మరో ఎడోనిస్ కవిత: ఆమె అతను
- ఎవర్నువ్వు?
- ఇల్లూ వాకిలి లేని వో పిచ్చి మార్మికుడిని
ఆకాశం నించి రాలి పడిన రాయిని, దెయ్యం రాయిని.

- ఎవర్నువ్వు?
నువ్వు నా శరీరంలోకి ప్రయాణించావా?
-అనేక సార్లు

- అక్కడ నువ్వేం చూశావ్?
-నా మృత్యువుని.

-అప్పుడు నా ముఖం తొడుక్కున్నావా?
నా సూర్యుడిని నీడగా చూశావా
నా నీడని సూర్యుడిగా చూశావా
నా పక్క కిందకి తొంగి చూసి, నన్ను కనుక్కున్నావా?

- నువ్వు నన్ను కనుక్కున్నావా?

-అవును ఇద్దరం వొకరి కొకళ్లం ప్రతిబించుకున్నామా?
వొక నిశ్చల నిశ్చితాన్ని వెతుక్కునామా?
-లేదు

-నీ గాయాలన్నీ నయం చేశానా, లేదంటే
నువ్వింకా ఆ భయంతోనే వుండిపోయావా?
-లేదు

- పోనీ, నీకు నేను తెలుసా ఇప్పుడు?
-నీకు నేను తెలుసా?
Category: 8 comments

8 comments:

dhaathri said...

an eternal dilemma in life well presented afsar....lots of love j

Rohith said...

కొన్ని సార్లు...ఒక విచిత్రమైన బంధం ఉన్నప్పుడు...translate చెయ్యబడు కవి, చేసే కవి ఒకటిపోయ్యి ఆ కవిత రెండు భాషలలో రాసినప్పటికీ అది చదవుతున్న పాటకునికి ఒకే పడవ లో పోతున్నట్టు ఉంటుంది. అసలు translate చెయ్యటం అంటే కొత్త కవితని సృష్టించటం అంత పని చెయ్యటం.
మీకు అడోనిస్ చాల దెగ్గర సంబంధం ఉన్న కవి లా ఉన్నాడు. మీరు రాసినవి త్రన్స్లతిఒన్ అని గుతిన్చాతానికి కీడ కష్టంగా ఉంది.

ThanQ sir

Bolloju Baba said...

నీకు నేను తెలుసా?
తెలుసు
త్వమేవాహం

Anonymous said...

It would be fare if the english title of the poem is displayed at the beginning or at the end of your translation. if possible mention the anthology name. This would be the real tribute to and introduction of adonis.

Afsar said...

@ధాత్రి: ధన్యవాదాలు, అవును...అది ఎప్పటికీ తరగని కవిత్వ వస్తువు కూడా.

@రోహిత్: అనువాదం గురించి మంచి మాట చెప్పారు. ఎడోనిస్ నాకు చాలా ఇష్టమయిన కవి. ఇష్టంగా చేసినప్పుడు అది సొంతం చేసుకుంటాం కదా!
@బాబాజీ: నిజంగా తెలుసా? ఏమో? మీ నించి "తెలుసు" అన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలియదు అన్నది నా సమాధానం.
@అనానిమస్: మంచి సూచన. వచ్చే పోయెం లో మీరు చెప్పిన పని చేస్తా.

Bolloju Baba said...

afsar guruvu gaariki

my comment is just an extension of your poem sir.

may be i concluded it like that for my self.

with respects

arun said...

wonderful, eda tegani.....
EXPERIENCCCCCCCE de universal

arun said...

wonderful
experience de universal

Web Statistics