1
తలుపు తట్టి ఇగో నేనొచ్చేశాన్లే మళ్ళీ
అని గదిలోపల నవ్వుతూ కూర్చుంటుంది మరణం
ఈ పూటకి చావు వాసన లేకుండా దాటేద్దామని అనుకున్నప్పుడు -
2
ముసుగు తన్ని దుప్పటి పై మీదికి కప్పేసి
వొక ప్రశాంతతని కూడా వొంటి మీదికి లాక్కుని
నిద్రలోపలి గుహలోకి పారిపోతూ వుంటాను
చాల్చాల్లే అని విదిలించుకుని కసురుకొని నన్ను నేను,
లేదులేదులేదు
రానే రావద్దే నువ్వు నా లోపలికి అనుకుంటూ పైకే అంటూ
3
రాత్రి బరువు ఎంతో నీకు తెలుసా?
మరీ దాన్ని రెప్పల మీద మోస్తున్నప్పుడు!
4
పగలగొట్టేయ్యాలన్నంత కోపమొచ్చేసే గడియారపు
బుడి బుడి నడక వొంటి మీద మెత్తగా
గీసుకుపోయే కత్తి
5
రాని నిద్దురని దుప్పటిలా
విసుగ్గా అవతలకి విసిరేసి
పుస్తకంలోకో సినిమాలోకో అనిద్రని ఖననం చెయ్యాలని కూర్చున్నాను.
ఊహూ,
ఆ అన్నీ లోకాలూ నన్ను విఫలం చేశాయి.
6
కాళ్ళ కింద నేల జారుతున్న అసహనంతో
గది నిండా తిరుగుతున్నప్పుడు
దూరం నించి మిత్రుడి మరణ వార్త.
7
ఆ తరవాత నేనూ చీకటీ
చీకటీ నేనూ వొకరి ముఖంలోకి
ఇంకొకరు చూస్తూ...
7 comments:
మాటలు రావడం లేదు..అఫ్సర్ గారు!
apt tribute
"వర్ష ధారలు భూమిలో విలీనమైపోయినట్టు, గాలి పిల్లలు దిశల చెరగులలో దాగినట్లు, వెలుగు కత్తులు రోదసి గుండెలో చొచ్చినట్టు, శబ్దరేఖలు గగనవీధిన పరుగిడినట్లు" - అని డాక్టర్ మాదిరాజు రంగారావు గారు ఏదో గేయంలో అన్నట్లు మీ మాటలు అలా మనసు పొరలు దాటిపోయి మర్రిచెట్టు ఊడల్లా దిగిపోయాయి............చాలా రోజుల తర్వాత .....
afsar ..............love u j
afsar ..............love u j
బహుశ పది రోజుల క్రితం నేను మో అంకుల్ తో మాట్లాడను. అతనే నా ఫోన్ నెంబర్ కనుక్కొని, నేను ఆ సమయం లో లేక పోతే నన్ను ఫోన్ చెయ్యమని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ రోజు ఫోన్ లో నేను మాట్లాడిన ఇరవై నిమిషాలు yeప్పటికి మర్చిపోలేను. మో అంకుల్ నేను ఒక గొప్ప కవి అవుతాను అని చెప్పినప్పుడు నేను భూమి మీద నిలబడుకున్నాను అన్న విషయాన్ని మరాచిపోయాను... ఆ రోజు నేను ఆగష్టు నాలుగో తేదిన వస్తానని, తనను కలుస్తానని ఫోన్ లో promise కుడా చేసాను. ఆగష్టు ౩ మో అంకుల్ ఇక లేరు అని నాన్న చెప్పగానే కన్నీరు ఆపుకోలేక పొయ్యాను. అప్పుడు నేను విశాకపట్టణం లో, అడవిలో మెడికల్ క్యాంపు లో ఉంటిని.
ఆయన తో నాకున్న సంబంధం బహుశా ౩౦ నిమిషాల లోపే...
ఆయన మరణానికి ఒక రోజు ముందు నా గురించి మాట్లాడారని తెలుసినాక నాకు మాటలు రాలేదు. సంబంధాలు ఇంతే! జీవితం మరణం ఇంతే! బ్రతుకులు ఇంతే!
కాని మో అంకుల్ లాంటి వారు ఇంకొకరు undaru
ఆయన ఏమీ అనుకున్నారో అది చేసారు.
చలా బావుందండీ..
Post a Comment