్దరం తప్ప ఎవరూ రాయకుండానే' దాదాపు ఆరొందల వ్యాసాలు పుట్టాయంటే నాకెంత పనుంటుందో...నేనెన్ని మారుపేర్ల గురించి ఆలోచించి సృష్టించాలో ఊహించుకొండి.. ఎల్లొస్తా బాబయ్యలూ..అవతల పేర్లు సృష్టించుకోవాలి.
-Sowmya.
@ మలక్
"వివాదాలు లేకుండా నడుస్తున్న అతి కొద్ది సైట్లలో పుస్తకం ఒకటండీ."
అప్పట్లో వ్యాఖ్యాతల IP అడ్రసులు ఇతరులకు అమ్ముకుంటున్నారనే వివాదం వచ్చింది. మీకు గుర్తుకు లేదా :))
I do remember it and I would rather have Bhaskar talking about it :)
As of your question - that issue is more than a year old and I havent come across any serious issues before or after that - so I considered it an exception.
Since we are talking about IP Addresses sharing, I still remember while I have asked their policy in sharing IP Addresses of their writers/commenters,
suddenly Marthanda became their spoke person.
It still amuses me, when it comes down to that ONE issue, they have to hide under Praveen's blanket :)
suddenly Marthanda became their spoke person.
_______________________________________________
Oh yeah .. I could recollect it :)))))))))) I dont know whether he is still their spokesperson - I just hope not :P
they have to hide under Praveen's blanket :)
____________________________________________
If only it didnt have enough holes :))
భాస్కర్ .. భాస్కర్ .. ఎక్కడున్నాసరే వెంటనే స్టేజీ మీదకు వచ్చి కెలుకుడు ప్రరంభించాల్సినదిగా కోరుతున్నాం.
Me here bro!
I will jump to the stage in few mins
ఏవిటండీ సంగతీ?
సాహితీ విమర్శ! పుసతకము డాటు నెటుటు!!
ముందు సాహియితి విమరస -
అసలు మీరందరూ ఒక ముఖయ విషయము మరసిపోతన్నరబ్బా.
సిగ్మండ్ ఫ్రూయడ్ థియరీలతో విమర్శ చేయకుండా ఎలా కు/సు విమర్శలు ఇవీ అని సెప్తారూ?
అంతేకాక
ఓ రసయిత ఓ కవితో కాకరకాయో రాసినప్పుడు సూడాల్సింది -
వన్నం తిని రాసినాడా
తింటే తను సంపాదించిందాంతో తిన్నాడా
వరి బువ్వ తిన్నాడా
జొన్న బువ్వ తిన్నాడా
కోడి తిన్నాడా? తింటే అది ఫారం కోడా? నాటూ కోడా?
తిన్నప్పుడు అతని మానసిక స్థితి ఎట్టాంటిది
ఇవి పరిగణాలోకి తీస్కోకుండా ఎట్టా సేస్చారబ్బా ఇమర్శా?
పుస్తకం.నెట్ -
ఓ సైటులో కామెంట్లకు స్థానమ్ ఇవ్వటం ఇవ్వకపోవటం వాఋఇ ఇష్టం. ప్రతీవాడి కామెంటూ ప్రసురించాల్సిన పని ల్యా
ఐపి గోల -
ఆయాల తెర ఎనకమాల ఎవురెవురు ఎట్టాంటి బెదిరింపులకు దిగి ఉండుంటారో ఊహించటం ఓ పెద్ద కట్టమైన ఇషయం ఏంగాదు.
కొందరు చట్ట పరిథిలో న్యాయ పరిథిలో రాస్తూ ప్రవర్తిస్తూ తెరవెనుక చేసే పనులు మనకి పెద్ద తెలియకపోయినా ఊహించవచ్చు.
కాబట్టి ఐపి గోలలో పుస్తకం వారి పాత్ర స్వల్పం అని నా భావన.
ఇక పుస్తకం.నెట్ వారి స్పోక్స్‌పర్సన్! బాబోయ్, వారంటే నాకు బయ్యం. ఉన్నపళాన వారి వెబ్ సైటు స్పీడ్ పెంచేస్తే ఆ స్పీడులో నేను కొట్టకబొయ్యే ప్రమాదం కూడా ఉండి.
సో అదీ అద్దెచ్చా
ఒక ఫండామెంటల్ ప్రశ్న
>>అలాగే, మంచి సాహిత్యాన్ని, మంచి చర్చా ప్రమాణాలను ప్రేమించేవారు కూడా దాన్ని హర్షిస్తారు.
మంచి సాహిత్యం అని ఎవరు సర్టిఫై చేసారూ? ఎలా సేసారూ?
ఎవరు హర్షించారూ?
ఎవరైనా నాకు తెలియజేస్చారా?
తిరునగరి సత్యనారాయణ గారి వ్యాఖ్యలను పుస్తకం.నెట్ లోనే కాదు ఇక్కడా తొలగించారుకదా?
Post a Comment