మెత్తటి వేళ్ళు
తలుపు తట్టినట్టు
వయొలిన్తీగల్ని నొక్కినట్టు
నరాల్లో మౌనంగా
పారే రక్తంలో
వొక మృదువయిన కదలిక
ఆలోచన గాలిపటం
తెగిపోయిన ఆకాశంలో
కనిపించీ కనిపించనట్టు
మెలికలు తిరుగుతూ
నేలరాలే అనుభూతి
చీకట్లో ముడుచుకు పడుకున్నప్పుడు
రాత్రి గోడపై తెరుచుకునే నేత్రం
బిగుసుకుపోయిన గాల్లోంచి
కరుగుతూ వచ్చి
నిశ్శబ్దాన్ని తడుముకుంటూ
వెళ్లిపోయే సంగీతం వేళ్ళు
యుద్ధభూమిగా మారిన అరచేతులు
ఆకాశాలను పొదివిపట్టుకోవాలనుకునే
చివరి ప్రయత్నంలో
నిర్జీవంగా వేలాడి
అలసిపోయిన హృదయంపై
వాలిపోతాయి
వెక్కి వెక్కి ఏడ్వలేక
ఏ ముఖంలోనూ దాక్కో లేక...!
(ఈ కవిత మొదటి కవితా సంపుటి "రక్తస్పర్శ" లో 1986లో అచ్చయింది. కానీ, ఈ కవిత నాకు గుర్తున్నంత వరకూ నేను రాసిన మొదటి కవిత 1980లో! )
8 comments:
mmmmmmmmmmmmmmmm.....love j
వయోలిన్ స్వరాలను అక్షర రాగాలుగా మార్చి .....అద్భుతంగా వుంది అఫ్సర్ సాబ్. Nutakki Raghavendra Rao (Kanakambaram.)
అక్షరాలలో దాగిన సున్నితత్వం ఇప్పటికీ అలానే జీవన వయోలిన్ రాగాలని పలికిస్తుండటం అద్భుతం...
THOLI KAVITHA KU 30 SANVATSARAALA PRAAYAMLO ADUGIDINA VELAA MAA ABHINANDANAMAALAALU .SAADARAMGAA DHARINCHANDI.
అద్భుతమైన కవిత అఫ్సర్ జీ. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది.
అధ్బుతం సర్..మీ.అల్లాబక్షు
bagundi.......
Marvellous
Post a Comment