1
రాత్రిని నిలదీసి నువ్వేమీ అడగలేవు
వానలో తడుస్తున్న చీకట్నీ
ఏ కౌగిలి కోసమో దూసుకుపోతున్న ఈదురుగాలినీ అడగలేవు
వొక గాయం రెండు తలుపులూ బార్లా తెరిచి
నీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు
నిన్ను
నువ్వు కూడా ఏమీ అడగలేవు.
2
పో
వెళ్లిపో గాయంలోకే
చిన్ని అడుగుల ముద్దు పాదాల ముద్రలు కొలుచుకుంటూ
3
అటు తిరిగి ఇటు మెసలి
అటుఇటు ఎటూ తిరగలేని
నోరు మెదపలేని నిద్ర లేని రాత్రి
4
కనురెప్పకి నిప్పుల కాపలా
తెల్లారే దాకా.
5
ఎవరు దుఃఖిస్తున్నారో
ఎవరు ఎవరు దుఃఖాన్ని వూహిస్తున్నారో
పరకాయ ప్రవేశమే తేలిక
పర గాయ ప్రవేశం కన్నా!
6
నదిలోకి పడవ వదిలినట్టుగా
నా శరీరంలోకి కాస్త నిద్ర నొదిలి రాగలవా?
బతిమాలుకుంటున్నా
రాత్రి గడ్డం పట్టుకొని.
7
అందరూ నిద్రపోతున్నారు
నీ కంటి కింద దీపం పెట్టి,
ఈ రాత్రిని
ఇలా వెలిగించుకో అని శాపం పెట్టి.
(ఏప్రిల్ 20... తెల్లారబోతూ....చాలా
రోజుల తరవాత ‘నిద్రకి వెలినై...నేనొంటరినై..’ పల్లవినై...)
13 comments:
నదిలోకి పడవ వదిలినట్టుగా
నా శరీరంలోకి కాస్త నిద్ర నొదిలి రాగలవా?
బతిమాలుకుంటున్నా
రాత్రి గడ్డం పట్టుకొని.Wonderful Sir.._/\_
చాలా బావుంది అఫ్సర్ జీ. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తోంది.
"పరకాయ ప్రవేశమే తేలిక
పర గాయ ప్రవేశం కన్నా!"
సూపర్ .
"నదిలోకి పడవ వదిలినట్టుగా
నా శరీరంలోకి కాస్త నిద్ర నొదిలి రాగలవా?"
దానినేమీ అనకు
తలపుతలుపు తోసుకుని
అలా నిర్దయగా వెళ్ళిందనుకోకు
మెలిపెట్టిన రాత్రిని
అందమైన పదచిత్రం చెయ్యడంకోసమే
నిన్నొదిలి అలా వెళ్ళింది
అంతగా బ్రతిమాలాక
తిరిగి వస్తుందిలే!
దానినేమీ అనకు
దానినేమీ అనకు
తలపుతలుపు తోసుకుని
అలా నిర్దయగా వెళ్ళిందనుకోకు
మెలిపెట్టిన రాత్రిని
అందమైన పదచిత్రం చెయ్యడంకోసమే
నిన్నొదిలి అలా వెళ్ళింది
అంతగా బ్రతిమాలాక
తిరిగి వస్తుందిలే!
దానినేమీ అనకు
no words to say ,, apart from saying wonderful ..
Each and every line is amazing...
Great poetic lines Sir
yentha bagundo ...!!!
కెక్యూబ్ వర్మ, ప్రసూన, జాన్, మెర్సీ, పద్మార్పిత, సామాన్య...చాలా థాంక్స్ అండీ!
mee pranam theesi kavithaku praanam posaaru... ilaanti kavithalu chaduvukuntundagaa .. naaku aparimithamyna sakthi vastundi.... krithagnthalu.. mee kavithaku ,, meeku,,,,
mee pranam theesi kavithaku praanam posaaru... ilaanti kavithalu chaduvukuntundagaa .. naaku aparimithamyna sakthi vastundi.... krithagnthalu.. mee kavithaku ,, meeku,,,,
mee pranam theesi kavithaku praanam posaaru... ilaanti kavithalu chaduvukuntundagaa .. naaku aparimithamyna sakthi vastundi.... krithagnthalu.. mee kavithaku ,, meeku,,,,
excellent expression in every stanza afsar sir.
Excellent expression in every stanza ,afsar sir.
Post a Comment