నేనొక అద్దానయ్యాను
అన్నీ నాలో ప్రతిబింబిస్తున్నాయి
నీ జ్వాలలో నేను
ఆ నీటినీ, ఆ మొక్కనే మార్చేశాను.
శబ్దం రూపునీ
పిలుపునీ మార్చేశాను
నిన్ను రెండు గా చూడడం మొదలెట్టా
నిన్ను నిన్నుగా
నా ఈ కంటిలో ఈదుతున్న ముత్యంగా
ఆ నీరూ నేనూ ప్రేమలో పడ్డాం
అటు తరవాత
నీరు నా లోపలి నించే పుట్టింది.
ఎంచక్కా మేం కవలలమయ్యాం
మూలం: ఎడోనిస్ (ఆరబిక్ కవి)
ఇప్పుడు ఎనిమిది పదుల వయసు దాటిన ఎడోనిస్ మొన్న నోబెల్ సాహిత్య ప్రైజ్ కి చివరి దాకా వచ్చాడు; అది కొద్దిలో తప్పిపోయింది. అప్పుడు చాలా మంది కవిత్వాభిమానులు నోబెల్ వొక మంచి గౌరవాన్ని కోల్పోయిందని అన్నారు. ఎడోనిస్ అసలు పేరు అలీ అహ్మద్ సయ్యద్ అస్బర్. ఆ పేరుతో కవిత్వం పంపితే అన్ని పత్రికలూ తిప్పికొట్టడంతో అతను ఎడోనిస్ అనే కలం పేరుతో రాయడం మొదలెట్టాడు. ఆధునిక అరబిక్ కవిత్వంలో వొక నవీన సూఫీ యుగానికి నాంది పలికిన వాడు ఎడోనిస్.
4 comments:
అఫ్సరుగారూ,
మీ శీర్షికే చాలా బాగుంది. ఆ కోణం లోంచి చూస్తే ఈ కవితలో కొన్ని కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి. ప్రేమాస్పదమైన వస్తువులోంచి జడపదార్థములో కూడ ఎలా ప్రేమపుట్టుకొస్తుందో చెప్పినట్టనిపిస్తోంది నాకు. తూరుపుకీ, చెట్టుకీ ఎన్ని Connotations ఉన్నాయో అన్ని రకాల అర్థాలు ధ్వనిస్తోంది ఈ కవిత. అభినందనలు.
సూఫీ కవి గేయంలా హాయిగా వుంది..
@తెలుగు అనువాదాలు: ధన్యవాదాలు. మీ వివరణ బాగుంది.
@విజయ్: అవును, ఎడోనిస్ కవిత్వం చాలా మటుకు అట్లానే అనిపిస్తుంది. అరబిక్ ప్రతీకాత్మకత విశేషంగా కనిపించే కవితలు ఇంకా బాగుంటాయి.
ee madya koncham computer ni takkuva vaadutunnanduko yemo...ee kavita ni munde chadavaleka poyyanu.
Adonis gurinchi meeru naaku cheppina tarvaata...atani kavitvam kosam google lo chaala vetikaanu...kaani naaku chaala takkuva information dorikindi.
ippudu mee kavita...atani py unna naa interest ni double chesindi. Adonis ki sammandinchi links yemyna vunte pampivvandi. thanQ sir
Post a Comment