కథ చుట్టూ రాజకీయాలు..!

ఈ కరపత్రం హైదారాబాద్ లోని కొంత మంది ద్వారా నా దృష్టికి వచ్చింది. వొకే వొక్క రోజులో నాకు పాతిక మంది ఈ కరపత్రాన్ని నాకు ఈ-లేఖల ద్వారా పంపారు. ఇంత ప్రతిస్పందన ఎందుకు వచ్చిందా అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ, ఇది ఇతర సాహిత్య మిత్రులకి తెలిస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది నా బ్లాగులో పెట్టాను.

సింగిడి రచయితల సంఘం ఇటీవల చాలా ఉత్సాహంగా పనిచేస్తున్న తెలంగాణా రచయితల వేదిక. తెలంగాణాలోని అనేక వర్గాల రచయితలూ, కవులూ, విమర్శకులూ పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఈ సంఘం కింద పనిచేస్తున్నారు. తెలంగాణా రచనల పట్ల కొనసాగుతున్న వివక్షని ఈ సంఘం తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఈ కరపత్రం ఇప్పుడు తెలంగాణాలో విస్తృతంగా ప్రచారంలో వుంది. "అక్షరం"లో ఈ కరపత్రాన్ని ప్రచురించాల్సిందిగా సింగిడి రచయితలు, అనేక మంది తెలంగాణ రచయితలు కోరడం వల్ల దీన్ని నా బ్లాగులో ప్రచురిస్తున్నాను.

ప్రచురించిన వెంటనే ఈ కరపత్రం మీద ఇప్పటికే నాకు ఇరవై వ్యాఖ్యలు అందాయి. అవి ఆ సంపాదకుల మీద మరీ వ్యక్తి గత వ్యాఖ్యలు కావడం వల్ల వాటిని నేను అనుమతించలేకపోయాను. అవి ప్రచురణకి అర్హం కానీ భాషలో వున్నాయి కూడా!

ఈ విషయం మీద చర్చ జరగడం అక్కరలేదని నా వుద్దేశం కాదు, లేదా, భావ ప్రకటనా స్వేచ్చ మీద కత్తెర వెయ్యడం కూడా నా వుద్దేశం కాదు. ఈ కరపత్రంలో చర్చించ దగిన విషయాలు వుంటే అవి మర్యాదకరమయిన భాషలో, సహేతుకమయిన వాదనతో చర్చించమని వినయంగా మనవి.

వ్యాఖ్యలు పంపే ముందు అవి ఏ రకంగా చర్చకి దోహదం చేస్తాయో వొక్క సారి ఆలోచించండి. అలాగే, వ్యాఖ్యలు రాసే వారు ఆ వ్యాఖ్యలకి నా నించి సమాధానాలు దయచేసి ఆశించ వద్దు. వాటికి సమాధానాలు ఇవ్వాల్సిన వ్యక్తిని నేను కాదు, సింగిడి రచయితల సంఘం వారు మాత్రమే!


Category: 18 comments

18 comments:

మాగంటి వంశీ మోహన్ said...

సింగిడి సంఘం వారు సింగినాదం ఊదారే! జీలకఱ్ఱ తీసుకురావటం మిగిలింది ఇహ!

Anonymous said...

adi akshram amdimcimdi. nettineTTukOmDi.

Anonymous said...

దీని శీర్షిక శవం చుట్టూ రాజకీయాలు...అనే మాట గుర్తు చేస్తోందేమో, అధ్యక్షా!

Anonymous said...

ఈ సంకలనం ఒక అమెరికా చౌదరి గారితో ఇద్దరు "ఆంధ్రుల" కమ్మక్కు అట! డబ్బున్న వాళ్ళందరూ ఇక సంపాదకులు కావచ్చహో! తెలుగు కథ అమర్ రహే!

karlapalem Hanumantha Rao said...

ఈ పరిణామం ఎన్నో ఏళ్ళ క్రిందటే వూహించినదే !ఇంకా ఎన్ని బాధాకర దృశ్యాలు చూడాల్సి వస్తుందో ! ఎంత క్షోభ కలిగే వాతలు వినవలసి వస్తుందో !

Afsar said...

ఈ కరపత్రం మరో బ్లాగులో ఇలా...

http://skybaaba.blogspot.com/2010/11/blog-post_19.html

Anonymous said...

ఈ కథా సంకలనానికి సంపాదకత్వం వహించడానికి జంపాల అర్హతల విషయాన్ని కొద్ది సేపు పక్కన పెట్టినా, ఈ కరపత్రంలో పదజాలం చాలా అభ్యంతరకరంగా వుంది. సైలెంట్ కిల్లింగ్ అనే పదం అంత తేలికగా ఎలా వాడారో తెలియదు. "లొల్లి" చెయ్యడం మీద నాకు అభ్యంతరం లేదు. కానీ, ఏ సంగతి మీద లొల్లి చెయ్యాలో తెలియాలి కదా!

oremuna said...

>> తెలంగాణా రచనల పట్ల కొనసాగుతున్న వివక్షని ఈ సంఘం తీవ్రంగా ఎదుర్కొంటున్నది

Could you elaborate more on this? with some examples of this vivaxa.

Anonymous said...

జంపాల అర్హతల విషయం పక్కన పెట్టండన్న రిజర్వేషం ఎందుకు అధ్యక్షా! అది మంచి ప్రశ్న కాదా! ముక్కుసూటిగా..అడగాలంటే...అవును, జంపాల అర్హత ఏమిటి ఎడిటర్ అనిపించుకోడానికి?!

డా. గన్నవరపు నరసింహమూర్తి said...

తెలంగాణా అంశము రాజకీయ పరమైనది. ఆర్ధిక పరమైనది కుడా కావచ్చును. సాహిత్యానికి,కళలకు ప్రాంతీయ తత్వానికి ముడిపెట్టడము ఎంత సమంజసమో తెలియదు.ఒక మంచి కధో,కవితో,పాటో వస్తే ఏ ప్రాంతము నుండి వచ్చిందని రసజ్ఞులైన పాఠకులెవరూ ఆలోచించరు. చదివి,విని,ఆనందిస్తారే గాని. జీవితంలో కష్ట సుఖాలు అందఱికీ ఒక లాగే ఉంటాయి. ఇది అంతర్జాల యుగము. మనకు ప్రచురణ కర్తలు కృతిభర్తలు అక్కఱ లేదు. బ్లాగులలోను,అంతర్జాల పత్రికలలోను ఎవరైనా ప్రచురించుకోవచ్చును. అఫ్సర్ గారూ అసభ్యతను తప్పించి మిగిలిన వ్యాఖ్యలను ప్రచురించండి. కొంచెము వేడి ఉంటే నష్టము ఏముంది ?

తెలుగుయాంకి said...

@నరసింహమూర్తిగారితో నేను కూడా ఏకీభవిస్తాను. ఇది మంచి కథా కాదా అనే ఆలోచిస్తారు నిజమైన పాథకులు. అంతే గాని వారు తెలంగాణవారా, రాయలసీమ వారా అని చూస్తారనుకోను.

శరత్ కాలమ్ said...

ప్చ్!

Anonymous said...

అయ్యా,

సంపాదక మహాశయులలో ఆ ఇద్దరు కూడా డబ్బు పెట్టి ఎడిటర్గిరీ చెలాయించిన వారెనా, ప్రభూ!

తెలుగు సాహిత్యం...ఎంత హాస్యాస్పదం!

Anonymous said...

ఇప్పుడే ఈ కథతో ఒక రోజు నుంచి వచ్చా.
రచయితల కంటే పోలీసులు ఎక్కువ వున్నారు సభలో.
సాహిత్య సభల అధోగతి ఇంకేం చెప్పమంటారు?

Anonymous said...

తెలంగాణకి మద్దతిస్తూ నవీన్ మొదలగు వారు ఒక ప్రకటన చేశారు. అమెరికా చౌదరి గారు కూడా తెలంగాణా దారికొచ్చినట్టేనా?

'ఉయ్యాల' చౌదరి

Anonymous said...

అయ్యా,
మిగిలిన ఇద్దరు ఎడిటర్లు పసి గుడ్డులా?
ఒకరు తెలంగాణ లో పేరు మోసిన సాహిత్య విమర్శకులు. మరొకరు సీరియస్ సాహిత్య సమీక్షలు రాస్తూ, మాండలికం మీద పని చేసిన వారు.
మొదటి ఎడిటర్తో కలిసిన తరవాత, ఇప్పుడు వాళ్ళ ఇజ్జత్ యెమయితదా అని అడుగుతున్నా.
రామ నరసింహ

Anonymous said...

తెలుగులో ఎన్నో సంకలనాలు వచ్చాయి, ఎన్నో చర్చలు జరిగాయి. కానీ, సంపాదకుడి అర్హతల మీద చర్చ జరగడం ఇదే మొదటి సారి. పాపం, ఎడిటర్జీ!

శివశంకర్ రాపోలు

Anonymous said...

అయ్యా!

నవీన్-శివశంకర్ గార్ల కథ సంకలనాలు కమ్మక్కు అన్న మాట ఆంధ్రాలో అందరికీ తెలుసు. కొత్త రాజకీయం ఏమిటంటే, ఇప్పుడు గుడిపాటిని, ప్రభాకర్ గార్లని కలుపుకొంటే ఆ కమ్మక్కు కంపు పోతుందని అగ్రవర్ణ కుట్ర. పేరు కనిపిస్తే చాలు అను ఈ ఇద్దరు తెలంగాణా అమాయక చక్రవర్తులు పొంగిపోయి, ఈ కమ్మక్కు వలలో పడిన్రు. అంతే! సంకలనం సంక ఎక్కించుకున్నట్టే ఎక్కించుకొని కిందకి నూకుతరని గుడిపాటికి, ప్రభాకర్ కి తెలియకపోవడం ఆశ్చర్యం!

కామేశ్వర శర్మ

Web Statistics