- ఒమ్మి రమేష్‌బాబు
~
నాలో ఒక అలజడి మొదలైంది. కొత్త కాంతిపుంజం తలుపు తట్టింది. వింత సందడితో మది నిండిపోయింది. కుండపోత వంటి జలపాతం కింద తడిసిన ఒకానొక ఉద్విగ్న ప్రకంపన కమ్ముకున్నది.
ఇంతటి ఆనందానికి సహేతుకమైన కారణం వుంది.
***
అప్పటివరకూ నిర్లిప్తతలోకి తొణికిన క్షణాలు సెలవు తీసుకున్నాయి. బలమైన విద్యుత్తరంగాలు తాకి స్మృతిపేటిక తెరుచుకుంది. వేళ్ల నుంచి సారమందుకున్న రెమ్మ మొగ్గ తొడిగింది. ఈ సడిలోనే ఒక కవి గొంతుక నాలో నాతో సంభాషణ మొదలుపెట్టింది.
ఆ గొంతు ఎవరిదో నాకు బాగా బాగా బాగా యెరుకే!
***
ఆ ఆనందానికి కారణం "ఇంటి వైపు'' కవిత్వం. ఆ గొంతుక నా ప్రియతమ కవి అఫ్సర్‌ది. మది గదిలో విరిసే భావానికి.. ఒక ఆప్తవచనం జోడింపు.. ఇదే అఫ్సర్ కవిత్వ చిరునామా! నాలుగు పదుల సాహిత్యప్రస్థానంలో తనే కవిత్వంగా మారిపోయిన నేటి తరం కవి అఫ్సర్. తనని అతి సమీపంగా యెరిగిన వారందరికీ ఈ కవిత్వోత్సవం తెలిసిన వైభవమే!

ఎంత తెలిసినా... అఫ్సర్‌ని మళ్లీ మళ్లీ తెలుసుకోవడం, కవిత్వవనంలో తిరిగి తిరిగి తనని కలుసుకోవడం కొత్తగానే అనిపిస్తుంటుంది! ఒక భావాన్ని కవిత్వ నాళికలోకి వేసి బొమ్మ కట్టించడంలో బహు నేర్పరి అఫ్సర్. ఎంత సంక్లిష్టమైన భావాన్నయినా దానిలోని క్లిష్టతని తనే చెరిపేసి తేలికపరుస్తాడు. అందుకే తన ప్రతి కవితా ఒక పటంగా భాసిల్లుతుంది. "ఇంటి వైపు'' సంపుటాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక్కో పుటనీ పలుకరించి, అందున్న కవిత్వ పరీమళాన్ని మనసుకి అద్దుకుంటే అఫ్సర్ కవిత్వానికే ప్రత్యేకమైన ఇలాంటి నిర్మాణ రహస్యాలెన్నో ఒకటొకటిగా అవగతమవుతాయి.
***
అఫ్సర్ రాసిన ఏ కవిత అయినా తీసుకోండి. కొనసాగుతున్న ఒక సుదీర్ఘ సంభాషణలో ఒక అంకం కొత్తగా తెరుచుకున్నట్టుగా మొదలవుతుంది. ఎప్పుడో పరిచయమున్నవారిని మళ్ళీ పలుకరించినంత చనువుతో కవిత గొంతు విప్పుతుంది. చదువరిపైకి తొలుత తేలిక పదాలతో కూడిన ఒక వాక్యాన్ని విసురుతాడు కవి. తదుపరి తనే చేయందించి ఆ భావ ప్రవాహం లోపలికి మెల్లగా నడిపించుకు వెళతాడు. చివరంటా వెళ్లాక కలుగుతుంది అసలు దర్శనం! చిరుచినుకులతో మొదలైన వాన తుపానుగా మారి తీరం దాటడాన్ని కళ్లారా చూసిన అనుభూతికి లోనవుతాం!! "వెళ్లడానికి కాళ్ళకి ఇంకే అడుగూ తోచక/ నా వేపు నడుచుకుంటూ వస్తావ్ నువ్వు''... ఇది ఒక కవితకి తొలి చరణం. ఇలా ప్రారంభించి "స్నేహితుడి దిగులు''ని అలలు అలలుగా వర్ణిస్తూ మన లోపలి గట్టుని తాకుతాడు కవి. "నా దాకా ప్రవహించడానికి/ నువ్వు యెన్ని/ దాటుకుంటూ రావాలి?'' (జ్వరసమయం)- ఇది మరో కవితకి మొదటి వాక్యం. "అప్పుడప్పుడూ నీ వెక్కిళ్ళ చప్పుడు నీకే వినపడనీ..'' (అప్పుడప్పుడూ) ఇది ఇంకో కవితకి ద్వారబంధం. "యెన్నిసార్లయినా అడుగుతూనే వుండాలి కలల్ని, కాసేపు వుండిపొమ్మని-'' ఇలా ప్రారంభమవుతుంది మరో కవిత నడక! కవిత్వ నిర్మాణంలో ఎత్తుగడ అనేది ఎంతో కీలకాంశం. ఏ కవిత అయినా సరే తలుపు తెరిచి అతిథిని సాదరంగా స్వాగతించాలి తనలోకి. అప్పుడే ఆ భావధారలోకి పాఠకుడు సంలీనమవుతాడు. కవికీ పాఠకుడికీ మధ్య వుండాల్సిన ఈ బంధుత్వం ఎంత బలీయంగా వుంటే ఆ కవిత్వం అంతగా సార్థకమవుతుంది. అఫ్సర్ కవిత్వంలో ఈ సుగుణానికి ఏ లోటూ లేదు.
***
ఇంటి వైపు సంపుటిలోని కవిత్వం "రేగిపళ్ల వాసనలోకి'', "దూరాల మాటే కదా'', "యెటో చెదిరిన పడవనై..'' అనే మూడు పాయలుగా ప్రవహించింది. ఏ పాయ అందం ఆ పాయదే. ఏ పాయ లోతు, విస్తృతీ ఆ పాయదే. "మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం/ యీ వొక్క ప్రయాణమే నాదీ నా లోపలికీ అనిపిస్తుంది'' అంటూ ఇంటి వైపు ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు కవి. గంభీరంగా మొదలై కొన్ని అనుభవాల మెట్లపైకి నడిపించి, నిబ్బరమైన నడకతో ముందుకేగి, తరలిపోయిన రుతుగానాల్ని, కొన్ని గాయాలని జ్ఞాపకచిత్రాలుగా చూయిస్తూ, రేపటి కోసం మోగే భేరీ ధ్వనుల్ని మనకీ వినిపింపచేస్తాడు కవి.

అఫ్సర్ మృధువు మనిషి. ఆ స్వభావమే తన కవిత్వానికీ అబ్బింది. అంత మాత్రాన మొహమాటాలూ, భరించటాలు చేస్తాడని కాదు. అలాంటి సందర్భాలే వస్తే- అఫ్సర్ నిప్పుకణికే అవుతాడు. ఈ సంపుటిలో రోహిత్ గురించి రాసిన కవితే ఇందుకు దాఖలా. ఎవరి పైకి గురిపెట్టాడో వారినే చెళ్ళున తాకింది ఆ చర్నకోలా! "నా దేశభక్తిని నువ్వు ద్వేషంతోనే కొలుస్తావ్'' (యింకో ద్వేషభక్తి గీతం) అంటాడు మరోచోట. తను కోరుకుంటున్న ప్రపంచానికీ, జరుగుతున్న కొన్ని సామాజిక దుర్మార్గాలకీ మధ్య కొనసాగుతున్న నిరంతర ఘర్షణే అఫ్సర్ కవిత్వం. ఇదే అతని కవిత్వానికి ముడిసరుకు! "వెనుక నీడలు కూడా ముసుగు వేసుకున్నాయి.. '' (తీరాలూ వాటి గమ్యాలూ..) ఇదీ తన కవిత్వం ద్వారా అఫ్సర్ చేస్తున్న ముందస్తు హెచ్చరిక! "మాటని కాస్త తెరిచి వుంచు'' (నీ లోపలే)- ఇదీ అతని తాత్విక ఉద్బోధ! "బాధని తవ్వి మొలకెత్తే పదం పద్యం/ నొప్పి లేని చోట పైపూత దేనికి?'' (ఎరీనా) అని కవిలోకంపైకీ ఓ ప్రశ్నని సంధించాడు కవి. ఎవరికి వారే చెప్పుకోక తప్పదు బదులు!
***
కవిగా అఫ్సర్ గొంతెత్తిన తొలినాళ్లలో తెలుగు నేలపై పరిస్థితి వేరు. వామపక్ష ఉద్యమ దుందుభి నలుచెరగులా మోగుతుండేది అప్పట్లో. ఎర్రపతాకల మెరుపులు దండుకట్టేవి. వర్గ ప్రధానమైన రాజకీయ చర్చలకే సిద్ధాంతాలు పరిమితమయ్యేవి. అనంతర కాలంలో ప్రవాహం దిశ మార్చుకుంది. ఉద్యమ గళంలో కొత్త నినాదాలు ప్రభవించాయి. దళిత, మైనారిటీ, స్త్రీవాద, ప్రాంతీయ అస్తిత్వ వాదాలతో తెలుగు సాహిత్యం పలు శాఖల తరువుగా పెరిగింది. ఈ క్రమంలో ప్రతి దశ, ప్రతి మలుపు, ప్రతి వెలుగు అఫ్సర్ కవిత్వంలో దర్శనమిస్తాయి. ఎప్పటికప్పుడు తనని తాను అప్‌డేట్ చేసుకోగలిగిన శక్తివంతమైన కవి అఫ్సర్. ఈ కారణంగానే ఈనాటి మేటి కవిత్వానికి తన తాజా సంపుటిలోని ప్రతి కవితా ఒక ప్రమాణంగా భాసిల్లుతోంది.
***
స్వభావసిద్ధంగా అఫ్సర్ మందిమనిషి. మనుషులని అవ్యాజంగా ప్రేమిస్తాడు. తన చుట్టుపట్ల ఉన్నవారితో అంతగానూ ప్రేమించబడతాడు. ఒకసారి పరిచయమైతే తనని మనలో ఓ గుర్తుగా వదిలిపెడతాడు. తనూ అంతే- బృందగానంలా సాగిపోతుంటాడు. ఈ సమష్టీయమైన వ్యక్తిత్వం వల్లే స్వస్థానాన్ని వదిలి దూరదేశానికి వెళ్లినా... తన ప్రతి స్నేహబంధమూ పచ్చపచ్చగానే మిగుల్చుకోగలిగాడు. "జీవితం యెప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు/ కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!'' (కాసింత సంతోషం) అఫ్సర్‌కి. చిరు సంతోషాన్ని కూడా వేడుక చేసుకోగలడు కనుకనే అఫ్సర్ ఇష్టుడైపోతాడు ఇతరులకి.

అఫ్సర్ స్నేహితులంతా సాహిత్య పరివారమే! నాకు తెలిసి.. ఉద్యమసంస్థల్లో రాటుదేలిన నాయకుల మాదిరే తనికీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. దీనికి కారణం తనని తాను ఒక సాహిత్యోద్యమకారుడుగా మలచుకోవడమే! కవిత్వమే అఫ్సర్‌లో వెలిగే ప్రాణదీపం! 1987- 88 మధ్య కాలంలో అఫ్సర్‌తో పరిచయమైన తర్వాత తన పరివారంలోకి మమ్మల్ని చేర్చేసుకున్నాడు. స్నేహానికి మించిన కవిత్వబంధంతో తనకి కట్టేసుకున్నాడు. పెద్దన్న మాదిరి మా గుండెల్లో కొలువుదీరాడు. కంజిర మిత్రులుగా నన్ను, నామాడి శ్రీధర్‌ని, శశిని హత్తుకున్నాడు. హైదరాబాద్‌లోని న్యూఎక్సైజ్ కాలనీలో కొన్నాళ్లు రూమ్మేట్స్‌గా వున్నప్పుడు అనేక రాత్రులను కవిత్వంతో అలంకరించాం. అనేక పగళ్లకి మా భావాలతో రంగులద్దాం. కథలు, కవిత్వం, నాటకాలు, పాటలు, రాతలే మాకు తిండీతిప్పలు. కొన్నాళ్లకి న్యూఎక్సైజ్ కాలనీకి దగ్గరలోనే మరో అద్దెఇంటికి అఫ్సర్ మారాడు. అక్కడున్నప్పుడే అఫ్సర్, శ్రీధర్, ఎమ్మెస్‌నాయుడు, పెద్ది రామారావు, నేను కలిసి "అతడు ఆమె మేము'' అనే దీర్ఘకవిత రాశాం. అచ్చువేశాం. ఆంగ్లంలోకి అనువదితమై ఇండియన్ లిటరేచర్‌లో ఆ కవిత ప్రచురితమైంది. నిజానికి ఈ స్మృతుల చిట్టా నా గుండెలోతుల్లో ఎక్కడో ఏ మూలనో దాగిపోయింది. ఇదిగో ఇప్పుడు అఫ్సర్ కవితా సంపుటి "ఇంటి వైపు''ని స్పర్శించగానే ఆ జ్ఞాపకాలన్నీ వెకువజామున రెక్క విదిల్చి కువకువలాడే పిట్టల గుంపుమల్లే నాలో పండుగ చేస్తున్నాయి. మళ్లీ నన్ను ఆనాటి రోజుల ఆనంద క్షణాల్లోకి నడిపించిన అఫ్సర్‌కి తన కవిత్వం సాక్షిగా రాసుకున్న ప్రేమలేఖ ఇది.
*
0 comments:
Post a Comment