నీ పన్నెండో గంట...



నిద్రలో
కల తెగిపోతూ వుండొచ్చు

కలలో
నిద్ర తేలిపోతూ వుండొచ్చు

కలత నిద్ర
అక్కడయినా, ఇక్కడయినా!

అటు నువ్వు చంద్రుణ్ణి కప్పుకుంటావు
ఇటు నేను సూర్యుడి కంటి కింద నలిగిపోతూ వుంటాను

ఎంత కవిత్వమయినా
పగలెప్పుడూ వెన్నెల కాదు,

రాత్రి ఎప్పుడూ సూర్యుడిది కాదు.


కలలు కనే వేళలు మారిపోయాయి మనకి,
అంతే!
Category: 8 comments

8 comments:

Rohith said...

manchi kavitallo oka lakshanam...modati line tho ne manalni nijam nundi tenchestaay. vaati nijam ki teeskeltaay. atuvanti first line meeru raasaru anochu. The first line left me in trans for some time.
manchi kavita sir.

దేశరాజు said...

కవిత బావుంది... సింపుల్ గా, హాయిగా.

కోడూరి విజయకుమార్ said...

'బాగుంది'...ఇంతకన్నా ఏమీ చెప్పలేను

dhaathri said...

afsar mark kavitha saab splendid...love j

Afsar said...

రోహిత్, చాలా మంచి మాట చెప్పారు. అవును, కవిత్వంలోని నిజంలోకి పాఠకుడిని ఎలా తీసుకువెళ్లాలన్నదే అసలు తపన అంతా..మొదటి లైన్ బాగా వేస్తే, రైలు సాఫీగా సాగిపోతుంది.

రాజా, ధాత్రి: ధన్యవాదాలు.

తెలుగు పాటలు said...

కవిత చాలా బాగుంది.. ఒకటి చెప్పగలను చదువుకొనే రోజుల్లో రాత్రి 9 అయితే నిదురవచ్చేది కానీ ఇంటర్ నెట్ యుగం లో 9కె నిదురపోవటం మరచిపోయాను

kavi yakoob said...

మంచి కవిత.కవిత్వాన్ని ఇలా నిత్యనూతనంగా నిర్మించే అఫ్సర్ కి శుభాకాంక్చలు.

Afsar said...

@తెలుగు పాటలు: ధన్యవాదాలండీ
@యాకూబ్: నీకు నచ్చడం సంతోషం.

Web Statistics