1.
నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ
వణికి పోలేదు కాబట్టి,
లేదూ కాస్తయినా జారిపోలేదు కాబట్టీ, నీకు యింకా చాలా తెలియవ్.
నిజానికి ఈ వివర్ణ ముఖాల నగరపు చలి తప్ప
యింకే జీవన్మరణ ప్రకంపనలూ తెలియవు కాబట్టి
నీకు నువ్వో ఆ అవతలి ఇంకొక ముఖమో తెలియనే తెలియదు.

చలిలో ఎండాకాలాన్నీ, ఎండలో చలికాలాన్నీ
అందంగా పునఃసృష్టించుకునే తెలివో తేటదనమో నీకు ఉండనే వుంది కాబట్టి
అసలే జీవితం ఎలా తెల్లారుతుందో,
అంత హటాత్తుగానే ఏ మరణం ఎందుకు దాపురిస్తుందో నీకు యెప్పటికీ తెలియకనే పోవచ్చు.

కాని, అసలవేవీ జీవితమే
కాదంటావే,
అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై లేకుండా!

2.
యెప్పటి నించి ఆలోచించడం
మొదలు పెట్టావో నువ్వు,
యెప్పటి నించి దేన్ని యెలా అనుభవించడం మొదలెట్టావో నువ్వు,
వొక బాధలో యింకో వొంటరితనంలో
మరింకో చావు కన్నా పీడలాంటి బతుకులో యేది యెందుకు యెలా కమ్ముకొస్తుందో
యెవరిని యే క్షణం యెలా కుమ్మేస్తూ పోతుందో ఏదీ ఏదీ నీ వూహకి కూడా అందదు.

నువ్వొక అద్దాల గదిలోపల గదిలో సమాధి తవ్వుకుంటూ
వుంటావ్!
దాన్ని తెరిచే సూర్యకిరణపు తాళం చేయిని యెక్కడో పారేసుకుని వుంటావ్!

3.
నువ్వు పడుకున్న గదిలో కాస్త చలిగా వుందనో,
నీ పక్కన పడుకున్న దేహంలో కొంత వెచ్చదనం చచ్చిపోయిందనో,
నువ్వు ఎక్కాల్సిన మెట్టు చూస్తూ చూస్తూ వుండగానే చప్పున జారిపోయిందనో
రాత్రీ పగలూ గుండెలు బాదుకొని యేడుస్తూ వుండిపోతావ్ తప్ప,
యింకో గుండెలోకి ప్రవేశించి అక్కడి గాయాన్ని పలకరించి రాలేవ్ నువ్వు.
వొక కోరిక నించి యింకో కోరికలోకి వలసెళ్ళే ఏమరుపాటులోనో తొందరపాటులోనో
అన్ని స్థలాలూ, కాలాలూ, వూహలూ చెక్కుచెదరని అందమైన అమరిక నీకు.

మహా బలిదానాలే
చేయక్కర్లేదు,
కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.

4.
ఇవాళ నేలా వణికి పోతుంది
గజగజ.
రేపు ఆకాశమూ తొణికిపోతుంది
వానచుక్కలా.
యీ సూర్యుడూ యీ చంద్రుడూ
యింకేవీ నిలబడవ్ యింత ఠీవిగా యిప్పటిలాగానే.
జీవితం కొన్ని చేతుల్లోంచి
యెట్లా పట్టుతప్పి పోతుందో
అలాగే కచ్చితంగా అలాగే
ఇవన్నీ నెలవు తప్పి ఎటేటో రాలిపోతాయి,
నీకేమీ చెప్పకుండానే.
5.
నిజంగా
నీకు యింకా చాలా జీవితం
తెలియనే తెలియదు,
నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ
వణికి పోలేదు కాబట్టే!
1 comments:
నాగరికత కోల్పోతున్న మనిషితనం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు సర్.
Post a Comment