"ఊరి చివర" గురించి మరో సారి...!

"ఊరి చివర" గురించి వద్దు వద్దు అంటూనే మళ్ళీ మళ్ళీ చర్చలకి ప్రాణం పోస్తున్నారు కవిమిత్రులూ, విమర్శకులూ.
ఇటీవల కొంత కాలంగా ఇతర పనుల వొత్తిడి వల్ల నేను ఈ చర్చల జోలికి వెళ్లలేకపోతున్నాను. పై పైన చూస్తే, వీళ్ళంతా చెప్పిందే మళ్ళీ చేబ్తున్నారనీ, రాసిందే మళ్ళీ రాస్తున్నారనీ, తమని తామే పునరావృతి చేసుకుంటున్నారనీ అనిపిస్తోంది.

అయిననూ... పాఠకుల సౌకర్యార్ధం ఈ లింకులు :

http://kottapali.blogspot.com/2011/01/blog-post_03.html

http://pustakam.net/?p=5861
Category: 6 comments

6 comments:

Anonymous said...

పుస్తకం లింకు ఇచ్చి చాలా మంచిపని చేసారండి అఫ్సర్ గారు. భూషణ్ వ్రాసింది కవిత్వమా అని ఆయన్ని అడిగితే, సమాధానం లేక, నీళ్ళు నములుతూ... అడిగినందుకు మీ దురభిమానిగా ముద్రవేసారు. మరి పవన్ కుమార్లు, బుడుగోయిలు ఎవరి అభిమానులో? అవును మరి, పుస్తకం ఒత్తించి, ముందుమాట రాసి అవార్డులు కూడా చదివిస్తే, అభిమానం కాక ఏముంటుంది? అందుకే పోలో మని పరిగెత్తుకొచ్చి మరీ ఆయన కోసం ఆరాటపడిపోయారు.

పక్కవాళ్ళ కవితల్లో అనేక రకాలుగా దోషాలు ఎత్తి చూపే పండితమ్మన్యులు, తమ కవితలోని విస్తరణ దోషాలకు, నూతనత్వం లేకపోవటానికి సమాధానం ఇవ్వలేక మొహం చాటేసారు మరి! ఇకపైగా, విమర్శకుడు కవి కానవసరం లేదని, కధలు రాయనవసరం లేదని కూడా ప్రకటించారాయన. అవసరంలేదని మరి ఈ విమర్శకులుంగారు ఆగలేదే! అడ్డమైనట్లు గిలికి అది కవిత్వం అని నమ్మబలికారే!

ఆయన వ్యాసం వెనుక కవిత్వం మీద ప్రేమకన్నా, మరేదో అక్కసు ఉన్నట్లు స్పష్టమౌతున్నది.

వెంకటరమణ

మాగంటి వంశీ మోహన్ said...

పుస్తకం వంక చూసి చాలా నెలలవుతోంది.....కొత్తపాళి గారి పోష్టు మీ వల్ల చూసి అక్కడ కామెంటాను , ఇహ ఈ పుస్తకంలో విమర్శ గొడవేమిటో చూడాలి ఇప్పుడు.... ఈ పై అనానిమస్సుగా వెంకటరమణ గారు చేసిన కామెంటు చూస్తే ఆ విమర్శ - దాని మీద కామెంట్లు ఆసక్తికరంగా ఉండేటట్టున్నాయి.... :) ధన్యవాదాలు...

Anonymous said...

అవును. భూషణ్ వ్యాసంలో నాకు తీవ్రమైన ద్వేషం కనిపించింది. సాటి కవి మీద అంత ద్వేషం ఎందుకో అర్ధం కాలేదు. వ్యాసంలో చేసిన వ్యాఖ్యల్లో ఒక్క దానికీ జస్టిఫికేషన్ లేకపోవడం గమనార్హం. సత్తా సత్తా అని మొత్తుకున్న పెద్ద మనిషి, రెండు ప్రశ్నలు అడగ్గానే పత్తా లేకుండా పారిపోయాడు బహుశా అదే అతని సత్తానేమో! పోనీ అన్ని కామెంట్లనీ ఇగ్నోర్ చేసాడా అంటే ముందంతా అడగనివాడిదే పాపం అన్నట్టు సమాధానాలు చెప్పాడు అసభ్యత, వ్యక్తిగత విమర్శ ఉన్న కామెంట్లతో సహా! కాస్త లాజికల్ గా అడిగేసరికి పలాయనం చిత్తగించి అతని అనుచర గణాన్ని వదిలాడు. అతని కవిత్వాన్ని ప్రశ్నిస్తే అఫ్సర్ దురభిమానులని ముద్రొకటి మళ్ళీ.

ఆయన అనుచరగణంలో ఒకరైన గరికపాటి పవన్ కుమార్ గారి కామెంటుకి నేనిచ్చిన సమాధానం పుస్తకం వాళ్ళు ప్రచురించలేదు. మరి అందులో ఏమి అసభ్యత కనిపించిందో వాళ్ళకి . ఆసక్తిగల పాఠకుల కోసం కామెంటు పూర్తి పాఠం కింద ఇస్తున్నాను. కోట్సులో పెట్టినవి గరికపాటివారి లైన్లు.

“పుస్తకం చదవని వారికి విమర్శలోని లోటు పాట్లు ఎలా తెలుస్తాయో నా ఊహకందని విషయం”



భూషణ్ గారు అఫ్సర్ గారి పుస్తకం చదివారు. అతను కవిత్వాన్ని కొలిచే ప్రమాణాలతో బేరీజు వేసి అది అతనికి ఎందుకు నచ్చింది/నచ్చలేదో లేదా సదరు రచన కవిత్వం ఎందుక్కాదో ఇక్కడ నలుగురితోనూ పంచుకున్నారు.
ఆ ప్రమాణాల మీద చర్చించడానికి అఫ్సర్ గారి పుస్తకాన్ని చదవాల్సిన అవసరమేమిటో నా ఊహకందని విషయం.


“దీన్ని బట్టి చూస్తే, భూషణ్ గారన్నట్లు, అఫ్సర్ పట్ల వీరిలో నాకు గుడ్డి అభిమానమే కనిపిస్తుంది కానీ మరొహటి కాదు.ఆ గుడ్డి అభిమానమే వీరిచే పేరడీలు రాయిస్తొందా?”



భూషణ్ గారి మీద గుడ్డి అభిమానమే మీకు ఇస్మాయిల్ అవార్డుని తెప్పించిందనీ, మీ చేత అర్ధం లేని పై కామెంటు రాయించిందనీ , నేనడిగిన మిగతా రెండు ప్రశ్నల్నీ మీచేత కన్వీనియియంట్ గా మర్చిపోయేలా చేసిందనీ
నేనంటే మీరేమంటారు మాష్టారూ?



“సత్తా ఉంటే మీరూ భూషణ్ కవిత్వం మీద గాని, “నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు” మీద కానీ సహేతుక విమర్శ పుస్తకం లోనే చేయవచ్చు”


సత్తా ఉంటే భూషణ్ గారిని తన కవిత మీద, ఈ వ్యాసం మీద నేనడిగిన ప్రశ్నలకి సమాధానమిచ్చి , తన కవితని డిఫెండ్ చేసుకోమనండి. ఎంతసేపూ ఎదురుదాడికి దిగారు, అల్లక్కడ ఈమాటలో ఎవరో ఏదో అన్నారు అని ఇక్కడకొచ్చి మొత్తుకోకుండా, పుస్తకం సంపాదకులకి హితబోధలు చెయ్యకుండా !

-- చంద్ర పావులూరి

వడ్రంగిపిట్ట said...

నేరాసినదాంట్లో అంత అసభ్యత ఏముంది? కొంగుచాటు కవిత్వమే మీకు నచ్చుతుందన్నాను. అది అసభ్యతా. తెల్లవారి లేచింది మొదలు వినబడే సుప్రభాతాలలో లేనిది భూషణ్ రాసిన అక్కసుపూరిత ద్వేషపూరిత విమర్శను ఎదుర్కొనేందుకే ఆయనేమిటో ఆయన్కు గుర్తుచేద్దామని రాసా. ఇంక నా రెండో కామెంటు పూర్తిగా ప్రచురించలేదు. తర్వాత నా మొదటి కామెంటు తొలగించారు కానీ దానిపై ఉమ్మివేయ ప్రయత్నించిన భూషణ్ కామెంటు తీయకపోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించిన నా మెసేజ్ ను కూడా ప్రచురించలేదు.

Anonymous said...

కొద్దో గొప్పో సాహితీ చర్చలకు మరోవేదికలా భావించిన "పుస్తకం" కూడా ఈ ప్రహసనంలో తన గౌరవాన్ని పోగొట్టుకుంది. కొందరి కామెంట్లు వ్యక్తిగతమైనవిగా భావించినా, చర్చకు సంబంధించి కామెంటు పెట్టిన తిరునగరి సత్యనారాయణగారి చివరి కామెంటు ఇప్పుడు తీసేసారు. ఎవరి ప్రోద్బలంతో అది జరిగిందో ఊహించటం కష్టమేమీ కాదు.

తమ తమ వ్యక్తిగత స్పర్ధలతో విచక్షణారహితంగా సమీక్షలు చేసే విమర్శకులు, ఆ స్థాయిలో వారిని విమర్శించే సరికి దొడ్డిదోవలో పనులు చక్కబెట్టుకుంటున్నారు! ఇదా వారి నిబద్ధత? వారి కారుకూతలకు ప్రతిస్పందించేవారిని దురభిమానులుగా ముద్రవేయతం తప్ప, సమాధానం చెప్పే సత్తా లేక చివరికి సంపాదకులను మభ్యపెట్టి తోలుబొమ్మల్లా ఆడించటం విచారకరం.

స్వస్తి.

వెంకటరమణ

Anonymous said...

పుస్తకమ్ బేశికల్ గా ఆడవాళ్ళు నడిపే సైటు. వాళ్ళకు వివాదాలంటే భయం. పస గలిగిన, బహుకోణీయమైన చర్చలకు మీసాలున్న మగసైటు ఏదైనా కావాలి.

Web Statistics