నిడదవోలు మాలతి కి మొల్ల పురస్కార ప్రదానం
-
ఏడు శతాబ్దాల నాటి రచయిత్రి మొల్ల. ఏడు వసంతాల సాహిత్య సౌరభం మాలతి గారు. ఈ
ఇద్దరినీ, మరెందరో సాహిత్య విమర్శకులను, అభిమానులను కలుపుతున్న సాంకేతిక జూమ్
స...
1 year ago
7 comments:
మరిన్ని బ్లాగు పొస్ట్ లకు www.andhravani.in
ఇదంటారూ - బాగుంది. అర్థమయ్యింది, కవి హృదయం తెలిసింది.
అదంటారూ - బావులేదు. అర్థం కాలేదు, కవి హృదయం తెలియలేదు.
ఇది బాగుంది కాబట్టి అర్థమయ్యిందా?
అర్థమయ్యింది కాబట్టి ఇది బాగుందా?
అది బావులేదు కాబట్టి అర్థం కాలేదా?
అర్థం కాలేదు కాబట్టి అది బావులేదా?
కవి హృదయం తెలిసింది కాబట్టి ఇది బాగుందా?
ఇది బాగుంది కాబట్టి కవి హృదయం తెలిసిందా?
కవి హృదయం తెలీలేదు కాబట్టి అది బావులేదా?
అది బావులేదు కాబట్టి కవి హృదయం తెలియలేదా?
కవి హృదయం తెలిసింది కాబట్టి ఇది అర్థమయ్యిందా?
ఇది అర్థమయ్యింది కాబట్టి కవి హృదయం తెలిసిందా?
కవి హృదయం తెలీలేదు కాబట్టి అది అర్థం కాలేదా?
అది అర్థం కాలేదు కాబట్టి కవి హృదయం తెలీలేదా?
దానికి అర్థం లేక కవి హృదయం తెలీలేదా?
కవి హృదయం తెలీక దానికి అర్థం లేదనుకుంటున్నామా?
దానికి అర్థం లేక బావులేదా?
బావులేదు కాబట్టి దానికి అర్థం లేదనుకుంటున్నామా?
అన్నీ ప్రశ్నలే! అన్నీ జవాబులే!
మరణం ముందు జన్మభూమి తలవంచింది
మృత్యువంటే మరి మాటలా?
లోహ కంకణాలు ఘల్లుమనిపిస్తూ వస్తుందాయె
వందనం మృత్యుమాతా, వందనం
జన్మభూమికి పెద్ద నిలువు నామం
ఇంతటితో ఈ వ్యధ సమాప్తం!
ఒక మాట నిలువునా చీలిన చోట
ఒక దృశ్యం నిర్లిప్తంగా నిష్క్రమించిన చోట
ఒక మనిషి నిశ్శబ్దంలోకి వెలివేయబడిన చోట
నిజంగా మరణం-
నిజమే అఫ్సర్ జీ !మరి ఆ మరణ కారకులకు శిక్ష ఎదీ?
చాలా బావుంది అఫ్సర్ గారు .
ఒక పరిచిత హస్తం
మృత్యుఖడ్గంగా రూపెత్తిన ప్పుడూ
నిజంగా మరణం.
ఈ వాక్యం అక్షరమంత సత్యం సారూ..
ఇలా మరల పాతవాటిని పరిచయం చేయడం చాలా బాగుంది..
వంశీ గారూ మొత్తం మీద చావు అంటే భయంతో అర్థమైందని ఒప్పుకున్నట్లున్నారు....
మనసుకి కలిగే గాయాలను మరణంతో పోల్చుకునే భావ కవులకు, ఆకలి మరణాల్నో, వుప్పెన మరణాల్నో, హత్యల మరణాల్నో, ఆత్మహత్యల మరణాల్నో, భ్రూణ హత్యల మరణాల్నో తక్కువ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అసలు ఆ పోలికే అసమంజసంగా వుంది. మనసులకి వచ్చే మరణాల వల్ల, చాలా మంది, సుష్టుగా భోజనాలు చేసి, కవిత్వం రాసుకుంటూ, చదువుకుంటూ వ్యధ చెందుతూ వుంటారు. ఇది మానసికం మాత్రమే. ప్రకృతి పరమైనది కాదు. మిగిలిన మరణాలు ప్రకృతిలో జరిగేవి. వాటి వల్ల ఆ మనుషులు తిరిగి రారు. ఆ మనుషులకి జరిగిన అన్యాయాలకి, ఎవరూ ఎప్పటికీ న్యాయం చేకూర్చలేరు. మనసుకి కలిగే మరణాలను ఆత్మ స్థైర్యంతో ఆపుకోవచ్చు. లేదా, ధైర్యంతో మళ్ళీ మనసుకి జన్మ ఇవ్వచ్చు. కానీ ఈ ప్రకృతి మరణాల విషయంలో అలా కాదు. అందుకని ఈ పోలిక చాలా క్రూరంగా వుంది.
Post a Comment