కొన్ని దానిమ్మ గింజలు అటూ ఇటూ విసిరాను,
వొక్కో గింజలోంచి వొక్కో స్త్రీ.
ఆవలి కొండ మీద బతుకు దుప్పటి
నిండా కప్పుకొని వొకామె
రాత్రనకా పగలనకా కిటికీ పక్కన కూర్చొని-
ఏదో వొక తోటలోకి జారుకొని
చెదిరిన ముంగురులతో
వెనక్కి మళ్లుతూంది మరొకామె -
నేనేమో
నా దారిన వాళ్ళని వెతుక్కుంటూ -
నేనూ ఇంకో గింజనే
కాకపోతే, కాస్త ఎడంగా.
అంతే!
(మూలం: ఇంతియాజ్ ధార్కర్)
ఇంతియాజ్ ధార్కర్ బొమ్మలన్నా, కవిత్వమన్నా నాకు చాలా ఇష్టం.
ఆమె బొమ్మల్లోనూ, కవిత్వంలోనూ ఎక్కువగా కనిపించేది స్త్రీలే!
పాకిస్తాన్ లోని లాహోర్ లో పుట్టిన ఇంతియాజ్ తరవాత ముంబై వచ్చేసింది తన ప్రియుడితో.
ఇప్పుడు ముంబై, లండన్, వేల్స్ మధ్య పరిభ్రమణం ఆమె జీవనం.
బొమ్మలూ, కవిత్వమే జీవితం.
7 comments:
రెండూ బాగున్నై. మీ తెలుగు సేతకూడా (మూలం ఆంగ్లమా?) దానిమ్మ గింజే ఎందుకో? anything special - as in anarkali type reference?
wonderful translation sir:-) can I read the original work too?
Wonderful poetry and translations. Where can I find more of her poetry sir?
అద్భుతమైన వాక్యాలు...ధన్యవాదాలు సర్...
తిరిగీ పేరు వినటం ఆనందంగా ఉంది అఫ్సర్ గారు. తొలిసారి http://www.sawnet.org/books/authors.php?Dharker+Imtiaz ఇక్కడ చదివాను ఈమెని గూర్చి. అనువాదం బాగుంది. అలానే కవిత్వం పెయింటింగ్ ఆమ్టే http://www.forughfarrokhzad.org/selectedworks/selectedworks1.asp కూడా గుర్తుకు వచ్చింది.
varnmugguru streemoorthule kadha.saativaarini kallaku kattinattu kavitvamlo choopaaru.kavitvamtho chitraalu kooda poti paddai.varnana baagundi.parichayam chesina meeku danyavaadaalu.elaage mammulanu alarinchandi meekavitva thathvamtho.
ఇలా కాస్త మార్మికంగా సాగే పద్యాలు వొక్కో సారి భలే హత్తుకుపోతాయి మనసుకి ....మీ అనువాద మహిమ దానికి తోడయింది అనుకోండి....మరి మన కవయిత్రులు ఎవరయినా ఇలా ఈ తరహాలో చెప్పినట్టు గుర్తుందా ....ఒకటీ అరా అయినా...?
Post a Comment