1
ఆ ఎప్పుడు ఎప్పటిదో తెలిస్తే ఇంకేం లే?
....లాగే...లాగే.. లాగా అన్నది సరేలే!
2
రోజులు అంకెల మొహాలు వేలాడదీసుకొని
అప్పుడప్పుడూ నిన్నమొన్నటి చొక్కాలా గోడకి
వే
లా
డు
తూ.
3
చెప్పేందుకు కొత్తదేమీ లేదు ఖాయంగా
రొటీన్ కోరుకుతూనే వుంది గాయంగా.
4
వైణికుడు వొకే దుక్ఖంలో దూకి
మరేదో రాగంలో తేలిపోతూ.
ఎప్పటికప్పుడు ఏమీ తెలియకుండానే!
5
అలా వున్నామో ఎప్పటిలాగా
ఎలా వున్నామో అప్పటిలాగా
అలా ఎలా వున్నామో అప్పటి ఎప్పటిలాగా.
6
గది మూల వొదిగిపోయాయి అన్నీ
పుస్తకాలూ సంగీతం పెట్టెలూ ఇష్టాలూ
కాసిని ప్రేమలూ కొన్ని మోహాలూ ఇంకా కొన్ని అహాలూ!
7
ఈ పొద్దయినా
వొక్క
దులుపు దులపరా!
నిడదవోలు మాలతి కి మొల్ల పురస్కార ప్రదానం
-
ఏడు శతాబ్దాల నాటి రచయిత్రి మొల్ల. ఏడు వసంతాల సాహిత్య సౌరభం మాలతి గారు. ఈ
ఇద్దరినీ, మరెందరో సాహిత్య విమర్శకులను, అభిమానులను కలుపుతున్న సాంకేతిక జూమ్
స...
1 year ago
11 comments:
అద్భుతం అఫ్సర్జీ!
"గది మూల వొదిగిపోయాయి అన్నీ
పుస్తకాలూ సంగీతం పెట్టెలూ ఇష్టాలూ
కాసిని ప్రేమలూ కొన్ని మోహాలూ ఇంకా కొన్ని అహాలూ! "
అహం ఒక్కటే అయితే ఎంత బాగుండేదో!
చాలా బావుంది ఆఫ్సర్ గారూ..
@సుబ్రహ్మణ్యం గారూ, ధన్యవాదాలు
@సౌమ్య: అవును, అహం వొక్కటే కాదు కాబట్టే, ఈ కవిత!
@జ్యోతిర్మయి గారు: చాలా థాంక్స్ అండీ.
"రోజులు అంకెల మొహాలు వేలాడదీసుకొని
అప్పుడప్పుడూ నిన్నమొన్నటి చొక్కాలా గోడకి
వే
లా
డు
తూ. "
Cummings telugu lo raaste yela untado alaa undi sir.
Manchi kavita sir. Bahusha first stanza ni inkoncham suluvu gaa rasi undochu anukunta. kaani kavita maatram chaala baagundi :)
చాలా నచ్చింది సార్...హృదయానికి దగ్గరగా...
కవిత కొత్తగ వుంది,బహుస ఇదొక ఎక్ష్పెరిమెంత్ అనిపిస్తొంది,కొంచం గాఢంగాను మరి కొంచం అబ్స్త్రాఖ్ట్ గాను వుంది, ఇట్లాంటి అనుభుతి కవిత్వాన్ని రాయటానికి నీకు స్వాగతం
---- రవిప్రకాష్
looks like a experimental poem
chala deep ganu little abtract ganu vundi
the real beauty of the poem is in its synergy between form and content,
the content says to break monotony , to convey this u chose a new 7 dwipada (i want to name SAPTA DWIPADA ) which is break from monotony but beatiful reminder of native telugu
hats off
-- రవిప్రకాష్
Afsar !Routine korukuthunee vundi gayamga
eppatilaage goppagaa rasaru. dummu dulipesaaru kadaa
thurupu chettu kavi parichyam ivvatam bvundi. athanni addamlo chuparu. kavula painaa intha vivakshanaa? - pash
Post a Comment