1
వూరు మసక చీకటిలోకి
సగం కన్ను తెరచి
మూత పెట్టుకుంది ఇంకోసారి.
దూరంగా రైలు కూత
నిశ్శబ్దంలోకి గిరికీలు కొట్టింది.
2
పట్టాల పక్కన వూరు
ఎక్కడయినా ఎప్పుడయినా వొక్కటే.
దాని ప్రతి మాటా
రైలు కూతల్లో వొదిగొదిగి పోతుంది.
3
వూరు వెనక్కో ముందుకో
ముందుకో వెనక్కో
వొక పరుగులాంటి నడకతో-
ఎవరంటారులే , వూరిది నత్త నడక అని!
అది ఎప్పుడూ ఉరుకుల పరుగుల సెలయేరే నాకు.
4
అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు
అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని
రైలు పాడుకుంటూ వెళ్లిపోయింది
కూతవేటు దూరంలో.
10 comments:
"వూరు మసక చీకటిలోకి
సగం కన్ను తెరచి
మూత పెట్టుకుంది ఇంకోసారి"
ide chaala real ga undi.
Simple gaa, baagundi sir.
ThanQ
కొత్తగా భలే బావుంది అఫ్సర్ జీ. ముగింపు అద్భుతం.
అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు
అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని
రైలు పాడుకుంటూ వెళ్లిపోయింది
కూతవేటు దూరంలో.
అఫ్సర్ గారూ.. ఇది కదా కవిత్వం అనిపిస్తుంది నా బోటివాడికి...
@రోహిత్: చాలా థాంక్స్. అవును, అలా తేలికగా రాయడం చాలా కష్టం కూడా!
@మూలా, సంతోషం. ఎలా వున్నారు?
@బీవీవీ, ఇది కూడా కవిత్వమే...
afsar,
poem chaalaa baavundi.
vamseekrishna
నాలుగు భోగీలు దాటుకుని వచ్చేసరికి అప్పటికే అయిపోయిందా అని మళ్ళి వెనక్కి వెళ్ళి ఈ కూతగాడేవరనా చుసి మీ పేరు దగ్గరాగిపోయా...కవిత ఆద్యంతమూ రైలుకూత విన్పిస్తోనె ఉంది...
అఫ్సర్ సాబ్ !
అద్భుతం..SIR ....NUTAKKI RAGHAVENDRA RAO (Kanakaambaram)
చిన్నప్పటి
బొగ్గింజిను రైలు పొగ
సెవెన్ అప్ లు
నైన్ డౌన్ కూతలు
దూరాన్నెక్కడి నుండో
వేదనతో
ఊరందరినీ
రోదనతో
నిద్ర లేపే
జిటి ఎక్ష్ప్రెస్స్
సు దూరంగా
తరలిన రిధమేటిక్
శబ్ద తరంగం
ఎన్ని ఎన్నెన్నని
తెరుచుకున్న జ్ఞాపకాల
పుటలు
అఫ్సర్,
తిలక్ చెప్పిన ట్రాన్స్పరెంట్ చీకటి ఈ కవితలో కనిపిస్తోంది. అభినందనలతో ఎన్.ఎస్. మూర్తి.
ఎన్నో జ్ఞాపకాలు. బాగుందండీ. బొమ్మ నాకు చాలా నచ్చింది
రైలు పాడుకుంటూ వెళ్లిపోయింది
కూతవేటు దూరంలో. మళ్లీ రైలెక్కి ఊరెళ్లినట్లన్పించింది.. అలవోకగా అలా సాగిపోయింది కవిత.. చాలా బాగుంది అఫ్సర్ జీ..
Post a Comment