ఊరికే!


ఓ కల నిండా
కలిసి ప్రయాణం

నగరం మురికి కాల్వ
ముక్కు మూసుకుంటూ
చెయ్యూపింది

ఆకాశం వో షాండ్లియర్.

గంటలు మోగిస్తూ
వెన్నెల్లో ఎడ్ల బండి


ఇంకే లోకమూ తెలియనివ్వని
సహయాత్ర

ఓ ఆకాశం నిండా
కలల ప్రయాణం

ఇప్పుడూ
ఎప్పుడూ.


(1996, "వలస" నించి)

నిస్సందేహంగా ఇది ప్రేమ కవితే!
Category: 7 comments

7 comments:

కెక్యూబ్ వర్మ said...

ఓ ఆకాశం నిండా
కలల ప్రయాణం..

ప్రేమికుల రోజు బహుమతి బాగుంది సార్...

ramana.pasupuleti said...

afsar, seshendrani telikapadalloki tiraggottav ...aavakaya neyyivesukoni vedannam tinnantha bagundi. chala baagundi
.... .... ramana

ramana.pasupuleti said...

afsar, seshendra, tilak kalisi raasinattundi. vedannam neyyi aavakayatho thinnatlundi

జ్యోతిర్మయి said...

ఇప్పుడూ
ఎప్పుడూ
ఎల్లప్పుడూనూ.

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు సర్.

nsmurty said...

Dear Afsar,

ఇంకే లోకమూ తెలియనివ్వని
సహయాత్ర...

That is the mark of true friendship and togetherness.

SCULPTING THOUGHTS said...

"నగరం మురికి కాల్వ
ముక్కు మూసుకుంటూ
చెయ్యూపింది"

typical Afsar-ish image.

ThanQ sir.

కాజ సురేష్ said...

"ఓ ఆకాశం నిండా కలల ప్రయాణం" అవును సార్.

Web Statistics