పదేళ్ళ కవిత్వ సంకలనం గురించి....!




పదేళ్ళ కవిత్వం ఒక సంకలనంగా తీసుకురావాలన్న మా సంకల్పం ఇప్పుడిప్పుడే తుది రూపం దిద్దుకుంటోంది. సారంగ బుక్స్ తరఫున అచ్చు కాబోతున్న ఈ సంకలనం ముఖచిత్రం ఈ వారమే ఖాయం అయింది. అంతర్జాతీయ ప్రచురణలకి కవర్ డిజైన్లు రూపొందించే ఒక విశ్వ విఖ్యాత చిత్రకారిణి ఈ పుస్తకానికి కవర్ డిజైన్ చేశారు. తెలుగులోనూ, తరవాత ఇంగ్లీషులోనూ ఉత్తమ సాహిత్యాన్ని అందించే సత్సంకల్పంతో మీ ముందుకు వస్తున్న సారంగ బుక్స్ కి మంచి కలలున్నాయి. వాటిని నిజం చేయ్యగలమన్న ఆశాజీవుల బృందం కూడా వుంది.

పదేళ్ళ కవిత్వం "సారంగ బుక్స్ " తొలి కల...అది పుస్తక రూపంలో సెప్టెంబరు నెలలో మీ ముందు వుంటుంది.


ఈ సంకలనానికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈమెయిల్ చెయ్యవచ్చు. afsartelugu@gmail.com

ఈమెయిల్ ద్వారా కాకుండా సాధారణ పోస్టు ద్వారా అయితే, ఈ దిగువ తెలిపిన వంశీ కృష్ణ చిరునామా కి రాయండి.
Vamseekrishna
c/o lakshmi gadapati printers
mandala office complex
gampalagudem –
krishnajilla
Category: 1 comments

1 comments:

VIEWS n REVIEWS said...

మొక్కజొన్న తోటలో... ముసిరిన చీకట్లలో...సందె కాడ మంచే మీద అన్నట్లు జరిగిన 'కవిత్వ పండగ' , మూడు తరాల కవుల్ని అనుసంధానిస్తూ , రెండు రోజులపాటు జరగడం, జరిపించడం సుపర్బ్!
కవుల మధ్య అంత ఆత్మీయంగా నడిచే సంభాషణలు ఇక్కడ అరుదేమో అనిపించింది.
చదువరిని ఎరీనాకు తీసుకు పోయిన మీకు నా అభినందనలు.


- మాకినీడి సూర్య భాస్కర్

Web Statistics