అమ్మ పేరు




అమ్మని ఆ నేల పొత్తిళ్లలో నిద్రపుచ్చుతున్నంత సేపూ
కురుస్తూనే వుంది వాన.

చర్చి నించి శ్మశానం దాకా.

మా కాళ్ళ కింది బురద నీళ్ళు
వొక శూన్యాన్ని చప్పుడు చేస్తున్నాయి.


పాస్టర్ పిలిచినప్పుడు చెయ్యెత్తి నిలబడ్డాను
"మరణంతో ఆగిపోతుంది ఈ దేహం చెయ్యాల్సిన పని.
ఇక మొదలు ఆత్మ యానం...."


తీరా వెనక్కి తిరుగుతున్నప్పుడు రానే వచ్చాడు సూరీడు.
వెనక్కి తిరుగుతున్న నా వేపు తీక్షణంగా చూశాడు,

వెనక్కి తిరిగాను
అమ్మని అక్కడే వదిలేసి.


ఇంటికి వెళ్తున్న దారినిండా గతుకులు
ఎప్పుడూ అది గతుకుల దారే.

నెమ్మదించినా నా అడుగులు,
క్షణం నిలవదుగా, ఈ కాలం!

పోయిన వాళ్ళ పేర్ల మధ్య నా సంచారం

అమ్మ పేరు
నా తల కింద రాతి తలగడ.


మూలం: Natasha Trethewey

ఇది స్వేచ్ఛానువాదం
Category: 9 comments

9 comments:

కెక్యూబ్ వర్మ said...

ఆర్థ్రతతో నిండిన అక్షరనీరాజనం...చాలా బాధగా వుంది చదివాక...

nsmurty said...

అఫ్సర్
ఓహ్! పరమ అద్భుతంగా ఉంది ... మీ అనువాదం.

నేల పొత్తిళ్ళు అన్న మాట ఎంత అందంగా ఉంది.

పిల్లలు బ్రతికున్నంతకాలం తల్లులు జీవించే ఉంటారు.

మనః పూర్వక అభినందనలు.

Kottapali said...

బావుంది

సుభ/subha said...

చాలా బాగుందండి..

Anonymous said...

good

Hanumantha Reddy Kodidela said...

Afsar, chaalaa baagunnayi padym, anuvaadam... rendunnuu. Thumbs Up.

Rohith said...

kotta kavulanu parichayam cheyatam lo mundunde Afsar sir ki krutagnatalu

వాసుదేవ్ said...

నేల పొత్తిళ్ళు, చప్పుళ్ళు చేస్తున్న శూన్యం, రాతి తలగడా...సరె ఇవెప్పూడూ ఎలాగూ ఉండేవే....మరణం--కాలం రెండూ రెండే, మరణం వెంటపడుతున్న కాలం పరిగెడుతూ...ఒకే నాణెంలో బంధించారు.........హ్మ్ ఇక బావుంటుంది కదా!

అక్షర కుసుమాలు... said...

very gud

Web Statistics